రస్క్ హల్వా | పెళ్లిళ్ల స్పెషల్ రస్క్ హల్వా | రస్క్ హల్వా రెసిపి

రస్క్ హల్వా- రస్కులని దంచి నేతిలో వేపి పంచదార పాకంలో దగ్గర పరిచిచేసే ఈ హల్వా బ్రెడ్ హల్వా పేరుతో తమిళనాడు హోటల్స్ పెళ్లిళ్లలో ఎంతో ప్రాచుర్యం పొందినవంటకం.

మామూలు బ్రెడ్ హల్వా మాదిరి ఎక్కువెక్కువ నూనెలునేతులు అవసరంలేని కమ్మటి హల్వా ఎంత తిన్నా వెగటుగా పొట్టకి భారంగా అనిపించదండి. ఇంకాచెప్పాలంటే మామూలు బ్రేడ్ హల్వా కంటే తక్కువ ఖర్చు శ్రమతో తయారవుతుంది తమిళనాడు స్పెషల్బ్రేడ్ హల్వా.

రస్కులతో తయారైనా ఈ హల్వాని బ్రేడ్ హల్వా అనే అంటారు,అదే పేరుతో కాంబో బిర్యానీలతో పాటు చిన్న డబ్బాలో ఇస్తారు. నేను మొదటగా ఒక బిర్యానీసెంటర్లోనే తిన్నాను, తరువాత ఒక కేటరర్ ద్వారా ఈ రెసిపీ తెలుసుకున్నాను.  

తప్పక ట్రై చేయమని నేను రికమండ్ చేస్తాను!!!

రస్క్ హల్వా | పెళ్లిళ్ల స్పెషల్ రస్క్ హల్వా | రస్క్ హల్వా రెసిపి - రెసిపీ వీడియో

Rusk Halwa Recipe | Wedding Special Rusk Halwa | Halwa Recipe

Desserts & Drinks | vegetarian
  • Prep Time 3 mins
  • Cook Time 20 mins
  • Total Time 23 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup రస్కులు (1 కప్పు ఉండాలి పొడి)
  • 1 ½ cups నీరు
  • ¾ - 1 cup పంచదార
  • 1 ½ - 2 cups నీరు
  • 4 tbsp నెయ్యి
  • 3 tbsp జీడిపప్పు
  • 10-12 ఎండుద్రాక్ష
  • ⅛ tsp యాలకల పొడి
  • 1 pinch కుంకుమ పువ్వు (చిన్న చిటికెడు)

విధానం

  1. రస్కులని కాస్త పలుకులుగా దంచుకోండి. మరీ మెత్తని పొడిలా దంచకండి. దంచుకున్న రస్కుల పొడి ఒక కప్పు రావాలి.
  2. నేతిని కరిగించి అందులో జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
  3. మిగిలిన నేతిలో రస్కుల పొడి వేసి బంగారు రంగు వచ్చేదాకా కేవలం సన్నని సెగ మీద మాత్రమే వేపుకుని ఇంకో ప్లేట్లోకి తీసుకోండి.
  4. పంచదారలో నీరు పోసి కాస్త జిగురుపాకం వచ్చేదాకా మరిగించుకోండి. పాకం మరిగేప్పుడు అందులో యాలకలపొడి వేసుకోండి. కుంకుమ పువ్వు వేసుకుంటే మంచి రంగు వస్తుంది.
  5. పాకం జిగురుగా అవ్వగానే వేపుకున్న రస్కుల పొడి, జీడీపప్పు, కిస్మిస్ వేసి కలిపి దగ్గర పరిచి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • S
    Sowmya
    సూపర్
  • S
    Sasidhar reddy
    Recipe Rating:
    Great
  • J
    Justin Justin
    Recipe Rating:
    వంట రానివాళ్లు కూడా మీ వీడియోస్ ద్వారా మాస్టర్ చెఫ్ అయిపోవచ్చు. మీ డిటైల్డ్ఎక్సప్లయిన్యింగ్ చాలా బాగుంటుంది.
  • L
    Lakshmi Sowjanya
    Recipe Rating:
    Me recipes anta Naku chala eshtam
  • S
    Swathi
    Recipe Rating:
    Am a big fan of vismaifood....