బీరకాయ పల్లీల కూర
పేరు చెప్పగానే మొహం తిప్పే కూరలు కూడా ఒక్కో సారి చేసే తీరులో చేస్తే ఇష్టంగా తినపించొచ్చు ఇలా బీరకాయ పల్లీల కూర చేస్తే. రోజూ చేసుకునే కూరగా అన్నం, రోటీలలోకి చాలా రుచిగా ఉంటుంది.
మామూలుగా బీరకాయ కూరలంటే పత్యం కూరలు అని పెద్దగా ఇష్టత ఉండదు. పల్లీలు కొబ్బరి ముద్ద వేసి చేసే ఈ కమ్మని కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మా అమ్మ రెసిపీ నా చిన్నతనం నుండి మా ఇంట్లో బీరకాయతో ఈ పద్దతిలో ఎక్కువగా చేస్తుంది మా అమ్మ.
ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో కూడా ఉంది చూడండి

టిప్స్
-
బీరకాయ చెక్కు తీసి చేదు చూసి మరీ చిన్న ముక్కలు కాకుండా తరుక్కోవాలి. మరీ చిన్నవి తరిగితే కూరలో గుజ్జుగా కాకుండా ఉంటుంది
-
లేత బీరకాయల రుచి చాలా బాగుంటుంది.
-
తీగ కూరలకి నూనె ఎక్కువగా అవసరం లేదు కాబట్టి కాస్త తగ్గించి వేసినా రుచిగానే ఉంటుంది.
-
పల్లీలు కొబ్బరి కారణంగా కారం తక్కువైతే కూర తీపి వస్తుంది. అందుకే కారం రుచి చూసి మీకు తగినట్లు వేసుకోండి
-
వేసవి కాలంలో కూర ఒక్క పూట కంటే ఉండదు, సాయంత్రానికి పాడైపోతుంది.
-
పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి కంటే కమ్మగా రుచిగా ఉంటుంది కూరలో.
-
రోటీలలోకి చేసుకుంటున్నట్లైతే ఉప్పు కారాలు తగ్గించి వేసుకోండి
బీరకాయ పల్లీల కూర - రెసిపీ వీడియో
Ridge Gourd Peanut Curry | Beerakaya Palleela Kura | How to make Ridge Gourd Curry
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 1/4 cup వేపిన శెనగపప్పు (వేపినవి)
- 1/4 చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలు
- 2 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 2 రెబ్బలు కరివేపాకు
- 2 ఎండుమిర్చి
- 1/4 tsp పసుపు
- ఇంగువ – చిటికెడు
- 1 ఉల్లిపాయ (మీడియం సైజు తరుగు)
- 2 tsp ధనియాల పొడి
- 1 tsp కారం
- ఉప్పు – రుచికి సరిపడా
- 1/2 Kg బీరకాయ ముక్కలు
- 150 ml నీళ్ళు
- కొత్తిమీర – కొద్దిగా
విధానం
-
వేపిన పల్లీలు కొబ్బరి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ పసుపు వేసి తాలింపు పెట్టుకోండి.
-
ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడే దాకా వేగనివ్వాలి
-
వేగిన ఉల్లిపాయాలో ధనియాల పొడి, ఉప్పు, కారం కొద్దిగా నీళ్ళు వేసి నూనె పైకి తెలనిచ్చే దాకా వేపుకోవాలి.
-
తరువాత బీరకాయ ముక్కలు వేసి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. బీరకాయ మెత్తబడ్డాక నీళ్ళు పల్లీలు కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి సిమ్లో 8-10 నిమిషాలు ఉడకనివ్వాలి.
-
దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి.

Leave a comment ×
2 comments