శ్రీఖండ్ రెసిపి | గుజరాత్ స్పెషల్ శ్రీఖండ్ | బెస్ట్ శ్రీఖండ్ రెసిపి

గుజరాత్ స్పెషల్ శ్రీఖండ్ చిక్కని పెరుగుని పన్నీరంతా చిక్కగా వడకట్టి అందులో జల్లించిన పంచదార పొడి, నానబెట్టిన ఎండుద్రాక్ష పచ్చి జీడిపప్పు వేసి కలిపి చేసే మహారాష్ట్ర గుజరాత్ స్పెషల్ శ్రీఖండ్ చేయడం నిజానికి చాలా సులభం. చల్లగా ఐస్క్రీమ్ అంత చిక్కగా అలా మృదువుగా గొంతులోకి జారిపోతుంది, అందరికి నచ్చి తీరుతుంది.

శ్రీఖండ్ అందరు చేయడం మీరు చూసే ఉంటారు ఏముంది ఇందులో చాలా ఈసీ అనిపిస్తుంది ఆ మాట నిజం. కానీ శ్రీఖండ్ మృదుత్వం మీద చిక్కదనం మీద ఆధారపడి ఉంటుంది అసలైన రుచి. ఆ వివరాలన్నీ కింద టిప్స్లో చెబుతున్నాను.

టిప్స్

పెరుగు :

  1. చిక్కని గేదె పాలతో చేసిన కమ్మని తాజా పెరుగుని మాత్రమే వాడాలి అప్పుడే కమ్మగా ఉంటుంది శ్రీఖండ్.

  2. శ్రీఖండ్ కోసం పెరుగుని బట్టలో వేసి వాడకట్టేప్పుడు కచ్చితంగా మీగడని తీసేసి వాడకట్టుకోవాలి, లేదంటే శ్రీఖండ్ అంత తరకాలు తరకాలుగా ఉంటుంది.

  3. పెరుగుని గట్టిగా మూటగా చుట్టి దాని మీద బరువు ఉంచి రాత్రంతా ఫ్రిజ్లో ఉంచేస్తే డెబ్భై శాతం నీరు దిగిపోతుంది పెరుగులోంచి. మరుసటి రోజున పెరుగుని మళ్ళీ గట్టిగ పిండి, మూటని తిరగేసి మళ్ళీ బరువు పెట్టి ఇంకో మూడు గంటలు ఫ్రిజ్లో ఉంచేస్తే 90 శాతం నీరు దిగిపోతుంది.

  4. శ్రీఖండ్కి పెరుగు ఎంత చిక్కగా ఉంటె అంత బాగుంటుంది తినేందుకు. ఇక్కడ మీతో నేను మరో విషయం పంచుకోవాలి,మీరు నీరు కాస్త తక్కువగా ఉంచి కూడా శ్రీఖండ్ తయారుచేసుకోవచ్చు, ఆ శ్రీఖండ్ చిక్కని గడ్డ పెరుగు మాదిరి ఉంటుంది. న తీరు ఐస్క్రీమ్ తీరులో ఉంటుంది.

పంచదార:

  1. పంచదార పొడి మాత్రమే వాడాలి. పంచదార పొడి కూడా ఒకేసారిగా కాకుండా కొద్దికొద్దిగా జల్లించి పెరుగు మిశ్రమంలో కలుపుకుని మిగిలినది మళ్ళీ పెరుగు మిశ్రమంలో జల్లించి కలుపుకోవాలి. ఇలా విడతల వారీగా పంచదార వేసుకుంటేనే పంచదార సమాంతరంగా పెరుగులో పంచదార కలుస్తుంది.

  2. మీరు పంచదార ఒకే సారి వేసేస్తే పంచదార పెరుగులో కలవదు.

ఫ్రెష్ క్రీమ్:

ఎంత కమ్మటి పెరుగు వాడిన ఎంతో కొంత మోతాదులో పులుపు ఉంటుంది అందుకే పిలుపుని తగ్గించడానికి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి అప్పుడు పులుపు తగ్గి కమ్మదనం వస్తుంది.

శ్రీఖండ్ రెసిపి | గుజరాత్ స్పెషల్ శ్రీఖండ్ | బెస్ట్ శ్రీఖండ్ రెసిపి - రెసిపీ వీడియో

Shrikhand Recipe | Kaju Draksh Shrikhand | Best Shrikhand Recipe | Gujarath Special Shrikhand

Desserts & Drinks | vegetarian
  • Prep Time 10 mins
  • Resting Time 18 mins
  • Total Time 28 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 litre Thick Strained Curd (Yogurt)
  • ¼ cup Powdered Sugar
  • 1 tsp Vanilla Essence
  • 2 tsp Cashew Nuts (chopped)
  • 2 tsp Raisins (soaked for 1 hour)

విధానం

  1. చిక్కని కమ్మని పెరుగులోంచి మీగడ తీసేయండి. మిగిలిన పెరుగుని ఒక బట్టలో వేసి గట్టిగ మూటకట్టి పైన బరువు పెట్టి రాత్రంతా ఫ్రిజ్లో ఉంచేయండి.
  2. మరుసటి రోజు పెరుగు మూటని తీసి గట్టిగ పిండి బరువు పెట్టి ఫ్రిజ్లో ఉంకో మూడు నాలుగు గంటలు ఉంచాలి. అప్పుడు తొంబై శాతం నీరు దిగుతుంది పెరుగులోంచి.
  3. మిక్సీలో పంచదార వేసి మెత్తని పొడి చేసుకోండి. అలాగే ఎండు ద్రాక్షని నీరు పోసి ఒక గంట నానబెట్టుకోవాలి.
  4. చిక్కని గడ్డకట్టిన పెరుగుని బాగా బీట్ చేసుకోండి. అందులో పంచదార పొడి కొద్దిగా కొద్దిగా జల్లించి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి.
  5. పంచదార పొడి బాగా కలిసిపోయాక తాజా క్రీమ్ నానబెట్టుటకున్న ద్రాక్ష పచ్చి జీడీపప్పు వేసి మరోసారి కలుపుకుని ఫ్రిజ్లో ఒక గంట ఉంచి ఆశ్వాదించండి!!!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.