సోయా ఖీమా మసాలా | మీల్ మేకర్ ఖీమా మసాలా

Curries
4.5 AVERAGE
3 Comments

రోటీ చపాతీలలోకి కొత్తగా ఘాటైన కూర్మ కోసం చూస్తున్నారా? అయితే సోయా ఖీమా మసాలా ట్రై చేయండి. నాన్- వెజ్ని మరిపించే ఈ సోయా ఖీమా మాసాలా ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అవుతుంది.

సాధారణంగా మీల్ మేకర్ తో ఏది చేసినా అందరూ ఇష్టపడతారు. కాబట్టి ఏ కూర వండాలో తెలియనప్పుడు ఏమి ఆలోచించకుండా ఈ సోయా ఖీమా మసాలా రెసిపీకి ఫిక్స్ అయిపోయి చేసి చూడండి అందరూ ఇష్టంగా తృప్తిగా తింటారు.

ఈ సోయా ఖీమా మసాలా వేడి వేడి అన్నంలోకి, పూరి, ఇడ్లి, సెట్ దోశ, అట్టు ఇలా ఎందులోకైన కూడా రుచిగా ఉంటుంది. వెజీటేరియన్స్ కి కూడా చాలా నచ్చుతుంది.

Soya Kheema Masala | Spicy Minced Soya | Mealmaker Kheema Masala | How to make Soya Kheema Masala Curry for Roti and Chapathi

టిప్స్

  1. ఈ కూరకి నూనె ఎక్కువుంటే రుచిగా ఉంటుంది

  2. సోయా చనక్స్ దొరికితే వాటిని నానబెట్టి మిక్సీ లో బరకగా రుబ్బి ఖీమలా చేసుకుని వాడుకోవచ్చు.

  3. సోయాని నీరు పిండి వేసాక, పచ్చి వాసనా పోయేదాకా వేపుకోవాలి.

  4. ఈ కూరలో ఒక్కోటి వేసుకుంటూ నిదానంగా నూనె పైకి తేలేదకా వండుకుంటేనే రుచోస్తుంది.

సోయా ఖీమా మసాలా | మీల్ మేకర్ ఖీమా మసాలా - రెసిపీ వీడియో

Soya Kheema Masala | Spicy Minced Soya | Mealmaker Kheema Masala | How to make Soya Kheema Masala Curry for Roti and Chapathi

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 30 mins
  • Cook Time 18 mins
  • Total Time 53 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 3/4 cup సోయా గ్రానుల్స్
  • 1 ఉల్లిపాయ పెద్దది- సన్నని తరుగు
  • 2 పచ్చిమిర్చి- సన్నని తరుగు
  • 1/3 cup నూనె
  • 1 tsp అల్లం వెల్లూలి పేస్టు
  • 2 టమాటో పెద్దది
  • 1 tsp కారం
  • ఉప్పు- రుచికి సరిపడా
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 tsp గరం మసాల
  • 1/4 tsp పసుపు
  • 150 ml నీళ్ళు

విధానం

  1. నూనె వేడి చేసి ఉల్లిపాయలు పచ్చి మిర్చి వేసి ఉల్లిపాయలు పింక్ కలర్ లోకి వచ్చే దాక ఫ్రై చేసుకోండి (ఉల్లిపాయలు ఎర్రగా వేపకండి)
  2. అల్లం వెల్లూలి పేస్టు వేసి పచ్చివాసన పోయేదాకా వేపి టమాటో వేసి గుజ్జు గా అయ్యేదాకా లో-ఫ్లేం మీద మగ్గించుకోండి
  3. నూనె పైకి తేలాక అప్పుడు ఉప్పు తో పాటు మిగిలిన మసాలా పొడులన్నీ వేసి నూనె తేలేదాక వేపుకోండి
  4. ఇప్పుడు ముప్పై నిమిషాలు వేడి నీటి లో నానా బెట్టిన సోయా గ్రానుల్స్ లోని నీటిని పిండి వేసి మీడియం ఫ్లేమ్ మీద మసాలాలు బాగా పట్టించి మంచి సువసనోచ్చెంత వరకు వేయించుకోండి
  5. సోయా పచ్చివాసన పోయి మగ్గాక నీళ్ళు పోసుకుని బాగా కలుపుకుని పుదినా తరుగు వేసి లో-ఫ్లేం మీద నీరు ఇగిరిపోయి కూర లోంచి నూనె పైకి తేలేదాకా కుక్ చేసుకుంటే చాలు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

Soya Kheema Masala | Spicy Minced Soya | Mealmaker Kheema Masala | How to make Soya Kheema Masala Curry for Roti and Chapathi