బెల్లం కొబ్బరి అన్నం
ప్రసాదంగా, స్వీట్ తినాలనిపించినా త్వరగా చేసుకోగలిగే కమ్మని స్వీట్ రెసిపీ బెల్లం కొబ్బరి అన్నం. కొబ్బరి అనగానే తాలింపు గుభాళింపుతో ఉండే కమ్మని అన్నమో లేదా పలావ్లో గుర్తుకొస్తాయి. కానీ అదే కొబ్బరిలో బెల్లం పాకం ఉడికించిన అన్నం కలిపి తీపి అన్నం కూడా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.
చూడ్డానికి తెలుగు వారు చేసే చక్కర పొంగలిలా అనిపిస్తుంది, కానీ రుచి భిన్నం. చేసే తీరు చెక్కరపొంగళి కంటే సులభం! (చెక్కెర పొంగలి రెసిపీ లింక్)
బెల్లం కొబ్బరన్నం రెసిపీ పుట్టుక వెనుక ఒక చిన్న కథ ఉంది. ఒక సారి కొబ్బరి హల్వా చేసి భోజనంలో వడ్డించారు, ఆ పక్కనే తెల్ల అన్నం కూడా ఉంది కంచంలో కాస్త కొబ్బరి హల్వాతో తెల్ల అన్నం కలిసింది. ఆ ముద్ద చాలా రుచిగా అనిపించింది. అప్పుడు అవును కదా ఇలా ఎందుకు చేయకూడదు అనిపించి చేసిన రెసిపీ.

టిప్స్
బెల్లం:
-
నేను బెల్లం వాడాను నచ్చితే పంచదార కూడా వాడుకోవచ్చు.
-
కప్పు బియ్యానికి కప్పు బెల్లం సరిపోతుంది, తక్కువనిపిస్తే వేసుకోవచ్చు. నేను వాడిన బెల్లంలో ఇసుక లేదు కాబట్టి బెల్లం కరిగించి అన్నంలో కలిపేసాను. మీరు బెల్లాన్ని కరిగించి పాకం వడకట్టుకోండి
-
బెల్లం పాకం నురగగా మసిలితే చాలు చిక్కబడకూడదు. పాకం చిక్కబడితే అన్నానికి పట్టదు
కొబ్బరి:
పచ్చి కొబ్బరి పాకంలో వేసాక కాస్త దగ్గరగా జిగురుగా అయ్యేదాకా ఉడికిస్తే చాలు.
ఇంకొన్ని టిప్స్:
-
నచ్చితే ఆఖరున పచ్చ కర్పూరం వేసుకోండి.
-
అన్నాన్ని పలుచని కొబారి పాలు లేదా పాలతో ఉడికిస్తే కమ్మగా ఉంటుంది అన్నం.
బెల్లం కొబ్బరి అన్నం - రెసిపీ వీడియో
Sweet Coconut Rice | Bellam kobbarannam
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బియ్యం
- 1 cup నీళ్లు
- 1 cup పాలు /కొబ్బరి పాలు
- 3 tbsp నెయ్యి
- 15 జీడిపప్పు
- 15 కిస్మిస్
- 4 యాలకలు
- 1 cup బెల్లం
- 3 tbsp నీళ్లు
- 1 cup పచ్చి కొబ్బరి తురుము
విధానం
-
బియ్యం లో నీళ్లు పాలు పోసి కుక్కర్ మూతపెట్టి ఒక విజిల్ హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద రానిచ్చి స్టీమ్ పోనివ్వాలి.
-
నెయ్యి కరిగించి జీడిపప్పు కిస్మిస్ ఎర్రగా వేపి తీసుకోవాలి.
-
అదే నెయ్యిలో బెల్లం నీళ్లు పోసి బెల్లం కాస్త చిక్కబడనివ్వాలి.
-
చిక్కబడుతున్న బెల్లంలో కొబ్బరి యాలకలు వేసి మరింత దగ్గర పడనివ్వాలి.
-
పచ్చికొబ్బరి వేసి 4-5 నిమిషాలు ఉడికించాక అన్నం వేసి బాగా పట్టించి జీడిపప్పు కిస్మిస్ వేసి 8 నిమిషాలు మూత పెట్టి ఉడికించి దింపేసుకోవాలి.

Leave a comment ×
2 comments