Curries
5.0 AVERAGE
6 Comments

తామిళనాడులో సాంబారులు చెప్పలేనన్ని. దాదాపుగా ప్రతీ కాయ- కూరతో సాంబార్ కాస్తారు. అలా నాకు ఒక తమిళ ఫ్రెండ్ నేర్పిన రెసిపీనే ఈ పాలకూర సాంబార్. చాలా సింపుల్ వేసేవి 4-5 పదార్ధాలు అంతే అన్నం అట్టు ఇడ్లీ దేనితో అయినా భలేగా ఉంటుంది.

ఈ సింపుల్ పాలకూర సాంబార్ రెసిపి చేసే ముందు టిప్స్ చదివి చేయండి బెస్ట్ సాంబార్ని ఎంజాయ్ చేయండి.

Spinach Sambar | Palak Sambar | Sambar recipe | Tamilnadu Style Sambar

టిప్స్

కందిపప్పు:

ఈ సాంబార్ కందిపప్పుతోనే కాదు, పెసరపప్పు, పచ్చి శెనగపప్పు, పెసలు అన్నింటితో చేసుకోవచ్చు.

సహజంగా సాంబార్కి కందిపప్పు కడిగి నానబెట్టి ఉదకబెడతాం. నేను మాంచి సువసంవచ్చేదాక వేపి ఉడకబెట్టాను, దీని వలన సాంబార్ ఘుమఘుమలాడిపోతుంది. తమిళనాడులో కండిపప్పుని మెత్తగా ఉడికించే సాంబార్ చేస్తారు, నేను చిక్కదనం కోసం ఉడికిన కందిపప్పుని మెత్తగా మిక్సీ చేసి వాడాను.

పాలకూర:

నచ్చితే మరింకేదైనా ఆకుకూర కూడా వాడుకోవచ్చు.

తాలింపు:

సాంబార్కి తాళింపులు వేసి సాంబార్ చేసుకోవచ్చు, లేదా సాంబార్ అంతా చేసి ఆఖరున తాలింపు వేసుకుని ఒక పొంగు రానిచ్చి దింపేసుకోవచ్చు. నేను తాలింపు వేసి సాంబార్ కాచాను.

బెల్లం:

సహజంగా సాంబార్లో చిన్న బెల్లం గడ్డ వేస్తే ఫ్లేవర్స్ బాగా బాలెన్స్ చేస్తుంది నచ్చని వారు వదిలేవచ్చు.

పాలకూర సాంబార్ - రెసిపీ వీడియో

Spinach Sambar | Palak Sambar | Sambar recipe | Tamilnadu Style Sambar

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup కంది పప్పు
  • 200 gms పాలకూర
  • 300 ml చింతపండు (పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు నుండి తీసినది)
  • 3 పచ్చిమిర్చి
  • 10 - 12 సాంబార్ ఉల్లిపాయలు/ఉల్లిపాయ చీలికలు
  • ఉప్పు
  • 1 tsp కారం
  • 1/2 tsp పసుపు
  • 2 tbsp సాంబార్ పొడి
  • 2 tbsp కొత్తిమీరా
  • 1/2 liter నీళ్ళు
  • 2 tsp నూనె
  • 1/2 tsp మెంతులు
  • 1/2 tsp ఆవాలు
  • 1/4 tsp ఇంగువ
  • 3 ఎండు మిర్చి
  • 2 కరివేపాకు

విధానం

  1. ముకుడులో కందిపప్పు వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా వేపి కడిగి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
  2. మెత్తగా ఉడికిన కందిపప్పుని మిక్సీ వేసుకోవాలి .
  3. నూనె వేడి చేసి అందులో ఆవాలు , మెంతులు ఎండు మిర్చి వేసి వేపుకోవాలి.
  4. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చీలికలు, పసుపు ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి.
  5. పాలకూర తరుగు వేసి పసరు వాసన పోయేదాక వేపుకోవాలి.
  6. నూనె పైకి తేలిన పాలకూరలో చింతపండు పులుసు, ½ లీటర్ నీళ్ళు పోసి ఒక పొంగు రానివ్వాలి.
  7. పొంగుతున్న పులుసులో ఏనుపుకున్న సాంబార్ పొడి వేసి మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
  8. మరుగుతున్న సాంబార్లో ఏనుపుకున్న కందిపప్పు, కారం వేసి సాంబార్ మరగనివ్వాలి .
  9. ఆఖరున కొత్తిమీర వేసి కలిపి దింపేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments

  • R
    Rishi
    Recipe Rating:
    Thank you for sharing this amazing recipe !! Chala manchiga eplain chestharu mee videos lo !
  • P
    Prema Guntakatta
    I like to watch all your recipes. I do some. Came out good.
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Adbhutam! I lost this taste from 5 decades. Now I got it. Thanks for your restless and continuous efforts to give us a real life to the traditional tastes. There are no enough words to admire you. May be 5 crore people have treated/tasted your cookings. So rest of our citizens are missing your tastes
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Adbhutam! I lost this taste from 5 decades. Now I got it. Thanks for your restless and continuous efforts to give us a real life to the traditional tastes. There are no enough words to admire you. May be 5 crore people have treated/tasted your cookings. So rest of our citizens are missing your tastes
  • N
    Nagasri
    It's taste too good
  • S
    Surekha
    Recipe Rating:
    Too good Thanks for giving us the written recipe 😘😘😘😘
Spinach Sambar | Palak Sambar | Sambar recipe | Tamilnadu Style Sambar