కోల్డ్ కోకో రెసిపీ | సమ్మర్ స్పెషల్ కోల్డ్ కోకో రెసిపీ
సమ్మర్ స్పెషల్ కోల్డ్ కోకో రెసిపీ అర కప్పు పాలల్లో చాకోలెట్ పొడి కస్టర్డ్ పొడి కలిపి కాచిన పాలల్లో పంచదార కస్టర్డ్ పొడి మిశ్రమం డార్క్ చాకోలెట్ ముక్కలు వేసి కరిగించి ఫ్రిజ్లో పెట్టి చల్లగా అందించే సూరత్ స్పెషల్ కోల్డ్ కోకో.
వేసవిలోనే కాదు ఎప్పుడు ఏ సందర్భానికి చేసుకున్నా సూపర్ హిట్ అయిపోతుంది సూరత్ స్పెషల్ కోల్డ్ కోకో.

టిప్స్
చాకోలెట్:
- మీకు నచ్చితే ప్యూర్ చాకోలెట్ వాడుకోగలిగితే కోల్డ్ కోకో రుచి చాలా గొప్పగా ఉంటుంది. సాధారణంగా స్ట్రీట్ ఫుడ్ అంటే చాకోలెట్ కాంపౌండ్ వాడతారు. కాంపౌండ్ స్వచ్ఛమైన చాకోలెట్ కాదు. రేటుని బట్టి క్వాలిటీ ఉంటుంది.
అద్భుతమైన రుచి కోసం:
- కోల్డ్ కోకో ఫ్రిజ్లో ఎంత తక్కువ డిగ్రీల దగ్గర చల్లబరిస్తే అంత రుచిగా ఉంటుంది. స్ట్రీట్ ఫుడ్ వారు స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల్లో పోసి ఐసులో ఉంచేస్తారు. అందుకే మొదటి సిప్లోనే గొప్ప అనుభూతి కలుగుతుంది.
కోల్డ్ కోకో రెసిపీ | సమ్మర్ స్పెషల్ కోల్డ్ కోకో రెసిపీ - రెసిపీ వీడియో
Surat Special Cold Cocoa | Cold Cocoa Recipe | Summer Special Cold Cocoa Recipe
Street Food
|
vegetarian
Prep Time 5 mins
Cook Time 15 mins
Total Time 20 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 3 tbsp కోకో పొడి
- 1 tbsp కస్టర్డ్ పొడి
- 1 tsp వెనిలా ఎసెన్స్
- 1/2 litre పాలు
- 1/3 cup పంచదార
- 60 gms డార్క్ చాకోలెట్
విధానం
-
కోకో పొడి పొడి కస్టర్డ్ వెనీలా పొడిలో కాసిని పాలు పోసి గడ్డలు లేకుండా కలిపి పక్కనుంచుకోండి.
-
మిగిలిన పాలను మరిగించి, చక్కర వేసి పూర్తిగా కరిగిపోయే వరకు కలపండి.
-
వేడి పాలలో కోకో-కస్టర్డ్ స్లర్రీ మరియు సన్నగా తరిగిన డార్క్ చాక్లెట్ ముక్కలను వేసి కలుపుతూ, మిశ్రమం కొద్దిగా చిక్కబడే వరకు ఉడికించాలి. ఆపై స్టవ్ ఆఫ్ చేయండి.
-
చిక్కబడిన చాకోలెట్ మిశ్రమంని పూర్తిగా చల్లార్చి ఫ్రిజ్లో కనీసం ఐదు ఆరు గంటలు ఉంచండి.
-
చల్లబడి చిక్కబడిన కోల్డ్ కోకోని గ్లాసుల్లో నింపి పైన కోకో పౌడర్ లేదా కొన్ని చాకోలెట్ తురుము చల్లి సర్వ్ చేయండి.

Leave a comment ×
1 comments