రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ | మేతి చమన్ రెసిపీ | మేథీ చమన్ రెసిపీ
రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ - ఉల్లిపాయల్లో టమాటో ముక్కలు మసాలాలు వేసి ఎర్రగావేపి అందులో మెంతికూర ఆకు తరుగు జీడిపప్పు ముద్దా, పనీర్, క్రీమ్ వేసి చేసే ఈ కర్రీకి ఒక స్పెషల్ ఫాన్స్ ఉంటారు అంటే అతిశయోక్తి కాదేమో!!!
రోటీలు జీరా రైస్ తో ఒక గొప్ప జోడి ఈ మేతి చమన్.తెలిసి తెలియని మెంతి ఆకు చిరు చేదుతో, కమ్మని చిక్కని ఉల్లి టమాటో గ్రేవీ పనీర్ తురుముతోఉండే ఈ కర్రీ ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది.
ఈ సింపుల్ రెసిపీని మీరు కింద చెప్పిన కొలతలు టిప్స్ ని పాటించండి రెస్టారెంట్ రుచి ఇంట్లోనే ఆశ్వాదించండి.

టిప్స్
మెంతి కూర:
- మేతి కూర ఎర్రగా వేగితే చేదు తగ్గి రుచిగా ఉంటుంది.
ఫ్రెష్ క్రీమ్:
- ఫ్రెష్ క్రీమ్ వేస్తేనే మెంతి చేదు తగ్గి కూర కమ్మగా తయారవుతుంది. ఇంకా ఫ్రెష్ క్రీమ్ వేసి వెంటనే దింపేసుకోవాలి లేదంటే క్రీమ్ కరిగి నూనెగా పైకి తేలుతుంది, అస్సులు తినలేరు.
ఇంకొన్ని విషయాలు:
-
జీడీపప్పు పేస్ట్ తో పాటుగా నచ్చితే ఇంకొన్ని జీడిపప్పుని ఎర్రగా వేపి కూడా కలుపుకోవచ్చు. నేను కేవలం జీడిపప్పు ముద్ద మాత్రమే వేశాను.
-
ఈ కూర లో వేసే ప్రతీ పదార్ధం నిదానంగా నూనె పైకి తేలేదాక వేపుకోవాలి, అప్పుడే చాలా రుచిగా కుదురుతుంది.
రెస్టారెంట్ స్టైల్ మేథీ చమన్ | మేతి చమన్ రెసిపీ | మేథీ చమన్ రెసిపీ - రెసిపీ వీడియో
Restaurant style Methi Chaman Recipe | Methi Chaman | Methi Chaman Recipe
Prep Time 10 mins
Soaking Time 30 mins
Cook Time 25 mins
Total Time 1 hr 5 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- ¼ cup నూనె
- ½ tsp జీలకర్ర
- ½ tsp సోంపు
- 1 cup ఉల్లిపాయ తరుగు
- 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
- 2 tsp పచ్చిమిర్చి తరుగు
- ½ cup టమాటో ముక్కలు
- 1 tsp ధనియాల పొడి
- ¼ tsp పసుపు
- ½ tsp గరం మసాలా
- 1 tsp జీలకర్ర పొడి
- 1 tbsp కసూరి మేథీ
- ఉప్పు (రుచికి సరిపడా)
- 3 cups మేథీ కూర తరుగు
- ¼ cup జీడిపప్పు
- ⅓ cup ఫ్రెష్ క్రీమ్
- 200 gms పనీర్
- ½ tbsp నెయ్యి
- 1 cup నీరు
విధానం
-
ముందుగా జీడిపప్పుని వేడి నీళ్లలో ముప్పై నిమిషాలు నానబెట్టి మెత్తగా గ్రైండ్ చేసి పక్కనుంచుకోండి.
-
నూనె వేడి చేసి అందులో జీలకర్ర సోంపు వేసి చిట్లనివ్వాలి. చిట్లిన జీలకర్రలో ఉల్లిపాయ తరుగు వేసి ఎర్రగా బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిలో అల్లం వెల్లులి ముద్దా, పచ్చిమిర్చి తరుగు వేసి వేపుకోండి.
-
తరువాత టమాటో తరుగు వేసి టమాటో కచ్చితంగా గుజ్జుగా అయ్యేదాకా మెత్తగా మగ్గించాలి.
-
మగ్గిన టమాటోలో ఉప్పు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కసూరి మేతి కొద్దిగా నీరు వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి మసాలాలని.
-
మసాలాలు వేగాక మెంతి కూర ఆకు తరుగు వేసి నూనె పైకి తేలేదాకా వేపుకోవాలి.
-
వేగిన ఆకులో జీడిపప్పు ముద్దా వేడి నీరు పోసి కలిపి గ్రేవీని 15 నిమిషాలు వదిలేస్తే నూనె పైకి తేలుతుంది.
-
నూనె పైకి తేలిన తరువాత సన్నని పనీర్ ముక్కలు వంద గ్రాములు కసూరి మేథీ మిగిలిన వంద గ్రాముల పనీర్ తురుము ఫ్రెష్ క్రీమ్ నెయ్యి వేసి కలిపి దింపేసుకోండి.
-
ఈ మేథీ చమన్ రోటీలు జీరా రైస్ తో రుచిగా ఉంటుంది.

Leave a comment ×
2 comments