రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ
చేసిన ప్రతీ సారి తృప్తిగా నాలుగు ముద్దలు తినిపించేటంత రుచిగా ఉండే స్పెషల్ రెసిపీ రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ కూర. నూనె వంకాయ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో వివరంగా ఉంది చూడండి .
వంకాయ కూరలు ఎన్నో రకాలు అందులో ఆంధ్రా రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ పులసు ఎంతో ప్రేత్యేకం, పుల్లగా ఘాటుగా కారంగా చిక్కని గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది నూనె వంకాయ.
వంకాయ కూర అంటే తెలుగు వారు ప్రయాణం పెట్టేస్తారు అందుకే ఎన్ని రకాల వంకాయ కూరలో. కులానికి ప్రాంతానికి ఒక్కో రకంగా వంకాయ కూరలు చేస్తారు తెలుగు వారు. అలాగే ఇది కూడా.
నిజానికి ఆంధ్రాలో నెల్లూరు నూనె వంకాయ కూరకి స్పెషల్, అది మరో సారి చెప్తా. రాయలసీమ వారి నూనె వంకాయ తమిళనాడు టచ్తో ఎంతో రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే నూనె వంకాయ కూరకి కొన్ని టిప్స్ ఉన్నాయి అవి ఫాలో అవుతూ చేయండి బెస్ట్ టెస్ట్ని ఎంజాయ్ చేయండి.

టిప్స్
వంకాయ:
నిజానికి రాయలసీమలో నీలం తెలుపు కలగలపుగా ఉండే ముళ్ళ వంకాయలు వాడతారు. నాకు హైదరాబాదులో అవి దొరకనందున నేను ముదురు నీలం రంగు వంకాయలు వాడాను.
మసాలా పేస్ట్:
మసాలా పేస్ట్ క్రీమ్ అంత స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే రుచి గ్రేవీకి. ఇంకా గ్రేవీ సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక మగ్గించాలి అప్పుడు కూరకి మాంచి రంగు రుచి.
నూనె:
ఈ కూరకి కాస్త నూనె ఉండాలి, అసలే నూనె వంకాయ కూర మరి. సాధారణంగా వంకాయ గోంగూరకి నూనె ఉంటేనే రుచి.
రాయలసీమ స్పెషల్ నూనె వంకాయ - రెసిపీ వీడియో
Rayalaseema Special Brinjal Curry | Nune Vankaya | How to make Brinjal Gravy Curry
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
మసాలా పేస్ట్ కోసం
- 2 tbsp నూనె
- 1 cup ఉల్లిపాయ తరుగు
- 1 tbsp పచ్చి శెనగపప్పు
- ఉప్పు
- 1 tsp జీలకర్ర
- 2 పచ్చిమిర్చి
- 2 టొమాటో
- 2 చిటికెళ్లు పసుపు
- 1/4 cup పచ్చి కొబ్బరి
- నీళ్ళు మెత్తగా గ్రైండ్ చేసుకోడానికి
-
కూర కోసం
- 4 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 2 కరివేపాకు రెబ్బలు
- 10 వెల్లులి
- 1 tsp మిరియాలు
- 2 tsp కారం
- 2 tbsp ధనియాల పొడి
- 10 - 12 వంకాయ
- 1/3 cup చింతపండు (70 gm చింతపండు నుండి తీసినది)
- ఉప్పు
- 1/4 cup కొత్తిమీర
విధానం
-
నూనె వేడి చేసి మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి వేపుకుని ఆఖరున టొమాటో ముక్కలు వేసి టొమాటో మెత్తబడే దాకా వేపుకోవాలి.
-
వేపుకున్న టొమాటో ఉల్లిపాయని మిక్సీలో వేసి అందులోనే పచ్చికొబ్బరి ముక్కలు వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి ( నిజానికి కొబ్బరి నూనెలోనె వేపాలి నేను మర్చిపోయా అందుకే గ్రైండ్ చేసేప్పుడు వేసి మేనేజ్ చేశా).
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లులి మిరియాలు ఉల్లిపాయ తరుగు వేసి వేపుకోవాలి.
-
ఉల్లిపాయలు మెత్తబడ్డాక చీరిన వంకాయలు, ఉప్పు వేసి వంకాయలు మెత్తబడే దాకా మూతపెట్టి వేపుకోవాలి.
-
వంకాయలు మెత్తబడ్డాక కారం, ధనియాల పొడి వేసి వేపుకోవాలి తరువాత చింతపండు పులుసు పోసి నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి.
-
నూనె పైకి తేలాక మసాల పేస్ట్ కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద నూనె పైకి వచ్చేదాక ఉడికించుకోవాలి.
-
నూనె పైకి వచ్చాక కొత్తిమీర తరుగు చల్లి కలిపి దింపేసుకోవాలి. ఈ నూనె వంకాయ కూర వేడి వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
2 comments