తమిళనాడు స్పెషల్ వెన్న పుట్టు

నానబెట్టిన బియ్యాన్ని మెత్తగా రుబ్బి బెల్లంలో ఉడికించి దింపే సులభమైన తమిళనాడు స్పెషల్ ప్రసాదం పండుగలకు పర్ఫెక్ట్. నోట్లో వెన్నలా జారిపోయే ఈ బెల్లం స్వీట్ తమిళవారు ఎక్కువగా ప్రసాదంగా చేస్తుంటారు.

నేను చెన్నైలోని అయ్యంగార్ కుటుంబం వద్ద నేర్చుకున్నాను. చాలా సులభమైన రెసిపీ వేసేవి 4 పదార్ధాలు అంతే!

Tamilnadu Special Vennu Puttu

టిప్స్

బియ్యం:

  1. బియ్యం కచ్చితంగా గంటకు పైగా నానాలి, తరువాత మెత్తగా రవ్వ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి.

  2. బియ్యంని అర కప్పు నీళ్లు పోసుకుంటూ నెమ్మదిగా మృదువుగా గ్రైండ్ చేసుకోండి

నీళ్లు:

  1. అర కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు. నీళ్లు ఇంతకంటే ఎక్కువగా పోస్తే దగ్గరపడడానికి సమయం పడుతుంది.

పచ్చిశెనగపప్పు:

  1. నేను పచ్చిశెనగపప్పు వాడాను మీరు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు.

ఇంకొన్ని టిప్స్:

  1. నచ్చితే పచ్చ కర్పూరం కొద్దిగా వేసుకోవచ్చు నేను వేయలేదు.

  2. వెన్న పుట్టు తడి చేత్తో తాకితే చేతికి అంటకూడదు అందాక కలుపుతూ దగ్గరపరచాలి. కలపకుండా వదిలేస్తే అడుగుపెట్టేస్తుంది.

తమిళనాడు స్పెషల్ వెన్న పుట్టు - రెసిపీ వీడియో

Tamilnadu Special Venna Puttu | Venna Pattu

Prasadam | vegetarian
  • Prep Time 2 mins
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Total Time 1 hr 22 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 cup నానబెట్టిన బియ్యం
  • 2 cup నీళ్లు
  • 1 cup బెల్లం
  • 2 tbsp నానబెట్టి పచ్చిశెనగపప్పు
  • 1/4 cup పచ్చికొబ్బరి తురుము
  • 1 tsp యాలకల పొడి
  • 2 tsp నెయ్యి

విధానం

  1. నానబెట్టిన బియ్యం లో అరకప్పు నీళ్లు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. బియ్యం పేస్ట్ ని నీళ్లలో కలిపి పక్కనుంచుకోవాలి.
  3. నెయ్యి కరిగించి అందులో నానబెట్టిన సెనగపప్పు బియ్యం కలిపిన నీళ్లు పోసి బియ్యం చిక్కని పేస్ట్ అయ్యేదాకా కలుపుతూ దగ్గరపడనివ్వాలి.
  4. బియ్యం ఉడికి దగ్గర పడ్డాక బెల్లం యాలకులపొడి వేసి కలిపి మరింత చిక్కబరచాలి.
  5. సుమారుగా 15 నిమిషాలు కలుపుకున్నాక చేతులు తడి చేసి పుట్టు తాకితే చేతికి అంటకూడదు అందాక కలుపుతూ దగ్గరపరచాలి.
  6. తడి చేతితో తాకి చూడండి చేతికి అంటకపోతే పచ్చి కొబ్బరి వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

18 comments

Tamilnadu Special Vennu Puttu