బెస్ట్ స్వీట్ చిల్లీ చికెన్

ఫ్రైడ్ రైస్తో జోడీగా లేదా పార్టీ స్టార్టర్గా పర్ఫెక్ట్ రెస్టారంట్ స్టయిల్ స్వీట్ చిల్లీ చికెన్. 100% రెస్టారంట్ టెస్ట్ గారంటీ.

సింపుల్ స్వీట్ చిల్లీ చికెన్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇంజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి ఇండో – చైనీస్ రెసిపీస్ పార్టీలకి చాలా పర్ఫెక్ట్. ఈ స్వీట్ చిల్లీ చికెన్ రెసిపీ కారంగా ఘాటుగా కాస్త తియ్యగా చిక్కని గ్రేవీతో చాలా రుచిగా ఉంటుంది. అంత రుచిగా ఉంటుంది కాబట్టే రెస్టారెంట్లలో ఎక్కువగా ఆర్డర్ చేసే రెసిపీస్లో టాప్ లిస్ట్లో ఉంటుంది.

నిజానికి నాకు చిల్లీ చికెన్ రెసిపీ ఎక్కువ ఇష్టం, కానీ ఎక్కువ మంది ఫాలోవర్స్ స్వీట్ చిల్లీ చికెన్ రెసిపీ కావాలని అడగడం వల్ల ముందు ఈ రెసిపీ పోస్ట్ చేస్తున్నా, త్వరలో స్పైసీగా ఉండే చిల్లీ చికెన్ రెసిపీ పోస్ట్ చేస్తా!

ఈ స్వీట్ చిల్లీ చికెన్ వెజ్ ఫ్రైడ్ రైస్తో చాలా రుచిగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని స్పెషల్ టిప్స్

టిప్స్

చికెన్:

  1. చికెన్ ఉపపేసిన నీళ్ళలో 30 నిమిషాలు నానబెడితే బోనలేస్స్ చికెన్ మెత్తబడుతుంది, త్వరగా వేగుతుంది

  2. చికెన్కి కోటింగ్ మరీ గట్టిగా చిక్కగా కోటింగ్ ఇస్తే ఫ్లేవర్స్ లోపలికి పట్టవు. గ్రేవీలో ఉడికిన తరువాత సాసులు పై పైనే ఉండి అంత రుచిగా ఉండదు

  3. చికెన్ దీప ఫ్రై లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మాత్రమే ఫ్రై చేస్తే చాలు, అంత కంటే ఎక్కువగా ఫ్రై చేస్తే చికెన్ గట్టిగా అయి సాసులు పట్టవు

  4. చికెన్ సాసులు కాస్త చిక్కబడ్డాక వేస్తే సరిపోతుంది, సాసులు చిక్కగా ఉన్నప్పుడు వేస్తే ఫ్లేవర్స్ ఇంకావు చికెన్ లోకి

ఇంకొన్ని విషయాలు:

  1. చిల్లీ చికెన్ అంటే కలర్ కాప్సికం వాడతారు, మీకు అందుబాటులో లేకుంటే గ్రీన్ కాప్సికం మాత్రమే వాడుకోవచ్చు

  2. చైనీస్ చిల్లీ సాస్ లేకుంటే షెజ్వాన్ సాస్ అయినా వాడుకోవచ్చు

  3. వెజ్జీస్ ఎక్కువగా ఉడికించకూడదు అలా ఉడికితే తినెప్పుడు అంత రుచిగా ఉండదు

బెస్ట్ స్వీట్ చిల్లీ చికెన్ - రెసిపీ వీడియో

Restaurant style Sweet Chilli chicken | Easy Sweet Chili Chicken Recipe

Restaurant Style Recipes | nonvegetarian

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms బోన్లెస్ చికెన్
  • 2 tbsp గిలకొట్టిన గుడ్డు
  • 1 tbsp మైదా
  • 1 tbsp కార్న్ ఫ్లోర్
  • సాల్ట్
  • 3 tsp నీళ్ళు
  • గ్రేవీ కోసం
  • 2 tbsp నూనె
  • 1.5 tbsp వెల్లులి తరుగు
  • 2 tbsp ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp పచ్చిమిర్చి సన్నని తరుగు
  • 7 - 8 ఉల్లిపాయ పెద్ద పాయలు
  • 5 - 6 గ్రీన్ కాప్సికం ముక్కలు
  • 5 - 6 ఎల్లో కాప్సికం ముక్కలు
  • 5 - 6 రెడ్ కాప్సికం ముక్కలు
  • 1/2 tsp ఆరొమేట్ పౌడర్
  • 1 tsp వైట్ పెప్పర్ పొడి
  • సాల్ట్
  • 1/2 tsp పంచదార
  • 1/2 tsp మిరియాల పొడి
  • 1 tbsp గ్రీన్ చిల్లీ సస్స్
  • 1.5 tbsp చైనీస్ చిల్లీ పేస్ట్
  • 1 tbsp స్వీట్ చిల్లీ సాస్
  • 1 tsp టొమాటో కేట్చాప్
  • 1/2 tsp డార్క్ సోయా సాస్
  • 1 tsp తేనే
  • 300 ml నీళ్ళు
  • 2 tbsp స్ప్రింగ్ ఆనీయన్ తరుగు

విధానం

  1. చికెన్లో మిగిలిన సామానంతా వేసి పల్చని కోటింగ్ ఇవ్వాలి.
  2. కోటింగ్ ఇచ్చిన చికెన్ని వేడి వేడి నూనెలో వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకోవాలి.
  3. పాన్లో నూనె వేడి చేసి అందులో వెల్లులి ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు వేసి వెల్లులి ఎర్రబడే దాకా ఫ్రై చేసుకోవాలి.
  4. తరువాత కాప్సికం ఇంకా మిగిలిన వెజ్జీస్ అన్నీ వేసి 1 నిమిషం టాస్ చేసుకోవాలి.
  5. టాస్ చేసుకున్న వెజ్జీస్లో మిగిలిన సాసులు అన్నీ వేసి టాస్ చేసి 300ml నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద సాసులు కాస్త చిక్కబడనివ్వాలి.
  6. హై ఫ్లేమ్ మీద సాసులు కొద్దిగా చిక్కబడ్డాక వేపుకున్న చికెన్ వేసి మరో 3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి, దింపే ముందు తేనె స్ప్రింగ్ ఆనీయన్ తరుగు చల్లి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.