తమిళనాడు స్పెషల్ మిలగు వడ రెసిపీ | ఆంజనేయ వడ
ఆంజనేయ వడ నానబెట్టిన మినపప్పులో మిరియాలు ఇంగువ జీలకర్ర వేసి గట్టిగా అస్సలు నీరు వేయకుండా బరకగా రుబ్బుకున్న పిండిని పలుచగా చెక్కల మాదిరి వత్తి నూనెలో ఎర్రంగా వేపి తీసి చేసే తమిళనాడు స్పెషల్ మిలగు వడ రెసిపీ హనుమ ఆలయాల్లో శనివారం లేదా హనుమ జయంతి నాడు హనుమంతుడికి మాలగా వేసి ప్రసాదంగా ఇస్తారు.
కరలాడుతూ ఘాటుగా గొంతులోకి దిగుతూ తింటున్న కొద్దీ ఇంకా తినాలనిపించే ఆంజనేయ వడ లేదా మిలగు వడ చేయడం చాలా తేలిక కానీ పప్పు నానబెట్టే విధానం వేపే తీరులోనే అసలైన రుచుంటుంది.

టిప్స్
మినపప్పు:
- ఆంజనేయ వడకి కచ్చితంగా మినపప్పు ఇరవై నిమిషాలలకంటే నానకూడదు, పప్పు అంతకంటే ఎక్కువగా నానితే వడ పొంగుతుంది అప్పుడు రుచి మారిపోతుంది.
పప్పు రుబ్బే తీరు:
- నానబెట్టిన పప్పులోంచి నీరు పూర్తిగా ఒంపేసి అస్సలు చుక్కనీరు వేయకుండా గట్టిగా బరకగా రుబ్బుకోవాలి.
వడ వత్తేతీరు:
- వడని తడి బట్టమీద లేదా నూనె రాసిన పిలాస్టిక్ పేపర్ మీద పలుచగా వత్తి గాలికి ఆరనివ్వాలి. ౩-4 నిమిషాలు గాలికి ఆరిన వడలలోంచి తేమ తగ్గి నూనెలో పొంగకుండా గట్టిగా వేగుతాయ్.
వడ వేపే తీరు:
- వడని మరిగి వేడి నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా గట్టిపడే డాక్ వేపి తీసేయాలి. ఆ తరువాత మళ్ళీ రెండ్ సారి ఎర్రగా వేపుకోవాలి అప్పుడే వడ కరకరలాడుతూ ఉంటుంది.
తమిళనాడు స్పెషల్ మిలగు వడ రెసిపీ | ఆంజనేయ వడ - రెసిపీ వీడియో
Tamilnadu Special Anjaneya Vada | Milagu Vada Recipe | Temple Style Vada Recipe
Prasadam
|
vegetarian
Prep Time 10 mins
Total Time 10 mins
కావాల్సిన పదార్ధాలు
- 1 cup మినపప్పు
- 2 tsp మిరియాలు
- ¼ tsp ఇంగువ
- 1 tbsp జీలకర్ర
- ఉప్పు (రుచికి సరిపడా)
- 3 tbsp నూనె
- నూనె (వేపుకోడానికి)
విధానం
-
మినపప్పులో నీరు పోసి కేవలం ఇరవై నిమిషాలు మాత్రం నానబెట్టుకున్న నీటిని పూర్తిగా వడకట్టుకోవాలి.
-
నీరు పూర్తిగా వడకట్టుకున్న పప్పులో మిరియాలు ఇంగువ జీలకర్ర ఉప్పు వేసి అస్సలు నీరు వేయకుండా బరకగా పలుకు పలుకుగా రుబ్బుకోవాలి.
-
రుబ్బుకున్న పిండిలో నూనె వేసి బాగా కలుపుకోవాలి.
-
పిండి ముద్దని తడి వస్త్రం మీద లేదా నూనె రాసిన ప్లాస్టిక్ పేపర్ మీద అయినా పలుచగా వత్తుకోవాలి. వత్తుకున్న వడని గాలికి ఆరనిస్తే వాడలోని తేమ ఆరి గట్టిపడుతుంది.
-
గాలికి ఆరిన వడని మరిగే నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా 4-5 నిమిషాలు వదిలేయండి.
-
ఆ తరువాత నెమ్మదిగా తిరగేసి వడలని బయటకు తీసి మరో వాయి వడలని వేసుకోండి.
-
సగం వేపుకున్న వడలని మళ్ళీ నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద బంగారు రంగు వచ్చేదాకా వేపి తీసుకోండి.
-
ఈ వడలు 15 -20 రోజులు నిల్వ ఉంటాయి.

Leave a comment ×
6 comments