స్వీట్ కార్న్ గట్టి పకోడీ | సాయంత్రాలు టీ తో కరకరలాడే సరైన జోడీ ఈ స్వీట్ కార్న్ గట్టి పకోడీ
సాయంత్రాలు టీ తో కరకరలాడే సరైన జోడీ ఈ స్వీట్ కార్న్ గట్టి పకోడీ సరైన జోడీ! ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో వివరంగా ఉంది చూడండి.
ఉల్లిపాయ గట్టి పకోడీ దక్షిణ భారతదేశ పాపులర్ స్నాక్. సాయంత్రాలు ఏ వీధి చివర బండి దగ్గరికి వెళ్ళినా మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయ పకోడీ తప్పక దొరుకుతుంది. ఉల్లిపాయ పకోడీ తీరులోనే చిన్న మార్పులతో స్వీట్ కార్న్తో చేసిన బెస్ట్ స్నాక్.
ఈ పకోడీ టీ తో చాలా బాగుంటాయ్. ఈ సింపుల్ పకోడీ సంబంధించి కొన్ని టిప్స్ తెలుసుకోకపోతే పకోడీ మెత్తగా వస్తాయ్, కాబట్టి టిప్స్ ఫాలో అవుతూ చేయండి బెస్ట్ పకోడీ వస్తుంది.

టిప్స్
-
స్వీట్ కార్న్ని మరుగుతున్న నీటిలో వేసి ఒకే ఒక్కపొంగు రాగానే దింపేసి వడకట్టి పూర్తిగా చల్లారచాలి. ఎక్కువగా ఉడికినా వేడి మీద కార్న్ ని మెదిపినా నీరు వదులుతుంది.
-
స్వీట్కార్న్ కి బదులు నాటు మొక్కజొన్న కూడా వాడుకోవచ్చు.
-
ఈ పకోడీ ఎంత గట్టిగా ఉంటే అంత కరకరలాడుతూ వస్తాయ్.
-
ఉల్లిపాయ ఉడికించిన కార్న్ ని పిండాగా వచ్చే నీరు సరిపోతుంది ఈ కొలతకి. పకోడీ పిండి కూడా తడి పొడిగా ఉంటే కరకరలాడుతూ వస్తాయ్ పకోడీ.
-
పిండి లూసు అయితే కొద్దిగా పొడి శెనగపిండి కలుపుకోవచ్చు.
స్వీట్ కార్న్ గట్టి పకోడీ | సాయంత్రాలు టీ తో కరకరలాడే సరైన జోడీ ఈ స్వీట్ కార్న్ గట్టి పకోడీ - రెసిపీ వీడియో
Sweet Corn Fritters | Crispy Sweet Corn Onion Pakodi | How to make sweetcorn Pakoda
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup స్వీట్ కార్న్
- 1/2 cup పలుకులుగా గ్రైండ్ చేసుకున్న స్వీట్ కార్న్
- 3 cups ఉల్లిపాయ చీలికలు
- 3/4 cup శెనగపిండి
- 1/4 cup బియ్యం పిండి
- ఉప్పు
- 1 tsp ధనియాల పొడి
- 1 tsp కారం
- 1 tsp జీలకర్ర
- 1/4 tsp వాము
- 1/4 tsp పసుపు
- 2 tbsp కొత్తిమీర తరుగు
- 2 tsp పచ్చిమిర్చి తరుగు
- 1 రెబ్బ కరివేపాకు
- 1/2 tsp చాట్ మసాలా /నిమ్మరసం
విధానం
-
నీళ్ళని మరిగించి అందులో స్వీట్ కార్న్ వేసి ఒక పొంగురాగానే దింపి వడకట్టి పూర్తిగా చల్లారనివ్వాలి
-
గిన్నెలో ఉల్లిపాయ చీలికలు, పూర్తిగా చల్లారిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి గట్టిగా పిండుతూ కలుపుకుంటే నీరు వదులుతుంది.
-
బాగా వత్తుకున్నాక మిగిలిన పదార్ధాలన్నీ వేసి గట్టిగా పిండుతూ కలుపుకోండి.
-
కలుపుకున్న పిండిని పకోడీల మాదిరి వెల్ల మధ్యన నలుపుతూ వేసుకోవచ్చు, లేదా పునుకుల మాదిరీ వేసుకోవచ్చు.
-
పకోడీ వేసేప్పుడు మరిగే నూనె పూర్తిగా తగ్గించి, వేశాక మీడియం – హై ఫ్లేమ్ మీద ఎర్రగా వేపి తీసుకోండి.

Leave a comment ×
1 comments