బియ్యపు రవ్వ ఉప్మా | ఉప్పిండి

ఉపవాసాలకి, ఉల్లిపాయ లేని రెసిపీ కావలా ఇంకా త్వరగా తయారయ్యే టిఫిన్ కోసం చూస్తుంటే ఆంధ్రా స్టైల్ బియ్యం రవ్వ ఉప్మా బెస్ట్. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా టిప్స్ తో ఉంది చూడండి.

"బియ్యం రవ్వ ఉప్మా" ఎంతో కమ్మగా ఉండే ఆరోగ్యకరమైన ఉప్మా. ఆవకాయ, మాగాయ ఉంటె చాలు నంజుడుకి భలేగా ఉంటుంది. ఇది లంచ్ బాక్సులకి కూడా చాలా బాగుంటుంది. ఉప్మా మనందరికీ తెలుసు,అది బొంబాయ్ రవ్వ/సూజీ రవ్వ తో చేస్తారు అని మనం ఒప్పెసుకున్నం. అసలు దక్షిణాది వారికి తెలిసిన ఉప్మా, బియ్యం రవ్వతో చేసే ఉప్మానే . 80-90 ఏళ్ళ నుండి బొంబాయ్ రవ్వతో ఉప్మాకి అలవాటు పడ్డాం. ఇప్పటికీ ఎందరో ఇళ్ళలో శనివారాలు ఉపసవాసం అని బియ్యం రవ్వ ఉప్మానే చేస్తారు. బియ్యం రవ్వ ఉప్మా దాదాపుగా దక్షిణాది వారందరికీ తెలుసు, కానీ నా విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ రెసిపీ లో ఉప్మా తో పాటు, బియ్యం రవ్వ కూడా ఎలా చేసుకోవచ్చో చెప్తా. చాలా తక్కువ టైం మీరే రవ్వ తయారు చేసి డబ్బాలో ఉంచుకోవచ్చు. కనీసం 2-3 నెలలు నిలవుంటుంది.

బెస్ట్ ఉప్మా కి కొన్ని టిప్స్:

Rice Rava Upma | Uppudu Pindi | Arisi Upma | How to make Biyyam / Rice Ravva Upma

టిప్స్

• ఉప్మా రవ్వ నేను పాలిష్ బియ్యం తో చేశా, నచ్చితే బ్రౌన్ రైస్ తో కూడా చేసుకోవచ్చు. కానీ నీళ్ళు 1/2 కప్పు ఎక్కువ పోసుకోవాలి.

• రవ్వ లో నేను కందిపప్పు వాడాను, కావాలంటే కందిపప్పు కి బదులుగా పెసరపప్పు కూడా వాడుకోవచ్చు.

• ఈ ఉప్మా మిరియాల ఘాటుతో ఉండాలి, అందుకే పచ్చిమిర్చి వేయలేదు.

• నచ్చితే 1/2 tsp అల్లం వేసుకోవచ్చు.

• అసలుకైతే కప్ రవ్వ కి 3 కప్స్ నీళ్ళు. బియ్యం పాతవి అయితే 3.1/4 కప్స్ నీళ్ళు పట్టొచ్చు, కొత్తవి అయితే 2.3/4 కప్స్ నీళ్ళు సరిపోతాయ్.

• పచ్చి కొబ్బరి ఈ ఉప్మా కి ఎంతో కమ్మదనాన్ని ఇస్తుంది, నచ్చకపోతే వదిలేయండి

బియ్యపు రవ్వ ఉప్మా | ఉప్పిండి - రెసిపీ వీడియో

Rice Rava Upma | Uppudu Pindi | Arisi Upma | How to make Biyyam / Rice Ravva Upma

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Resting Time 2 hrs
  • Total Time 2 hrs 5 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • రవ్వ కోసం
  • 1 cup బియ్యం (185 gms)
  • 1 tbsp కందిపప్పు/పెసరపప్పు
  • 1 tsp మిరియాలు
  • 1 tsp జీలకర్ర
  • ఉప్మా కోసం
  • 2 tbsps నూనె
  • 1 tsp ఆవాలు
  • 3/4 tsp మినపప్పు
  • 1 tsp సెనగపప్పు
  • 1 ఎండు మిర్చి
  • 1/4 చిప్ప పచ్చి కొబ్బరి తురుము
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1.25 tsp ఉప్పు
  • 3 cups నీళ్ళు
  • 1 tbsp నెయ్యి

విధానం

  1. బియ్యాన్ని కడిగి వడకట్టి, చెమ్మగా/తడిగా ఉండగానే మిరియాలు, కందిపప్పు, జీలకర్ర వేసి బాగా కలిపి పల్చగా నీడన ఆరబెట్టాలి.
  2. గంట తరువాత పొడి పొడిగా ఆరిపోతాయ్, అప్పుడు మిక్సీ లో వేసి పల్స్ చేసుకుంటూ రవ్వగా ఆడించుకుని తీసుకోవాలి.
  3. అడుగు మందంగా ఉన్న గిన్నె లో నూనె వేడి చేసి ఆవాలు, మినపప్పు, సెనగపప్పు వేసి వేపుకోవాలి.
  4. తరువాత మిరపకాయ, కరివేపాకు వేసి వేపుకోవాలి.
  5. ఎసరు నీళ్ళు పోసి అందులో ఉప్పు, పచ్చికొబ్బరి తురుము వేసి నీళ్ళని తెర్ల కాగనివ్వాలి, హై ఫ్లేం మీద.
  6. నీళ్ళు మసులుతుండగా, బియ్యం రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి పూర్తిగా మెత్తగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యన అడుగు నుండి కలుపుతుండాలి.
  7. దింపే ముందు 1 tbsp నెయ్యి వేసి కలిపి దింపేయాలి. వేడిగా ఆవకాయ/ మాగాయ తో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • V
    venkataramana
    Recipe Rating:
    Super healthy dish,tq Teja garu
  • S
    Syeda Fatima
    Hi, Thanks for sharing this great recipe for someone who loves upma but is now gluten free. I found it very interesting to realize that wheat upma is actually an innovation and rice upma is the traditional choice. Hardly surprising, given the Southern states love their rice. I'm from Hyderabad myself. Will try!
Rice Rava Upma | Uppudu Pindi | Arisi Upma | How to make Biyyam / Rice Ravva Upma