శరవణా భవన్ స్టయిల్ రవ్వ కేసరి

Sweets
4.9 AVERAGE
42 Comments

బొంబాయ్ రవ్వ పంచదార నెయ్యి వేసి చేసే కేసరీ భారతీయాలకి ప్రతీ శుభకార్యానికి ఉండాల్సిందే! అలాంటి రవ్వ కేసరీ తయారీలో మద్రాస్లోని శరవణా భవన్ వారి తీరు ప్రేత్యేకం, చాలా రుచిగా ఉంటుంది. చల్లారినా కేసరీ మృదువుగా నోట్లో వెన్నలా కరిగిపోయేలా ఉంటుంది. నేను చెన్నై వెళితే తప్పక శరవణా భవన్ వారి కేసరీ తినాల్సిందే!

రవ్వ కేసరీని భారత దేశంలో రాష్రాన్ని ఒక్కో తీరులో పిలుస్తారు. తెలుగు, తమిళులు రవ్వ కేసరీ అని కన్నడ వారు కేసరీ బాత్ అని ఉత్తరాది వారు షీరా, రవ్వ షీరా అని పిలుస్తారు!పేరు ఏదైనా దాదాపుగా దేశమంతా రవ్వ కేసరీ ఒకే తీరులో చేస్తారు, చిన్న చిన్న కొలతల మార్పుతో ఉంటుంది, కానీ ఆ చిన్న మార్పే ఎంతో ప్రేత్యేకతనిస్తుంది కేసరికి.

కొందరు రవ్వ కేసరిని పాలు పోసి ఉడికిస్తారు, శరవణా భవన్ వారు పాలు వేయకుండా ఉడికిన రవ్వలో పంచదార వేసి చేస్తారు. ఇలాగే ఉంటాయి చిన్న చిన్న మార్పులు రవ్వ కేసరికి పరాంతానికి ఒక్కో తీరుగా.

ఈ సింపుల్ రవ్వ కేసరీ చేసే ముందు టిప్స్ని పాటిస్తూ చేయండి ఎప్పుడు చేసినా ఏ కొలతకి చేసినా ఒకే రుచిలో వస్తుంది.

Saravana Bhavan Style  Rava Kesari

టిప్స్

రవ్వ:

నేను దీనికి సన్నని బొంబాయ్ రవ్వ వాడాను, మీరు కావాలంటే సన్నని గోధుమ రవ్వ కూడా వాడుకోవచ్చు.

ఈ మధ్య మిల్లెట్ రవ్వలు కూడా దొరుకుతున్నాయి, ఒక వేళా అది వాడదలిస్తే కప్పు రవ్వకి నాలుగు కప్పుల నీళ్లు అవసరమవుతాయి. ఇంకా రవ్వ కూడా నిదానంగా ఉడకాలి.

పంచదార:

నేను పంచదార వాడి చేశాను, మీరు నచ్చితే ఇదే కొలత బెల్లం వాడి కూడా చేసుకోవచ్చు. కాకపోతే బెల్లాన్ని కొద్దిగా నీరు పోసి కరిగించి వడకట్టి వాడుకోవాలి. లేదంటే బెల్లంలో ఇసుక ఉంటుంది.

ఇంకో విషయం బెల్లం వేసి చేసిన రవ్వ కేసరి రుచి పంచదార వేసి చేసిన కేసరి రుచి రెండూ భిన్నం.

నెయ్యి:

శరవణా భవన్ వాటి తీరంటే రవ్వా నెయ్యి సమానం. నేను కప్పుకి ముప్పావు కప్పే వాడాను. మీకు నచ్చితే రవ్వకి సమానంగా నెయ్యి వేసుకోవచ్చు.

నీళ్లు:

వేగిన రవ్వలో కచ్చితంగా మరిగే వేడి వేడి నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. అప్పుడే రవ్వ జిగురు లేకుండా మెత్తగా ఉడికినా రవ్వగా ఉంటుంది.

ఆఖరుగా:

దక్షిణాది వారు రవ్వ కేసరీ లో ఆఖరున కొంచెం పచ్చ కర్పూరం వేసి ప్రసాదంగా నివేదిస్తారు, ఉత్తరాది వారు ఉపవాసాలకి తప్పక చేస్తుంటారు. మీరు పచ్చకర్పూఉరం వేసినా వేయకపోయినా పర్లేదు, యాలకలపొడి సరిపోతుంది.

నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ వేశాను ఆకర్షణీయంగా కనిపించాలని, ఉంటె కుంకుమపువ్వు కూడా వేసుకోవచ్చు. లేదా ఏమి వేయకపోయినా పర్లేదు.

శరవణా భవన్ స్టయిల్ రవ్వ కేసరి - రెసిపీ వీడియో

Saravana Bhavan Style Rava Kesari | Rava Kesari

Sweets | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 25 mins
  • Total Time 26 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బొంబాయ్ రవ్వ
  • 1.5 cup పంచదార
  • 3/4 cup నెయ్యి (1 కప్పు)
  • 3 cups వేడి నీళ్లు
  • 15 జీడిపప్పు
  • 15 కిస్మిస్
  • 1/4 tsp యాలకుల పొడి

విధానం

  1. సగం నెయ్యి మూకుడులో పోసి అందులో జీడీపప్పు కిస్మిస్ రవ్వ అన్నీ ఒకదాని కలిపి వేసి సన్నని సెగ మీద రవ్వ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. రవ్వ వేగడానికి సుమారు 15 నిమిషాలు పడుతుంది.
  2. వేగిన రవ్వలో మరిగే వేడి నీళ్లు పోసి రవ్వని దగ్గరపడనివ్వాలి.
  3. రవ్వ మెత్తగా ఉడికిన తరువాత పంచదార వేసి దగ్గరపడనివ్వాలి.
  4. దగ్గర పడ్డ రవ్వలో ఎల్లో ఫుడ్ కలర్ యాలకపొడి మిగిలిన నెయ్యి వేసి కలిపి నెయ్యి పైకి తేలేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి.
  5. నెయ్యి పైకి తేలిన తరువాత దింపేసుకోండి (మరిన్ని విధానాల కోసం టిప్స్ చుడండి).

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

42 comments

  • S
    Sowmya
    Recipe Rating:
    This recipe was amazing
  • P
    Pavan
    Recipe Rating:
    Meeru chepina vindhamga pakka kolathala tho chesa sir super taste😍😋😋😋
  • N
    Navya mattupalli
    I tried this recipe it was awesome
  • I
    Imandi sravani
    Thank you vismai foods....aspecially Teja garu voice..
  • K
    Kilari harika
    Recipe Rating:
    Recipe chala baga vachindi super😋
  • C
    Chaitanya
    Recipe Rating:
    One of my favourite sweet till date😋😋
  • M
    Mohana
    Recipe Rating:
    Nice sweet recipe. Mind blowing result. I enjoyed a lot. But my mom do it after several days.
  • N
    Nalini kaveti
    Recipe Rating:
    I tried this recepie, it's really super, I am 56 yrs, though I am making this sweet since years, but your way of trying this recepie is supero super, thanks
  • B
    Bhagyalakshmi
    One of my favourite and simple sweet i just love the way you made sir... definitely I'll try this recipe
  • R
    Ramachandra rao
    Recipe Rating:
    Very easy and tasty recipe 😋 thank you for your tips
  • S
    Swathi
    Recipe Rating:
    Rava kesari me channel lo chusi chesanu apudu nuchi ma family members andariki chala nachindi sweet, yummy and tasty rava kesari. My favourite sweet of all time 😋😋
  • L
    Lakshmi
    Recipe Rating:
    I tried it It came out very well
  • R
    Ramya Reddy
    Recipe Rating:
    Super
  • K
    Kondadadi pavani
    Recipe Rating:
    This is my favourite halwa .I tried your recipe it turned out very well..
  • G
    Gregory
    I really love this recipe I tried many times
  • A
    Adhi
    Recipe Rating:
    Super
  • S
    sowjanya
    Recipe Rating:
    recipe 👌very tasty
  • A
    Apoorva
    Recipe Rating:
    Too tasty
  • J
    Jyotsna prabhakar
    Recipe Rating:
    I have tried this perfect measurements turned into too yummand delicious
  • S
    Shekhar
    I tried this recipe it came out very well
  • S
    Sree lekhya
    I've tried this , yummy and tasty kesari. My favourite sweet of all time
  • P
    Pooja Priyadarshini
    Recipe Rating:
    Tried this recipe 20+ times...got soo many compliments...simple and yummy sweet
  • B
    Baddula Hemalatha
    Tried it.i got many compliments from my family.
  • S
    Sai Sudheshna
    Tried it . It came very well. Super taste
  • S
    Sravani Chappidi
    Recipe Rating:
    super
  • M
    Maripelly Jashwanth
    Recipe Rating:
    Really super recipe, I liked it very much. Thank you sir.
  • P
    Pallavi raghu
    Love your recipe very much andi I’m big fan of u 🥺❤️😍
  • S
    Supraja
    Recipe Rating:
    Tried it many times awesome recipe
  • K
    Kolli Parvathi
    Recipe Rating:
    Tasty recipe sir. I love your content
  • R
    Roja
    Recipe Rating:
    Hello vismai food
  • K
    K Sai Deepika
    Recipe Rating:
    It turned out really yumm.. Thank you so much for your amazing detailed recipes teja garu
  • K
    Kamakshi
    Recipe Rating:
    I tried this kesari for festival. We loved it so much and the taste was amazing
  • G
    Gayathri devi
    Recipe Rating:
    One of my most favorite recipe.. when ever I make this kesari it was a hit...thank you vismai food.
  • B
    Buggarapu Renuka
    Recipe Rating:
    Very very yammi.my 35 years experience is nothing before your recipes.
  • S
    Sangeetha
    Recipe Rating:
    Naaku ee kesari ante chala istam ee paddathi naaku idi varaku telidu me paddathi lo chesi chusaka naaku inka baagaa nachhindi Thank you so much
  • A
    Anusha
    Recipe Rating:
    Tried this today for my kid birthday. She loved it.
  • P
    Pavani
    Recipe Rating:
    I love this recipe and I tried it for nearly 7 times everytime it turned out well
  • K
    Karuna
    Perfect tips for beginners... thank you so much
  • K
    Karuna
    I tried it yesterday...came very well..😋😋
  • R
    Ramya
    Recipe Rating:
    Nice recipe
  • V
    Venkatesh
    Super
  • S
    Suguna
    Swamy variki prasadamga chesanu e recipe. Chala baga vachindandi.
Saravana Bhavan Style  Rava Kesari