కోయంబత్తూర్ స్పెషల్ వంకాయ కొత్తిమీర కారం

వంకాయని మగ్గబెట్టి కొత్తిమీర పేస్ట్ వేసి ముద్దగా వండే ఘుమఘుమలాడే తెలుగు వారి స్పెషల్ రెసిపీ ఇది.

ప్రాంతం మారితే చేసే తీరు తీరు వేసే పదార్ధాలూ మారతాయి, అలాగే తమిళనాడు లో ఎప్పుడో సెటిల్ అయిన తెలుగు వారి స్పెషల్ రెసిపీ. నేను కోయంబత్తూర్ వెళ్ళినప్పుడు అక్కడి తెలుగు వారి ఇంట్లో తిన్నాను, చాలా నచ్చేసింది.

రెసిపీ దాదాపుగా తెలుగు వారి తీరులోనే ఉన్నప్పకిటికీ చిన్నమార్పులతో ఉంది. వంకాయ అంటే ఇష్టపడే వారికి ఈ కొత్తిమీర కారం ఎంతో నచ్చేస్తుంది. ఇందులో పచ్చిశెనగపప్పు, సోంపు, పచ్చికొబ్బరి ఉంటుంది. తెలుగు వారి తీరులో ఇవేవి ఉండవు.

Tamilnadu Style Brinjal Kothimeera Curry | Brinjal Curry | Vankaya Curry

టిప్స్

వంకాయ:

ఈ కూరకి సాధారణంగా తెల్ల వంకాయనే వాడతారు. లేతవి గింజ పడని వంకాయ అయితే చాలా రుచిగా ఉంటుంది కూర.

కొత్తిమీర:

కొత్తిమీరని చల్లని ఫ్రిడ్జ్లోని నీళ్లతో మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఆకు రంగు మారదు

పచ్చిమిర్చి:

రెసిపీలో కారమంతా పచ్చిమిర్చిదే యందు కారం వెయ్యరు. కాబట్టి కారాన్ని బట్టి పచ్చిమిర్చి అడ్జస్ట్ చేసుకోండి

కోయంబత్తూర్ స్పెషల్ వంకాయ కొత్తిమీర కారం - రెసిపీ వీడియో

Tamilnadu Style Brinjal Kothimeera Curry | Brinjal Curry | Vankaya Curry

Veg Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms లేత తెల్ల వంకాయ
  • సోంపు
  • 50 ml నీళ్లు
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • నానబెట్టిన పచ్చిశెనగపప్పు - చిన్న గుప్పెడు
  • 10 వెల్లులి
  • కొత్తిమీర పేస్ట్ కోసం
  • 250 gms కొత్తిమీర
  • 1/2 cup పచ్చి కొబ్బరి
  • 7-10 పచ్చిమిర్చి
  • 1.5 inch అల్లం
  • ఉప్పు
  • 1/2 cup చల్లని నీళ్లు

విధానం

  1. కొత్తిమీర పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి చిట్లనివ్వాలి, తరువాత వెల్లులి వేసి రంగు మారే దాకా ఎర్రగా వేపుకోవాలి.
  3. వేగిన వెల్లిలిలో పచ్చిశెనగపప్పు వేసి ఒక నిమిస్ధం వేపుకోండి, తరువాత వంకాయ ముక్కలు వేసి నూనెలో కలిపి మూత ఆపెట్టి 80% మగ్గబెట్టుకోండి. వంకాయ సగం పైన మగ్గిన తరువాత నీళ్లు చిలకరించుకుని మూత పెట్టి మగ్గిస్తే త్వరగా మగ్గిపోతుంది.
  4. 80% మగ్గిన వంకాయలో కొత్తిమీర పేస్ట్ వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టి వంకాయ మెత్తబడేదాకా ఉడికించి దింపేసుకోండి.
  5. ఈ కూర కాస్త ముద్దగానే ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

Tamilnadu Style Brinjal Kothimeera Curry | Brinjal Curry | Vankaya Curry