సేమియా కేసరీ | తక్కువ టైమ్ లో అయిపోయె బెస్ట్ స్వీట్
తక్కువ టైమ్ లో అయిపోయె బెస్ట్ స్వీట్ కోసం చూస్తున్నారా అయితే నా స్టైల్లో సెమియా కేసరి చేయండి ఎప్పుడు చేసినా ఒకే రుచి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
కేసరి అనగానే రవ్వ కేసరే గుర్తుకొస్తుంది. కానీ సెమియా కేసరి రవ్వ కేసరి కంటే త్వరగా తయరావుతుంది. నాకు రవ్వ కేసరి కంటే సెమియా కేసరే ఇష్టం. ఈ సెమియా కేసరి నేను నా పద్ధతి చెబుతున్న. ఇది మీకు ప్రసాదంగా లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా చేసుకునే తీరులో ఉంటుంది.
సెమియా కేసరి ముస్లిం స్టైల్ మరో తీరులో ఉంటుంది, ముస్లిం పెళ్ళిళ్ళ పద్ధతి ఇంకోలా , రంజాన్ అప్పుడే చేసే తీరు పూర్తిగా భిన్నం. అవన్నీ నేను త్వరలో పోస్ట్ చేస్తా.

టిప్స్
సెమియా:నేను రెడీమేడ్గా దొరికే సెమియా వాడాను, ముందే వేపిన సెమియా కంటే నెయ్యిలో మనం వేపుకుని చేసే సెమియా రుచి బాగుంటుంది.
పంచదార:నేను కప్పు సెమియాకి ¾ కప్పు పంచదార వేశాను ఇది సరిగ్గా ఉంటుంది. తీపి ఎక్కువ తినే వారు ఇంకొంచెం వేసుకోవచ్చు.
పచ్చ కర్పూరం:నేను పచ్చ కర్పూరం వాడలేదు, మీకు నచ్చితే ఆఖరున చిటికెడు వేసి దింపేయండి.
కుంకుమపువ్వు: వేసే చిటికెడు కుంకుమపువ్వు కేసరికి మాంచి రంగు సువాసనని సహజంగా ఇస్తుంది. కుంకుమ పువ్వు కి బదులు నచ్చితే రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేసుకోవచ్చు.

సేమియా కేసరీ | తక్కువ టైమ్ లో అయిపోయె బెస్ట్ స్వీట్ - రెసిపీ వీడియో
SEMIYA KESARI | Seviyan Kesari Recipe | How to make Vermicelli Kesari
Prep Time 1 min
Cook Time 20 mins
Total Time 21 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup సెమియా
- 2 cup నీళ్ళు
- 3/4 cup పంచదార
- 1/4 cup జీడిపప్పు
- 2 tbsp ఎండు ద్రాక్ష
- 2 tbsp నెయ్యి
- 1 tsp యాలకల పొడి
- కుంకుమపువ్వు
విధానం
-
నెయ్యి కరరిగించి జీడీపప్పు కిస్మిస్ వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
-
మిగిలిన నెయ్యిలో సెమియా వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
-
నీళ్ళు పోసి కుంకుమ పువ్వు వేసి హై ఫ్లేమ్ మీద మరగ కాగనివ్వాలి.
-
మరుగుతున్న నీళ్ళలో వేపిన సెమియా వేసి ఇంకా కొంచెం నీరుగా ఉండే వరకు మీడియం- ఫ్లేమ్ మీద ఉడికించాలి.
-
తరువాత పంచదార, యాలకల పొడి వేసి దగ్గర పడే దాకా ఉడికించాలి. దింపే ముందు వేపిన జీడిపప్పు, కిస్మిస్ వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment ×
7 comments