స్వీట్ కార్న్ తోటకూర గారెలు

స్వీట్ కార్న్ని మెత్తగా గ్రైండ్ చేసి తోటకూర కూర కలిపి గారెలుగా తట్టి ఎర్రగా వేపి చేసే గారెలు, తక్కువ టైంలో అయిపోతుంది బెస్ట్ టీ టైం స్నాక్ అవుతుంది.

ఈ స్వీట్ కార్న్ తోటకూర గారెలు ఇన్స్టంట్ రెసిపీ. ప్రీ ప్రిపరేషన్కి 5 నిమిషాలు పడుతుంది. ఆ తరువాత మసాలాలు బియ్యం పిండి కలిపి గారెలు వేసేయడమే!

ఇంత సింపుల్ స్నాక్ రెసిపీ రుచి చూస్తే తప్పక మళ్ళీ మళ్ళీ చేసేలా ఉంటుంది రుచి. ఈ స్వీట్ కార్న్ గారెలు కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.

Sweetcorn Amaranth Leaves Vada | Sweet corn thotakura garelu

టిప్స్

స్వీట్ కార్న్:

స్వీట్ కార్న్ అయితే చాలా రుచిగా ఉంటుంది ఈ గారెలకి. ఒక వేళా మీకు స్వీట్ కార్న్ దొరకనట్లైతే లేత నాటు మొక్కజొన్న గింజలు చాలా రుచిగా ఉంటుంది. ముదురు మొక్కజొన్న గింజలు వాడితే పీచుగా ఉంటుంది గారే! ఇంకా లేత గింజల్లో పాలు కారేలా ఉండే రుచి ఉండదు ముదురు గింజల్లో!!!

తోటకూర:

ఈ గారెలకి లేత తోటకూర ఆకులు మాత్రమే వాడుకోవాలి. తోటకూర కాడలు అస్సలు వేయకండి.

వడ పిండి:

స్వీట్ కార్న్ గ్రైండింగ్కి కార్న్ లోని నీరే సరిపోతుంది. గ్రైండింగ్కి ఇబ్బందిగా అనిపిస్తే చెంచా నీరు వేసుకోండి. పిండి బరకగా రవ్వగా ఉండాలి. మెత్తగా అట్టు పిండిలా ఉండకూడదు.

పిండి ఏ కారణం చేతనైనా జారుగా అనిపిస్తే కాస్త బియ్యం పిండితో పాటు సెనగపిండి కలుపుకోండి. లేదా గారెలకి బదులు బోండాలుగా వేసుకోండి.

వెల్లులి:

నచ్చకుంటే వెల్లులి వేయకున్నా పర్లేదు

గారెలు వేపే తీరు:

బాగా వేడెక్కిన నూనెలో పిండిని కాస్త మందంగా తట్టి నూనెలో వదిలేయండి. కాసేపు కదపకుండా వదిలేసి తరువాత హై ఫ్లేమ్ మీద వేపుకోండి.

గారెల చుట్టూ బుడగలు తగ్గేదాకా వేపుకుంటే చాలు, మరీ ఎక్కువగా వేపుకుంటే గారెలు నల్ల బడతాయి!!!

స్వీట్ కార్న్ తోటకూర గారెలు - రెసిపీ వీడియో

Sweetcorn Amaranth Leaves Vada | Sweet corn thotakura garelu

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Total Time 20 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 2.5 cups లేత స్వీట్ కార్న్ గింజలు
  • 2.5 cups లేత తోటకూర ఆకులు
  • 1/2 inch అల్లం
  • 6 - 7 వెల్లులి
  • ఉప్పు
  • 1 tsp జీలకర్ర
  • 1/2 tsp సొంపు
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1/4 - 1/3 cup బియ్యం పిండి
  • 4 - 5 పచ్చిమిర్చి
  • నూనె - వేపుకోడానికి

విధానం

  1. మిక్సీలో పచ్చిమిర్చి అల్లం వెల్లులి జీలకర్ర సోంపు ఉప్పు మొక్కజొన్న గింజలు వేసి బరకగా నీరు వేయకుండా గ్రైండ్ చేసుకోండి.
  2. గ్రైండ్ చేసుకున్న పిండిలో ఉల్లిపాయ తరుగు, తోటకూర ఆకు, బియ్యం పిండి వేసి కలుపుకోండి. ఆకుని ఎక్కువగా పిండకండి. ఆకు పిండితే నీరు వదిలి పిండి జారుగా అయిపోతుంది.
  3. తడి చేత్తో పిండి ముద్దని నెమ్మదిగా తట్టి మరిగే వేడి నూనెలో వేసి ఎర్రగా వేపి తీసుకోండి. (పర్ఫెక్ట్ గారెల కోసం ఒక సారి టిప్స్ చుడండి).
  4. వేడిగా ఈ స్వీట్కార్న్ గారెలు అల్లం పచ్చడితో చాలా రుచిగా ఉంటాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

17 comments

Sweetcorn Amaranth Leaves Vada | Sweet corn thotakura garelu