సగ్గుబియ్యం మురుకులు

Snacks
4.9 AVERAGE
11 Comments

సాయంత్రాలు స్నాక్గా లేదా టీ తో మాంచి జోడీ సగ్గుబియ్యం మురుకులు. తిన్న కొద్దీ తినాలనిపించే కరకరలాడే ఈసీ సగ్గుబియ్యం మురుకులు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది.

మురుకులు వేడి వేడి టీ తో, ఇంకా రసవత్తరమైన కబుర్లు ఉంటే ఇంకా రుచిగా అనిపిస్తాయ్. ఈ సగ్గుబియ్యం మురుకులు మామూలు మురుకుల కంటే ఎక్కువగా కరకరలాడుతూ గుల్లగా చాలా బాగుంటాయ్.

సగ్గుబియ్యం మురుకులు కూడా అన్నీ మూరుకుల మాదిరే చేస్తారు, కానీ రుచి రూపంలో చిన్న వ్యత్యాసం! బియ్యం పిండిలో సగ్గుబియ్యం పేస్ట్ చేరి మురుకులు చాలా గుల్లగా వస్తాయ్!

Sago Murukku | Saggubiyyam Murukulu | Sabudana Murukku

టిప్స్

సగ్గుబియ్యం:

  1. నేను లావుగా ఉండే సగ్గుబియ్యం వాడాను, కాబట్టి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసుకున్నా, సన్న సగ్గుబియ్యం వాడితే నానిన తరువాత చేత్తో గట్టిగా పిండితే సగం గుజ్జుగా కొంత పలుకుల అవుతుంది సగ్గుబియ్యం. పలుకులుగా ఉన్న సగ్గుబియ్యం నూనెలో ఉబ్బి ప్రేత్యేకమైన రుచినిస్తాయ్! అవసరమైతే సన్న సగ్గుబియ్యం కూడా బరకగా గ్రైండ్ చేసుకోవచ్చు.

మజ్జిగ-నిమ్మరసం :

  1. కమ్మని మీగడ మజ్జిగ మురుకులని గుల్లగా వేగేలా చేస్తుంది. నిమ్మరసం మురుకులని తెల్లగా ఉంచుతుంది, నిమ్మరసం వల్ల చేదు రాదు.

మురుకులు వేపే తీరు

  1. బాగా వేడెక్కిన నూనెలో ముకుడు సైజుని బట్టి 5-6 మురుకులు వేసి 2 నిమిషాలు వదిలేస్తే వేగి గట్టిపడతాయ్. అప్పుడు తిప్పుకుంటూ కాల్చుకోండి

  2. మురుకులు వేయడానికి ముందు నూనె బాగా వేడిగా ఉండాలి, మురుకులు వేసేప్పుడు మంట పూర్తిగా తగ్గించి మురుకులు అన్నీ వేసి తరువాత మీడియం - హై ఫ్లేమ్ మీద పెట్టి వేపుకోవాలి. సగం పైన వేగిన తరువాత హై-ఫ్లేమ్ మీద వేపి తీసుకోవాలి.

  3. నూనె విపరీతమైన వేడి మీద ఉన్నప్పుడు వేసి హై ఫ్లేమ్ మీదే వేపితే మూరుకు రంగు వస్తుంది కానీ, లోపల ఉడకక మెత్తగా ఉంటుంది. మరో ముక్యమైన విషయం ముకుడు సైజు కి మించి మురుకులు వేస్తే బాగా వేడెక్కిన నూనె వేడి తగ్గిపోయి వేడి చాలక మురుకులు మెత్తగా వస్తాయ్.

  4. మురుకులు వేసి బుడగలు తగ్గేదాక వేపుకోవాలి. తీయబోయే ముందు నూనెలోంచి ఒక మురుకు తీసి చేత్తో నొక్కినా తెలుస్తుంది మూరుకు ఎంత బాగా వేగినది. ఈ మురుకులు కారప్పూసలా ఎర్రగా ఉండవు, తెల్లగానే ఉండాలి, ఉంటాయ్.

  5. నూనెలోంచి తీసిన వెంటనే వేడి మీద కాస్త మెత్తగా ఉంటాయ్, చల్లారాక కరకరలాడుతూ ఉంటాయ్.

సగ్గుబియ్యం మురుకులు - రెసిపీ వీడియో

Sago Murukku | Saggubiyyam Murukulu | Sabudana Murukku

Snacks | vegetarian
  • Prep Time 2 mins
  • Soaking Time 4 hrs
  • Cook Time 25 mins
  • Total Time 4 hrs 27 mins
  • Servings 20

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup సగ్గుబియ్యం
  • 3 cups బియ్యం పిండి
  • ఉప్పు
  • 1/4 tsp ఇంగువ
  • 2 tbsp అల్లం పచ్చిమిర్చి పేస్ట్ (3 పచ్చిమిర్చి ½ అంగుళం అల్లంతో రుబ్బిన పేస్ట్)
  • 1 tsp జీలకర్ర
  • 2 tbsp వేడి నూనె
  • మజ్జిగ – పిండిని మెత్తగా తడుపుకోవడానికి
  • నిమ్మరసం – ½ చెక్క
  • నూనె వేపుకోడానికి

విధానం

  1. సగ్గుబియ్యంలో నీళ్ళు పోసి 4 గంటలు నానబెట్టాలి. నాలుగు గంటల తరువాత నీళ్ళతో సగ్గుబియ్యాన్ని బరకగా అంటే 40% పలుకుగా 60% గుజ్జుగా గ్రైండ్ చేసుకోవాలి.
  2. బియ్యం పిండిలో మిగిలిన పదార్ధాలన్నీ వేసి పిండిని మృదువుగా మజ్జిగతో తడుపుకోవాలి
  3. కారప్పూస గిద్దలో స్టార్ ప్లేట్ ఉంచి నూనె రాసి అందులో పిండి ముద్ద ఉంచుకోండి.
  4. నూనె రాసిన గరిట లేదా అరిటాకు మీద చక్రాల చుట్టుకొని ఒక అంచుని లోపలికి మడవాలి. లేదా కారప్పూసలా కూడా వత్తుకోవచ్చు.
  5. వత్తుకున్న మురుకులని బాగా వేడెక్కిన నూనెలో మంట పూర్తిగా తగ్గించి మురుకులు అన్నీ వేసి మీడియం మీద వేగనిచ్చి, బుడగలు తగ్గాక ఒక నిమిషం హై-ఫ్లేమ్ మీద వేపి తీసుకోండి.
  6. పూర్తిగా చల్లారిన మురుకులని గాలి చొరని డబ్బాలో ఉంచితే కనీసం 15 రోజులు పైన తాజాగా ఉంటాయ్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

11 comments

  • V
    Vandana
    Recipe Rating:
    Can we bake or airfry the sabudana murakku
  • V
    Vinni
    Recipe Rating:
    I'll Definitely try this Recipe for Tomorrow sir.....😍😍😍😍😍😍😍
  • L
    Leena
    Love your recipes but unable to understand please have a separate channel for english/hindi
  • S
    Sharmila Ashok Agre
    Recipe Rating:
    Yummy..... Tasty and Crisp... Can U Please Suggest some recipes to be made during fasting and for prasadams Thank You
  • S
    Sruthi
    Recipe Rating:
    Crunchy and Tasty sir thankyou it came out well. Teja sir I really love your recipes and I have tried almost every recipe.
  • P
    Prabaa KR
    Recipe Rating:
    Super evening snack
  • K
    Kab
    Recipe Rating:
    Anna thank you for sharing this recipe
  • K
    Kab
    Recipe Rating:
    Anna thank you for sharing this recipe
  • S
    Sudha kelam
    Recipe Rating:
    Excellent....best recipe tea snack item......very tasty
  • N
    Nandini
    Super
Sago Murukku | Saggubiyyam Murukulu | Sabudana Murukku