దాభా స్టైల్ ఆలూ పాలక్

ఆలూ పాలక్ ఉత్తరభారత దేశంలో ఎక్కువగా ఇష్టంగా తినే కూరల్లో ఒకటి. చేయడానికి సులభంగా తిన్నాక తృప్తినిచ్చే రెసిపీ దాబా స్టైల్ ఆలూ పాలక్ కర్రీ. ఘుమఘుమలాడే మసాలాలతో చిక్కని పాలకూర గ్రేవీతో ఎంతో రుచిగా ఉండే ఈ కర్రీ రోటీలు, చపాతీ, పూరీ, అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

పార్టీ అయినా సింపుల్ లంచ్కె అయినా ఎప్పుడైనా సందర్భం ఏదైనా వేళ్ళు జుర్రుకుని మరీ లాగించేలా ఉండే సింపుల్ టేస్టీ రెసిపీ డాభా స్టైల్ ఆలూ పాలక్.

ఆలూ పాలక్ కర్రీ కూడా దాదాపుగా పాలక్ పనీర్ చేసినట్లే కానీ ఇందులో టమాటో , కసూరి మేథీ లాంటివి వేయరు!

ఈ సింపుల్ పంజాబీ రెసిపీ ఎప్పుడు చేసినా ఒకే రుచి రావాలంటే ఒక్క సారి టిప్స్ని అర్ధం చేసుకుని చేయండి.

Spinach Curry With Potatoes | Dhaba Style Aloo Palak | Aloo Palak Sabzi

టిప్స్

పాలకూర:

  1. సాధారణంగా పాలకూరతో చేసే వంటకాలు ఆకు పచ్చగా ఉండాలి, అప్పుడే సరైన రుచి చూడ్డానికి ఆకర్షణీయంగా ఉంటుంది. పాలకూర ఏ మాత్రం ఎక్కువగా ఉడికినా కూర ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది.

  2. పాలకూర ఆకులు మరిగే వేడి నీళ్లలో వేసి కేవలం 2 నిమిషాలు ఉడికించి తీసి వెంటనే చల్లని నీళ్లలో వేయాలి, అప్పుడు ఆకు కూర ఇంకా ఉడకడం ఆగిపోతుంది. మిగిలినది కూర చేసేప్పుడు నూనెలో మగ్గిపోతుంది.

  3. పాలకూర నెమ్మదిగా నూనె పైకి తేలేదాక ఉడికితేనే పసరు వాసం పోయి కూర రుచిగా ఉంటుంది.

నూనెలు:

నేను డాభా స్టైల్లో చేస్తున్నాను కాబట్టి కాస్త నూనెలు ఎక్కువగా వేసి చేస్తున్నా, మీరు హోంమేడ్ స్టైల్లో చేయాలనుకుంటే నూనెలు తగ్గించుకోవచ్చు

దాభా స్టైల్ ఆలూ పాలక్ - రెసిపీ వీడియో

Spinach Curry With Potatoes | Dhaba Style Aloo Palak | Aloo Palak Sabzi

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 200 gm పాలకూర ఆకుల తరుగు
  • 200 gm చెక్కు తీసి ఉడికించుకున్న ఆలూ
  • 3 tbsp నూనె
  • 1/2 tsp జీలకర్ర
  • 4 ఎండుమిర్చి
  • 1 tsp వెల్లులి తరుగు
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp పచ్చిమిర్చి తరుగు
  • ఉప్పు
  • 1/2 tsp జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp కారం
  • 1 tsp అల్లం వెల్లులి ముద్దా
  • 2 tsp నెయ్యి
  • నీళ్లు - పాలక్ ఉడికించడానికి

విధానం

  1. మరిగే నీళ్లలో పాలకూర ఆకు తరుగు వేసి 3 నిమిషాలు ఉడికించి వెంటనే చల్లని నీళ్లలో వేసి ఉంచండి.
  2. ఆకు చల్లారిన తరువాత మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. నూనె వేడి చేసి జీలకర్ర, ఎండుమిర్చి వెల్లులి వేసి వేపుకోవాలి. తాలింపు వేగిన తరువాత ఉల్లిపాయ తరుగు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  4. ఉల్లిపాయ మెత్తబడ్డాక పచ్చిమిర్చి ముక్కలు వేసి వేపుకోండి.
  5. ఉల్లిపాయ వేగిన తరువాత అల్లం వెల్లులి ముద్దా, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు వేసి మసాలాలు మాడకుండా వేపుకోవాలి.
  6. వేగిన మసాలాల్లో గ్రైఇండ్ చేసుకున్న పాలక్ పేస్ట్ అవసరమైతే కాసిని నీళ్లు పోసి పలుచన చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి.
  7. పాలకూర 10-12 నిమిషాలకి ఉడికి నూనె పైకి వస్తుంది అప్పుడు ఉడికించుకున్న ఆలూ ముక్కలు వేసి మరో 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
  8. దింపే ముందు నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. నెయ్యి వేసి కలిపి దింపేసుకోవడమే!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Spinach Curry With Potatoes | Dhaba Style Aloo Palak | Aloo Palak Sabzi