సగ్గుబియ్యం అట్లు

నానబెట్టిన సగ్గుబియ్యం, బియ్యంలో ఉప్పు పచ్చిమిర్చి వేసే మెత్తగా రుబ్బి, పల్చగా అట్లు పోస్తే ఒకటికి నాలుగు ఖాయంగా తింటారు. కమ్మటి అట్లు ఇష్టపడే వారికి బెస్ట్ రెసిపీ సగ్గుబియ్యం అట్లు

సగ్గుబియ్యం అట్లు మామూలు మినప అట్ల మాదిరి కరకరలాడుతూ ఉండవు ఇవి మృదువుగా ఉంటాయి వెన్నలా కరిగిపోతాయి నోట్లో. లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్ రెసిపీ.

సగ్గుబియ్యం అట్లు దక్షిణ భారత దేశంలో దాదాపుగా వెనుకటి వంటల మీద అవగాహన ఉండే ప్రతీ ఇంట్లో వేసుకుంటారు. ఇవి హోటల్స్లో దొరకవు. ఈ రెసిపీ మా నానమ్మ రెసిపీ. నా చిన్నప్పుడు స్కూల్ నుండి ఇంటికి రాగానే ఈ అట్లు పోసి ఇచ్చే రోజులు నాకింకా గుర్తున్నాయి.

సగ్గుబియ్యం అట్లు కొబ్బరి పచ్చడి కంటే గుంటూరు అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటాయి. రెసిపీ మామూలు అట్లు పోసినట్లే కానీ కొన్ని సూచనలతో మృదువైన అట్లు వస్తాయ్!!!

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు టమాటో బాత్

టిప్స్

సగ్గుబియ్యం:

  1. సగ్గుబియ్యం బాగా మెత్తగా నానాలి అప్పుడే పిండి పలుకులు లేకుండా ఉంటుంది. సగ్గుబియ్యం బియ్యం రెండూ రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్ చేసి కూడా అట్లు పోసుకోవచ్చు.

పుల్లని పెరుగు:

  1. పుల్లని పెరుగు అట్టుని పొంగేలా చేస్తుంది. లేని వారు వంట సోడా అయినా వేసుకోవచ్చు. కానీ పిండిని ఫ్రిజ్లో పెట్టకండి వెంటనే వాడేసేయండి. మరుసటి రోజుకి అంత రుచిగా అనిపించలేదు నాకు. నచ్చితే మీరు వేసుకుని చూడండి.
  2. మాములుగా పెరుగు వేసి రుబ్బితే ఫ్రిజ్లో పెట్టుకుని వాడుకోవచ్చు.

ఉల్లిపాయ తరుగు:

  1. నేను పూర్తిగా నా చిన్నతనంలో నేను ఎలా తిన్నానో అలాగే పిండిలో కలిపేశాను, మీకు ఉల్లిపాయలు నచ్చితే పిండి పైన చల్లుకోవచ్చు, లేదా అసలు వేసుకోకపోయినా పర్లేదు.

అల్లం పచ్చిమిర్చి :

  1. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అట్టుకి ఏ నంజుడు లేకుండా తినేలా చేస్తుంది. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేయాలని ఏమి లేదు. కారం చట్నీ ఉన్నా అట్టు బాగుంటుంది.

దోశల పిండి:

  1. పిండిని ఎక్కువసేపు మృదువుగా రుబ్బుకోవాలి. అప్పుడే అట్టు పొంగి రుచిగా ఉంటుంది.
  2. పిండి జారు మామూలు దోశల మాదిరి ఉంటె చాలు. చిక్కనైతే పిండి కాలడానికి సమయం పడుతుంది.
  3. ఈ అట్టు పిండిలో నేను ఉల్లిపాయలు వేయడం వల్ల పలుచని షేప్ రాలేదు. కాస్త మందంగా సన్నని ఊతప్పం మాదిరి ఉంటుంది.

ఈ పిండి ఇంకా ఈ విధంగా వాడుకోవచ్చు:

  1. పిండిని మరింత చిక్కగా గట్టిగా రుబ్బి బొండాలు వేసుకోవచ్చు. లేదా పలుచగా చేసుకుని గుంట పూనుకులు వేసుకోవచ్చు.

అట్టు కాల్చే తీరు:

  1. సగ్గుబియ్యం అట్టు మినపట్టు మాదిరి త్వరగా కాలేదు, సమయం పడుతుంది. కాబట్టి నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద కాలనివ్వాలి. త్వరగా హై ఫ్లేమ్ మీద కాలిస్తే పిండి మగ్గదు, అట్టు పిండి పిండిగా అనిపిస్తుంది.

సగ్గుబియ్యం అట్లు - రెసిపీ వీడియో

Saggubiyyam dosa| Sabudana Dosa | How to Make Sabudana Dosa

Breakfast Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 4 hrs
  • Cook Time 3 mins
  • Total Time 4 hrs 4 mins
  • Serves 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 Cup సగ్గుబియ్యం
  • 1 Cup బియ్యం
  • 1/4 Cup పెరుగు
  • 1/2 Inch అల్లం
  • 1 పచ్చిమిర్చి
  • ఉప్పు
  • 1/4 Cup ఉల్లిపాయ తరుగు
  • కొత్తిమీర తరుగు (కొద్దిగా)
  • నీళ్లు (పిండి రుబ్బుకోడానికి)
  • నూనె (అట్టు కాల్చుకోడానికి)

విధానం

  1. సగ్గుబియ్యం, బియ్యం రెండూ విడివిడిగా నానబెట్టుకోండి
  2. నీళ్లు వడకట్టి సగ్గుబియ్యాన్ని మెత్తగా క్రీంలా రుబ్బుకోవాలి
  3. నానిన బియ్యాన్ని కూడా మెత్తగా రుబ్బుకోవాలి
  4. అల్లం, పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసుకోవాలి
  5. రుబ్బుకున్న సగ్గుబియ్యం బియ్యం పిండ్లు రెండింటిని కలుపుకోండి. ఇందులోనే పెరుగు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉల్లిపాయ కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి.
  6. అవసరాన్ని బట్టి నీళ్లతో పలుచన చేసుకోండి పిండిని
  7. పెనం బాగా వేడి చేసి పెద్ద గరిటెడు పిండిని పోసి పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. అంచుల వెంట నూనె వేసి నెమ్మదిగా కాల్చుకోండి. (అట్టు కాల్చే తీరు కోసం టిప్స్ చూడగలరు)పెనం బాగా వేడి చేసి పెద్ద గరిటెడు పిండిని పోసి పలుచగా స్ప్రెడ్ చేసుకోండి. అంచుల వెంట నూనె వేసి నెమ్మదిగా కాల్చుకోండి. (అట్టు కాల్చే తీరు కోసం టిప్స్ చూడగలరు)
  8. ఒక వైపు కాలిన తుని ఫ్లిప్ చేసి మరో వైపు కూడా కాల్చుకోండి. వేడి వేడిగా అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.