Curries
4.8 AVERAGE
8 Comments

ఉడికించిన సోయాని దోరగా వేపి ఉల్లి జీడిపప్పు మసాలా పేస్ట్ టమాటో గుజ్జు లో దగ్గరగా ఉడికించి చేసే ఘాటైన సోయా కుర్మా చపాతీ రోటీతో ఒక సూపర్ హిట్ కాంబినేషన్.

కుర్మాలు చాలా తీరులో ఉంటాయి, నేను ఈ కుర్మా దక్షిణ భారత దేశం వారి తీరు ఇంకా చెప్పాలంటే తెలుగు వారి తీరులో చేస్తున్నా. ఇది చపాతీతోనే కాదు వైట్ రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. సోయాని దక్షిణ భారత దేశంలో మీల్ మేకర్ అని కూడా అంటారు.

మిల్మేకర్ కుర్మా నేను చేసిన తీరులోనే కాక ఇంకొన్ని చిన్న మార్పులతో ఎలా చేసుకోవచ్చో కింద టిప్స్లో వివరంగా ఉంది చుడండి.

Soya Kurma | Mealmaker Kurma

టిప్స్

సొయా చంక్స్ :

సోయాని ముప్పై నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టి నీటిని పిండి పక్కనుంచుకోవాలి. ఎక్కువగా నానితే పేస్ట్ అయిపోతాయి. నానబెట్టే సమయం లేనట్లైతే మరిగే నీళ్లలో వేసి 5-7 నిమిషాలు ఉడికించి చల్లారాక నీటిని పిండేసుకోండి

సోయాని నూనెలో లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకుని తీసుకోవడం వల్ల కుర్మాలో ఉడికాక సొయా ముక్కలుగా చిదిరిపోదు.

నేను మీడియం సైజు లావుండే సోయా వాడాను. మీరు కావాలంటే చిన్న సోయా కూడా వాడుకోవచ్చు.

వేపిన ఉల్లిపాయ తరుగు:

నేను మాసాలా పేస్టులో వేపిన ఉల్లిపాయ వేశాను. ఉల్లిపాయలు వేపడం అందరికి తెలిసినదే కదా అని డైరెక్టుగా వేపిన ఉల్లిపాయలు వేసేశాను. మీరు ఈ తీరులో కూడా చేసుకోవచ్చు, ముందుగా నూనెలో ఉల్లిపాయల్ని ఎర్రగా వేపి తరువాత టమాటోలు వేసి మగ్గించి రెండూ కలిపి మిగిలిన మసాలా సామాగ్రీతో కలిపి మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు. దీన్ని డైరెక్టుగా నూనెలో వేసి మగ్గించుకోవడమే!

జీడిపప్పు:

నిజానికి జీడిపప్పు కంటే గసగసాలు చాలా రుచిగా ఉంటుంది కుర్మాలో. ఉంటె గసగసాలు వాడుకోడానికి ప్రయత్నించండి. టమాటో పేస్ట్:

టొమాటోలని పేస్టుగా చేసి వేయడం వల్ల చిక్కని గ్రేవీ వస్తుంది. మీరు కావాలంటే టొమాటోలని తురిమి కూడా వేసుకోవచ్చు.

టొమాటోలు కచ్చితంగా నూనె పైకి తేలేదాక వేగాలి అప్పుడే కుర్మాకు రుచి. లేదంటే పచ్చి వాసన వస్తుంది. లేదా మీరు నేను పైన చెప్పిన విధంగా ఉల్లిపాయతో పాటే టమాటో మగ్గించి కూడా చేసుకోవచ్చు.

చింతపండు:

వేసే ఆ కొద్దీ చింతపండు పులుసు కుర్మాకు చాలా రుచినిస్తుంది. నచ్చకుంటే వేయకపోయినా పర్లేదు. క్వాకంటే ఆఖరున నిమ్మరసం పిండుకొండి.

ఇంకొన్ని విధానాలు:

నచ్చితే టొమాటోలు మగ్గిన తరువాత ఉడికించిన ఒక చిన్న ఆలూని నలిపి వేసుకోవచ్చు.

Soya Kurma | Mealmaker Kurma

సొయా కుర్మా - రెసిపీ వీడియో

Soya Kurma | Mealmaker Kurma | How to Make Soya kurma

Curries | vegetarian
  • Prep Time 15 mins
  • Soaking Time 30 mins
  • Cook Time 20 mins
  • Total Time 1 hr 5 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా పేస్ట్ కోసం:
  • 1 cup ఎర్రగా వేపిన ఉల్లిపాయలు
  • 15 జీడిపప్పు
  • 1/4 cup పెరుగు
  • 4 పచ్చిమిర్చి
  • నీళ్లు మెత్తగా గ్రైండ్ చేసుకోడానికి
  • కుర్మా కోసం:
  • 50 gms సొయా
  • 1/4 cup నూనె
  • 3 tbsp చింతపండు పులుసు
  • 1 tbsp కారం
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 tsp గరం మసాలా
  • 2 చిటికెళ్లు పసుపు
  • 1/2 tsp వేపిన జీలకర్ర పొడి
  • 3 టమాటోల పేస్ట్
  • 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • 300 ml నీళ్లు

విధానం

  1. మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి (మరో విధానం కోసం టిప్స్ చుడండి).
  2. సొయాని 30 నిమిషాలు వేడి నీళ్లలో నానబెట్టినవి గట్టిగా పిండి నీరు తీసేయండి.
  3. ఒకటిన్నర టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి సొయా వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపి తీసుకోండి.
  4. మిగిలిన నూనె వేసి అల్లం వెల్లులి పేస్ట్ వేసి ఎర్రగా వేపుకోవాలి.
  5. వేగిన అల్లం వెల్లులి ముద్దలో ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం ఉప్పు కొద్దిగా నీళ్ళు వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  6. నూనె పైకి తేలాక గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ టమాటో పేస్ట్ వేసి టమాటోల్లోంచి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  7. టొమాటోలు మగ్గి నూనె పైకి తేలిన తరువాత చింతపండు పులుసు పోసి ఒక నిమిషం ఉడకనివ్వాలి.
  8. తరువాత వేపిన సొయా, తగినన్ని నీళ్లు పోసి కలిపి మూతపెట్టి నూనె పైకి తేలి గ్రేవీ చిక్కబడే దాకా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి.
  9. కుర్మలోంచి నూనె పైకి తేలాక కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి. ఈ కర్రీ వేడి అన్నం, చపాతీతో చాలా రుచిగా ఉంటుంది. (రెసిపీ గురుంచి మరిన్ని వివరాల కోసం పైన ఉన్న టిప్స్ చుడండి).

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

8 comments

  • R
    Reshma
    Please tell me the full detail recipe of soya chaap dum biryani
  • L
    Likhith
    Recipe Rating:
    Chala detail gaa explain chasaru..
  • S
    Sunny
    Recipe Rating:
    must try recipe.......it is awesome.
  • A
    Annadevara nageswararao
    Simply super, very elaborate explanation,, thank you
  • U
    Uddandarao Priyanka
    Recipe Rating:
    I have tried it came out very well
  • R
    Ramu marisetti
    I felt like I'm eating chicken kofta ...I'm cooking delicious curry quite often now ..absolutely❤ it.
  • S
    Sai teja
    Recipe Rating:
    Your recipies are amazing with short and clear explanation
  • S
    Sai Krishna Vamsi
    Recipe Rating:
    Must try
Soya Kurma | Mealmaker Kurma