సేమియా సగ్గుబియ్యం పాయసం

పాయసాలు ఎన్నో అందులో ఎంతో తిన్నా ఇంకా తాగలనిపించే కమ్మని పాయసం ఈ సెమియా కొబ్బరి పాల పాయసం. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

పండుగైనా స్పెషల్ రోజైనా దక్షిణ భారత దేశంలో దాదాపుగా ప్రతీ ఇంటా పాయసం ఉండాల్సిందే! ఇంటికో తీరులో కాస్తుంటారు పాయసం. ఈ పాయసం రుచి కాస్త భిన్నంగా ఉంటుంది. మామూలు పాలుకి బదులు కొబ్బరి పాలు, బెల్లం కలయికతో చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ నాకు తెలిసాక మా ఇంట్లో ఎక్కువగా ఈ పాయసం చేస్తున్నాం.

ఈ పాయసం ఇడియా నాకు హైదరాబాద్లో ఉండే నా తమిళ ఫ్రెండ్ ఇంట్లో తిన్నకా వచ్చింది, వారు సెమియా సగ్గుబియ్యం కలిపి బెల్లం వేసిన చేసిన తీరు చాలా నచ్చింది. కాకపోతే వారు పాలు వాడారు. నాకు ఇంకొంచెం కమ్మగా ఉంటే బాగుండు అనిపించి కొబ్బరి పాలు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి చేశాను, అందరూ చాలా ఇష్టంగా తాగారు. మన్ననలు పొందిన ఆ రెసిపీనే మీతో షేర్ చేస్తున్నా.

ఒకప్పుడు అంటే 90ల ప్రాంతంలో పెళ్ళిళ్ళకి కూడా దక్షిణ భారతదేశంలో స్వీట్గా సగ్గుబియ్యం పాయసం వడ్డించేవారు, ఆ తరువాత సేమియాతో వడ్డించారు ఇంకా పోను పోను పాయసంకి బదులు కాజు స్వీట్లు వడ్డిస్తున్నారు.

టిప్స్

సేమియా – సగ్గుబియ్యం :

నేతిలో సెమియా, సగ్గుబియ్యం రెండూ కలిపి సన్నని సెగ మీద వేపితేనే సగ్గుబియ్యం లోపలి దాకా వేగి రుచిగా ఉంటుంది పాయసం.

బెల్లం:

ఈ కొలతకి కప్పు బెల్లం తీపి సరిపోను ఉంటుంది, నచ్చితే ఇంకొంచెం పెంచుకోండి.

కొబ్బరి పాలు:

  1. ఈ పాయసానికి పలుచని కొబ్బరి పాలు వాడాలి, చిక్కనివి వాడితే పాయసం చల్లారాక ముద్దగా అవుతుంది. నచ్చితే మామూలు పాలు కూడా వాడుకోవచ్చు. నేను పాయసం కాస్త చిక్కగా కాస్తున్నాను, మీకు పలుచగా కావాలంటే 2 కప్పుల పాలు వాడుకోండి. పలుచని కొబ్బరి పాలు అంటే పచ్చి కొబ్బరి ముక్కల్లో వేడి నీళ్ళు పోసి గ్రైండ్ చేసి క్లాత్లో వేసి వడకడితే వచ్చేదే, తీసిన పాలల్లో కాసిని నీళ్ళు కలుపుకుంటే పలుచని కొబ్బరి పాలు తయారు.

  2. ఇదే పాయసం పాలతో కాస్తే కాచిన పాలు పోసి రెండు పొంగులు రానిచ్చి స్టవ్ ఆపేసి కరిగించిన బెల్లం పోసి కలుపుకుంటే పాయసం విరగదు.

సేమియా సగ్గుబియ్యం పాయసం - రెసిపీ వీడియో

Sabudana Vermicelli Kheer | Semiya Saggubiyyam Payasam

Sweets | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 30 mins
  • Total Time 40 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup సెమియా
  • 1/4 cup సగ్గుబియ్యం
  • 1.5 cup పలుచని కొబ్బరి పాలు/వేడి పాలు
  • 1 spoon యాలకలపొడి
  • 1/4 cup పచ్చి కొబ్బరి ముక్కలు
  • 3 tsp నెయ్యి
  • 10 - 15 జీడిపప్పు
  • 10 కిస్మిస్
  • 1 cup బెల్లం
  • 3 cups వేడి నీళ్ళు

విధానం

  1. బెల్లం లో కాసిని నీళ్ళు పోసి కరిగించి పక్కనుంచుకోండి.
  2. పాన్లో నెయ్యి కరిగించి జీడిపప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి, మిగిలిన నెయ్యిలో సెమియా సగ్గుబియ్యం వేసి సెమియా రంగు మారేదాకా సన్నని సెగ మీద వేపుకోవాలి.
  3. వేగిన సెమియాలో వేసి నీళ్ళు పోసి కలిపి సగ్గుబియ్యం మెత్తబడేదాకా మూతపెట్టి ఉడికించుకోండి.
  4. మరో పాన్లో 1 tsp నెయ్యి వేసి పచ్చి కొబ్బరి పలుకులు వేసి ఎర్రగా వేపుకుని తీసుకోండి.
  5. సగ్గుబియ్యం నాకు 17 నిమిషాలకి ఉడికిపోయింది అప్పుడు పలుచని కొబ్బరి పాలు, కరిగించిన బెల్లం నీళ్ళు పోసి 2 పొంగులు రానివ్వాలి (మాములు పాలతో చేసే వారు పైన టిప్స్ చూడండి).
  6. ఆఖరుగా యాలకలపొడి, వేపిన జీడిపప్పు, కిస్మిస్ వేపిన కొబ్బరి పలుకులు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Sabudana Vermicelli Kheer | Semiya Saggubiyyam Payasam