చక్కెర పొంగలి
ప్రసాదంగా లేదా తీపి తినాలనిపించినప్పుడు తెలుగు వారి స్పెషల్ చక్కెర పొంగలి చక్కని ఎంపిక అవుతుంది. తెలుగు వారి సంప్రదాయ చక్కెర పొంగలి రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
“చక్కెర పొంగలి” దక్షిణ భారతదేశం ప్రేత్యేకమైన సంప్రదాయ వంటకం. కానీ దక్షిణాదిన రాష్ట్రానికి ఒక తీరుగా చేస్తారు. తెలుగు వారు బెల్లం పాకం పట్టి ఉడికిన అన్నంలో కలుపుతారు, తమిళులు అన్నంలో పాలు కూడా చేర్చి చేస్తారు. పేరు ఒక్కటే అయినా రుచి పూర్తిగా భిన్నం.
నేను తెలుగు వారు చేసే చెక్కెర పొంగలి చెబుతున్నాను. ఇది దాదాపుగా ప్రతీ పండుగకి తెలుగు వారింట ఉండాల్సిందే! ప్రేత్యేకించి దశరా పండుగకి. పొంగలి చేయడం చాలా తేలికే అయినా కొన్ని పద్ధతుల్లో వండితేనే పొంగలికి మాంచి రంగు రుచి. లేదంటే తెల్లగా ఉండి అనుకున్న రుచి రాదు. పర్ఫెక్ట్ రుచి ఎలా వస్తుంది లాంటివన్నీ నేను టిప్స్లో వివరంగా ఉంచాను చూడండి.

టిప్స్
తీపి- నచ్చితే ఒకటికి ఒకటి తీపి వేసుకోవచ్చు. నేను 1: 1 1/2 వేశాను. పొంగలికి నా తీపి కొలత చాలా బాగుంటుంది. ఇంకా నేను కొంత పంచదార, కొంత బెల్లం వేసి చేశాను. పంచదార బెల్లం కలయికల తీపి పొంగలికి మాంచి రుచి. నచ్చితే అచ్చంగా బెల్లంతోనే చేసుకోవచ్చు.
నెయ్యి- నెయ్యి నేను 8 tbsp దాకా వాడాను, నెయ్యి కొద్దిగా కొద్దిగా వేస్తూ పొంగలి సన్నని సెగ మీద ఎక్కువసేపు నిదానంగా ఉడికితే చాలా రుచిగా ఉంటుంది. అంత నెయ్యి వద్దనుకుంటే నెయ్యి తగ్గించుకోవచ్చు.

చక్కెర పొంగలి - రెసిపీ వీడియో
Sweet pongal recipe | Chakkara pongali | How to make Sakkarai pongal
Prep Time 3 mins
Cook Time 30 mins
Total Time 33 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 3/4 cup బియ్యం
- 1/4 cup పెసరపప్పు
- 2 cup నీళ్ళు
- 1/2 cup బెల్లం
- 3/4 cup పంచదార
- 1/4 cup బెల్లం కరిగించడానికి నీళ్ళు
- 1 tsp యాలకలపొడి
- 15 జీడిపప్పు
- 10 ఎండు ద్రాక్ష
- 3 tbsp ఎండుకొబ్బరి ముక్కలు
- పచ్చ కర్పూరం – చిటికెడు
- 6 tbsp నెయ్యి
విధానం
-
పెసరపప్పుని సన్నని సెగ మీద కలుపుతూ సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
-
వేపుకున్న పప్పు బియ్యం కలిపి కడిగి నీళ్ళు పోసి 3 కూతలు హై ఫ్లేమ్ మీద రానివ్వాలి.
-
బెల్లం, పంచదారలో కాసిని నీళ్ళు పోసి బెల్లం కరిగి ఒక పొంగు రాగానే దింపుకోవాలి.
-
ఉడికిన పెసరపప్పు అన్నంలో పాకాన్ని వడకట్టి పోసి సన్నని సెగమీద కలుపుతూ పాకం ముదురు రంగు వచ్చేదాకా ఉడికించాలి.
-
పాకం చిక్కబడి రంగు మారుతుండగా మరో పాన్లో 3 tbsp నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు, కిస్మిస్స్, ఎండుకొబ్బరి ముక్కలు వేసి ఎర్రగా వేపి పాకం లో ఉడుకుతున్న అన్నంలో వేసి కలిపి మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
-
పాకం సన్నని సెగ మీద ఉడికి ఉడికి అన్నానికి పట్టి చిక్కబడుతుంది అప్పుడు మళ్ళీ 2 tbsp నెయ్యి వేసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికించి ఆకారున మరో 2 tbsp నెయ్యి యాలకల పొడి పచ్చకర్పూరం వేసి కలుపుకుని దింపేసుకోవాలి. పాకం అన్నంలో పోసాక కనీసం 20 నిమిషాల పైనే సమయం పడుతుంది పూర్తవడానికి.
-
ఈ చక్కెర పొంగలి బయట మూడు రోజులు పాడవకుండా ఉంటుంది.

Leave a comment ×
13 comments