బెండకయ బజ్జీ | బెండకాయ పుల్ల కూర
ఎన్ని కొత్త రుచులొచ్చినా పల్లె వంటకాల రుచికి ఏది సాటి రాదు, అలా చెప్పాలంటే రాయలసీమ స్పెషల్ బెండకాయా బజ్జి రెసిపీ గురుంచి చెప్పాలి. పుల్లగా కారంగా వేడిగా అన్నం, జొన్న రొట్టెల, రాగి సంగటిలోకి చాలా రుచిగా ఉంటుంది.
బజ్జి అంటే మెత్తగా మెదపడం చిదమడం అని అర్ధం. దాదాపుగా ఇదే తీరు ఆంధ్రా, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో కూడా చేస్తారు చిన్న మార్పులతో. ఆంధ్రులు మాత్రం దీన్ని పుల్లకూర అంటారు. నేను ఈ రెసిపీ పూర్తిగా రాయలసీమ గ్రామీణ తీరులో చేస్తున్న అందుకే మట్టి పాత్రలో చేశాను.
రాయలసీమలో దాదాపుగా ఇదే తీరులో ఇంకొన్ని బజ్జీ వంటకాలు ఉన్నాయ్. కొన్ని పొయ్యిలో కాల్చి నూరి చేస్తారు అవి మరో సారి చెప్తా.

టిప్స్
-
ఈ బజ్జీకి కాస్త నూనె ఉంటేనే జిగురు తక్కువగా ఉంటుంది, ఇంకా రుచిగా ఉంటుంది.
-
ఉల్లిపాయ టొమాటో ఏదీ కూడా మరీ మెత్తగా గుజ్జులా వేగకూడదు. కేవలం మగ్గితే చాలు. అలా మగ్గితేనే బజ్జీలో ప్రతీ పదార్ధం నోటికి అందుతుంది.
-
లేత బెండకాయలు చాలా రుచిగా ఉంటుంది ఈ బజ్జీకి. ఇంకా బెండకాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద జిగురుపోయేదాక మూత పెట్టి వేపుకోవాలి. మధ్య మధ్యన నెమ్మదిగా కలుపుకోవాలి. ఎక్కువగా కలిపితే జిగురుజిగురుగా ఉంటుంది.
-
బెండకాయ వేగిన తరువాతే నీరు పోసి మెత్తగా మగ్గించాలి లేదంటే జిగురు వస్తుంది. బజ్జీ దింపే సమయానికి బెండకాయ మెత్తగా మగ్గిపోవాలి, ఇంకా కాస్త నీరు ఉండాలి కూరలో అప్పుడే ఎనిపిన తరువాత కాస్త పల్చగా ఉంటుంది, అప్పుడు కలుపుకునేందుకు వీలుగా సులువుగా ఉంటుంది. లేదంటే పచ్చడిలా గట్టిగా అవుతుంది. అప్పుడు నెయ్యి వేసి కలుపుకోవాలి.
-
బెండకాయ బజ్జీ కాస్త పుల్లాగానే ఉంటుంది. కాబట్టి పులుపుకి తగినట్లు ఉప్పు కారం రుచి చూసి వేసుకోవాలి. లేదంటే అంత రుచిగా ఉండదు.
బెండకయ బజ్జీ | బెండకాయ పుల్ల కూర - రెసిపీ వీడియో
Rayalaseema Special Bendkaya Bajji | Okra Curry | Bendakaya Pullagura | Vendakkai Recipe
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 3 tbsp నూనె
- 10 వెల్లులి
- 2 ఉల్లిపాయ
- 2 టొమాటో
- 1/2 tsp పసుపు
- ఉప్పు
- 8 పచ్చిమిర్చి
- 50 gm చింతపండు (నానబెట్టినది)
- 300 ml నీళ్ళు
- 300 బెండకాయ ముక్కలు (అంగుళం ముక్కలు)
-
తాలింపు
- 1 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 4 ఎండుమిర్చి
- 2 రెబ్బలు కరివేపాకు
విధానం
-
నూనె వేడి చేసి అందులో వెల్లులి వేసి వేగనివ్వాలి. వేగిన వెల్లులి లో ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక నిమిషం మగ్గనివాలి.
-
మగ్గిన ఉల్లిపాయాల్లో టొమాటో ముక్కలు, పసుపు ఉప్పు వేసి టొమాటో మెత్తబడేదాకా వేపుకోవాలి.
-
మెత్తబడిన టొమాటోలో బెండకాయ ముక్కలు వేసి కలిపి బెండకాయలో జిగురు వదిలేదాక మూతపెట్టి మగ్గించుకోవాలి.
-
బెండకాయాల్లో జిగురు వదిలిన తరువాత పచ్చిమిర్చి, చింతపండు నీళ్ళు పోసి బెండకాయ మెత్తగా అయ్యేదాక మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గించుకోవాలి.
-
మెత్తగా మగ్గిన బెండకాయ బజజీని దింపి పప్పు గుత్తితో కచ్చాపచ్చాగా ఎనుపుకోవాలి
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు, ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు పెట్టి బజ్జీలవ కలుపుకోవాలి.
-
ఈ బెండకాయ బజ్జీ వేడిగా అన్నంలోకి, జొన్న రొట్టె, రాగి సంగటిలోకి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×