బ్రెడ్ ఉప్మా
10 నిమిషాల్లో తయారైపోయే అమేజింగ్ రెసిపీ అంటే బ్రెడ్ ఉప్మానే. బ్రేక్ఫాస్ట్ గా లేదా స్నాక్గా ఎలాగైనా పర్ఫెక్ట్గా ఉండే రెసిపీ బ్రెడ్ ఉప్మా. ఈ సింపుల్ 10 నిమిషాలా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజేస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
ఇంట్లో బ్రెడ్ ఉన్నా, అప్పటికప్పుడు ఎలాంటి ప్రీ-ప్రీపరేషన్ అవసరంలేని రెసిపీ అంటే బ్రెడ్ ఉప్మానే. బాచిలర్స్కి పర్ఫెక్ట్ రెసిపీ. బ్రెడ్ ఉప్మా సాయంత్రాలు చాయితో కూడా చాలా బాగుంటుంది.
ఈ సింపుల్ రెసిపీకి కొన్ని చిట్టి టిప్స్ పర్ఫెక్ట్ టెస్ట్ వచ్చేలా చేస్తుంది కాబట్టి చేసే ముందు టిప్స్ చూడండి ఆ తరువాత స్టెప్ ఫాలో అవ్వండి

టిప్స్
-
నేను బ్రౌన్ బ్రెడ్ వాడాను, మీరు ఇంకేదైనా బ్రెడ్ కొడవ వాడుకోవచ్చు.
-
నేను ఫ్లేవర్ టెస్ట్ కోసం నెయ్యి వేసి టోస్ట్ చేశా, మీరు toasterలో టోస్ట్ చేసి కూడా ఉప్మా చేసుకోవచ్చు.
-
ఈ ఉప్మా లో వేసే వెజ్జీస్ వేటిని ఎక్కువగా కుక్ చేయకూడదు, అలా చేస్తే గుజ్జుగా అయి అంత రుచిగా ఉండదు. తింటుంటే ప్రతీ వెజిటేబుల్ నోటికి పంటికి తగలాలి అప్పుడు రుచి.
-
ఉప్పు కొద్దిగా వేసుకోండి, బ్రెడ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి.
-
నేను ఫ్లేవర్ కోసం కొద్దిగా సాంబార్ పొడి వేశాను, మీరు తప్పక వేసుకోండి చాలా బాగుంటుంది.

బ్రెడ్ ఉప్మా - రెసిపీ వీడియో
Tasty Bread Upma | Quick and Easy breakfast | How to make Bread Upma
Prep Time 5 mins
Cook Time 7 mins
Total Time 12 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 6 Slices బ్రౌన్ బ్రెడ్
- 2 tbsp నెయ్యి
- 2 tsp నూనె
- 1 tsp ఆవాలు
- 10 జీడిపప్పు
- 1 tsp జీలకర్ర
- 2 రెబ్బలు కరివేపాకు
- 1 tsp నిమ్మరసం
- 1/2 tsp కారం
- ఉప్పు – కొద్దిగా
- 1/2 tsp సాంబార్ పొడి
- 1/4 tsp మిరియాల పొడి
- 1 టొమాటో (ముక్కలు)
- 1 ఉల్లిపాయ (ముక్కలు)
- 1/4 cup కాప్సికం (ముక్కలు)
- 1 tsp పచ్చిమిర్చి సన్నని తరుగు
- 1 tsp అల్లం తరుగు
- 1/3 cup నీళ్ళు
విధానం
-
పెనం మీద ½ చెంచా నెయ్యి పూసి బ్రెడ్ని సన్నని సెగ మీద రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి
-
కాల్చుకున్న బ్రెడ్ని ముక్కలుగా చేసుకోండి
-
నూనె మిగిలిన వేడి చేసి ఆవాలు జీడిపప్పు వేసి జీడిపప్పు వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాక వేపుకోవాలి
-
తరువాత జీలకర్ర కరివేపాకు వేసి వేపి ఉల్లిపాయ తరుగు వేసి ఒక నిమిషం వేపుకోండి చాలు
-
వేగిన ఉల్లిలో టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి అల్లం తరుగు, కాప్సికం తరుగు, ఉప్పు కారం సాంబార్ పొడి వేసి కలిపి టొమాటో మెత్తబడేదాకా మూతపెట్టి మగ్గించుకోవాలి
-
టొమాటో పైన తోలు సులభంగా వచ్చేస్తున్నప్పుడు ¼ కప్పు నీళ్ళు పోసి హై-ఫ్లేమ్ మీద మరిగించాలి.
-
తరువాత టోస్ట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి
-
ఆఖరున పైన 3 tbsp నీళ్ళు చిలకరించి మూతపెట్టి లో ఫ్లేమ్ మీద ఉడికిస్తే బ్రెడ్కి ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టి మెత్తబడుతుంది.
-
5 నిమిషాల తరువాత మిరియాల పొడి చల్లి కలిపి వేడి వేడిగా సర్వ చేసుకోండి.

Leave a comment ×
2 comments