బియ్యం పిండి మురుకులు | కారప్పూస | జంతికలు | చక్రాలు

Snacks
5.0 AVERAGE
5 Comments

చికాకు పెట్టె కొలతలు టిప్స్తో కాక చిటికెలో తయారయ్యే స్నాక్ కోసం చూస్తున్నారా! అయితే ఆంధ్రా స్పెషల్ బియ్యం పిండి కారప్పూస ట్రై చేయండి. స్టెప్ బై స్టెప్ ఫోటోతో ఇంకా వీడియో తో వివరంగా ఉంది రెసిపి చూడండి.

బియ్యం పిండి...కారప్పూస/మురుకులు/జంతికలు/చక్రాలు ఇలా రకరకాల పేర్లతో ప్రాంతాన్ని బట్టి పిలుస్తుంటారు! ఎవరు ఏ పేరుతో పిలిచినా ఎలాంటి మార్పులతో చేసినా బెస్ట్ టైం-పాస్ స్నాక్ ఆంధ్రా స్పెషల్ బియ్యంపిండి చక్రాలు.

ఈ చక్రాల్లోనే ఎన్నో రాకాలున్నాయ్. కొందరు కొన్నేస్తే ఇంకొందరు ఇంకోటి వేస్తారు. ప్రాంతాన్ని బట్టి రుచి తీరు మారిపోతుంది. ఇంకా మిల్లెట్స్ తో కూడా చేసుకోవచ్చు అవన్నీ త్వరలో చెప్తా.

Rice Flour Murukku | Kaarappusa | Chakli | Jantikas | Chakrams | How to make Andhra style Murukulu

టిప్స్

మినపప్పుకి బదులు ఇంకేమీ వాడవచ్చు?

• మినపప్పు కారప్పూసకి జిగురు గుల్లదనానిచ్చి రుచి పెంచుతాయ్. ఇది ఒక రకం. నచ్చని వారు పుట్నాల పప్పు వేసుకోవచ్చు. ఇంకా నువ్వులు కూడా వేసుకోవచ్చు. నచ్చితే కారం వేసుకోవచ్చు. ఈ చక్రాలు వాము ఘాటుతో చాలా రుచిగా ఉంటాయ్. కాస్త తెల్లగా ఉంటాయి. నచ్చితే కారం వేసుకోవచ్చు. కానీ ముదురు ఎరుపు రంగులో ఉంటాయి.

చక్రాలు ఎందుకు మెత్తగా వస్తాయ్?

• కారప్పూస/ చక్రాలు ఇలా పిండి వంటలు దేనికైనా మాంచి సెగ తగలాలి, అప్పుడు కరకరలాడుతూ వస్తాయ్.

• చక్రాలు నూనె లో వేసే ముందు నూనె బాగా వేడిగా ఉండాలి. అప్పుడు మంట తగ్గించి ముకుడు సైజ్ కంటే 2 తక్కువగానే వేసుకోవాలి. చక్రాలు వేశాక మంట హై-ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా వేపుకోవాలి

• ఇళ్ళలో ఉండే స్టవ్లకి అంత మంట ఉండదు. అందుకే కొద్దికొద్దిగా వేసుకుంటూ వేపుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయ్.

• రెండో వాయికి మంట తగ్గించి వేసి మళ్ళీ ఫ్లేమ్ పెంచుకుని వేపుకోవాలి.

• చక్రాలకి పిండి కాస్త మెత్తగా కలుపుకోవాలి. గట్టిగా కలిపితే ఎండిపోయినట్లు వస్తాయ్ చక్రాలు.

బియ్యం పిండి మురుకులు | కారప్పూస | జంతికలు | చక్రాలు - రెసిపీ వీడియో

Rice Flour Murukku | Kaarappusa | Chakli | Jantikas | Chakrams | How to make Andhra style Murukulu

Snacks | vegetarian

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms బియ్యం
  • 50 gms మినపప్పు
  • 1 tbsp నూనె
  • ఉప్పు
  • 1 tbsp వాము
  • నూనె- వేపుకోడానికి
  • నీళ్ళు పిండి తడుపుకోడానికి

విధానం

  1. బియ్యం, మినపప్పు కలిపి మెత్తగా మర ఆడించి మళ్ళీ జల్లించి పిండి వాడుకోండి. (ఇదే కేజీకి చేసుకొంటే కేజీ బియ్యానికి 200 gms మినపప్పు, కప్పుల్లో అయితే కప్ బియ్యానికి అదే కప్ తో 5వ వంతు మినపప్పు.
  2. ఈ పిండిలో ఉప్పు నూనె, నలిపిన వాము వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాలపకండి.
  3. చక్రాల/కారప్పూస గిద్దలో నూనె రాసి పెద్ద రంధ్రాలున్న ప్లేట్ పెట్టి, పిండి ముద్ద పెట్టి తడి ఆకు లేదా నూనె రాసిన ప్లేట్ మీద చిన్న చిన్న చుట్టలుగా వేసుకోండి, ఆ తరువాత వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద మాత్రమే కరకరలాడేట్టు వేపుకోండి.
  4. చల్లారాక డబ్బా లో ఉంచుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • B
    Bala subramanyam vaddadi
    Will it available in Hyderabad. Pl let me know. My cell no. 9849002011. I want to order.
  • A
    Avuthu sirisha
    Recipe Rating:
    👌👌
  • S
    Sai Kiran
    Recipe Rating:
    Wow, perfect. Such a yummy and crunchy Murukulu recipe, I would like to eat them as snacks in the evening times. particularly in the rainy season, we should have something to eat crunchy these Laddu express crunchy murukulu will make your taste buds awesome
  • R
    Roopa Reddy
    Recipe Rating:
    Superb...teja garu....I'm big fan of u
  • D
    Davulluri Vidyasagar
    Recipe Rating:
    Nice
Rice Flour Murukku | Kaarappusa | Chakli | Jantikas | Chakrams | How to make Andhra style Murukulu