ప్రసాదం నువ్వుల అన్నం | ఏల్లు సాదం

రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం పోషకాలతో నిండిన తమిళనాడు స్పెషల్ ఎల్లు(నువ్వులు) సాదం (అన్నం). తమిళనాడులో శివాలయాల్లో ఇంకా శనికి ప్రేత్యేకమైన పూజలు చేసినప్పుడు తప్పక ఈ నువ్వుల అన్నాన్ని ప్రసాదంగా ఇస్తారు!

నువ్వుల అన్నం దక్షిణభారత దేశంలో అంతటా చేసినా తమిళనాడు వారు నల్ల నువ్వులతో చేస్తారు! నల్ల నువ్వులు తెల్ల నువ్వల కంటే రుచి ఆరోగ్యం. సాధారణంగా నల్ల నువ్వులు పూజకు తప్ప మరింకాదేనికి పనికిరావు అనుకుంటారు. కానీ నల్ల నువ్వులు ఎంతో ఆరోగ్యం. తెల్ల నువ్వుల కంటే ఎన్నో పోషకాలు ఉన్నాయ్. ఇంకా విటమిన్-డి సమృద్ధిగా దొరుకుతుంది.

నేను ఈ నువ్వుల అన్నం ప్రసాదం పద్ధతిలో కాక లంచ్ బాక్సుల కోసం చెప్తున్నా! ఇంకా టిప్స్ చూస్తే ప్రసాదంగా చేయాలనుకుంటే ఎలా చేసుకోవచ్చో వివరం ఉంటుంది.

Sesame Rice | Ellu sadam | Temple Style Nuvvula Annam

టిప్స్

నల్ల నువ్వులు:

  1. నల్ల నువ్వులు తెల్ల నువ్వుల కంటే మాంచి సువాసనతో చిరు చేదుగా ఉంటూ చాలా రుచిగా ఉంటుంది. నల్ల నువ్వులు నచ్చని వారు అందుబాటులో లేని వారు తెల్ల నువ్వులు వాడుకోవచ్చు

నూనె:

  1. ఆలయాల్లో సాధారణంగా నువ్వుల నూనె వాడీ చేస్తారు, మీరు మరింకేదైనా నూనె వాడుకోండి. లేదా నెయ్యి వేసి తాలింపు పెట్టుకోండి. నెయ్యితో చేస్తే మిరపకాయలు కొన్ని ఎక్కువగా వేసుకోండి.

ఇంకొన్ని పద్ధతులు:

  1. ఎండు మిరపకాయలకి బదులు మిరియాలు వాడుకోవచ్చు. తాలింపులో పచ్చిమిర్చి వేసుకోవచ్చు.

  2. నేను లంచ్ బాక్సుల కోసం చేస్తున్నాను కాబట్టి రుచి కోసం చల్ల మిరపకాయలు వేసాను. ప్రసాదం గా చేసుకోదలిచిన మిరియాలు పచ్చిమిర్చి వేసి చేసుకోండి. ఇంకా నచ్చితే వేరుసెనగ గుండ్లు, జీడిపప్పు, వేసుకోవచ్చు.

  3. ఇంకో తీరు కావాలనుకుంటే చిన్న పచ్చి కొబ్బరి ముక్క వేసి వేపి మెత్తగా వేపిన నువ్వులతో పాటు గ్రైండ్ చేసి వేసుకోవచ్చు. ఇది ఇంకో రుచి.

  4. పొడి ముందే చేసి డబ్బాలో ఉంచుకునే కంటే అప్పటికప్పుడు చిట్లించిన నువ్వులతో చేసే అన్నం రుచి చాలా గొప్పగా ఉంటుంది.

ప్రసాదం నువ్వుల అన్నం | ఏల్లు సాదం - రెసిపీ వీడియో

Sesame Rice | Ellu sadam | Temple Style Nuvvula Annam

Flavored Rice | vegetarian
  • Prep Time 20 mins
  • Cook Time 10 mins
  • Total Time 30 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • నువ్వుల కారం కోసం
  • 3 tbsp నల్ల నువ్వులు
  • 2 tbsp మినపప్పు
  • 6 - 8 ఎండు మిర్చి
  • 1 రెబ్బ కరివేపాకు
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • ఉప్పు
  • 1 cup బియ్యం (185 gm ఉప్పేసి పొడి పొడిగా వండుకున్నది)
  • తాలింపు కోసం
  • 3 tbsp నువ్వుల నూనె/ నెయ్యి
  • 1 tsp ఆవాలు
  • 3 చల్ల మిరపకాయలు
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1 tbsp పచ్చి సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర

విధానం

  1. నువ్వుల కారం కోసం ఉంచిన పదార్ధాలు అన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపి పక్కనుంచుకోవాలి.
  2. నువ్వులు కరివేపాకు వేసి నువ్వులు చిట్లేదాకా సన్నని సెగ మీద వేపుకోవాలి.
  3. వేపుకున్న వన్నీ మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోండి.
  4. ఉడికించి పొడి పొడిగా ఆరబెట్టుకున్న అన్నంలో నువ్వుల కారం వేసి కలుపుకోవాలి. 1 tbsp పక్కనుంచి ఆఖరున చూసి కలుపుకోవాలి.
  5. నూనె వేడి చేసి చల్ల మిరపకాయ ముక్కలు, ఆవాలు సెనగపప్పు మినపప్పు కరివేపాకు జీలకర్ర వేసి కారకరలాడేట్టు తాలింపు వేపుకోవాలి.
  6. వేగిన తాలింపులో పొడి కలిపి ఉంచుకున్న అన్నం వేసి బాగా కలుపుకోవడమే!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

Sesame Rice | Ellu sadam | Temple Style Nuvvula Annam