సగ్గుబియ్యం చివడా | తిన్నకొద్దీ తినాలనిపించే సగ్గుబియ్యం మిక్చర్
తినడం మొదలెడితే ఎంత తింటున్నామో తెలియనంతగా తినేసే “సగ్గుబియ్యం చివడా” రెసిపీ అందరికీ ఇష్టమే. ఈ సింపుల్ స్నాక్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
సగ్గుబియ్యం చివడా కరకరలాడుతూ కారంగా పుల్లగా ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది. చాలా సార్లు సింపుల్ రెసిపీ అంటుంటాను, కానీ ఈ రెసిపీ ఎంత సింపుల్ అంటే అసలు వంట రాని వారు కూడా పర్ఫెక్ట్ గా చేసేస్తారు.

టిప్స్
సగ్గుబియ్యం:
-
ఈ సగ్గుబియ్యం చివడా కోసం మనం సాగగయబియ్యం పాయసంలో వాడే పెండలంతో చేసే సగ్గుబియ్యం పనికి రాదు. నైలాన్ సగ్గుబియ్యం అని మరో వరైటీ మార్కెట్లో ఉంది ఆ రకం సగ్గుబియ్యం అయితేనే పర్ఫెక్ట్ గా వస్తుంది. పెండలంతో చేసే సగ్గుబియ్యం వేపితే నూనె బాగా లాగేస్తాయి.
-
నైలాన్ సగ్గుబియ్యంలో కూడా పెద్ద సైజు సగ్గుబియ్యం రకం వాడుకోవాలి.
-
సగ్గు బియ్యం వేడి నూనె లో పిడికెడుతో కొద్ది కొద్దిగా మాత్రమే వేసి సగ్గుబియ్యం పొంగి చిట్లే దాకా వేపుకోవాలి, అప్పుడే సగ్గుబియ్యం లోపలి దాకా వేగినట్లు.
-
సగ్గుబియ్యం నూనెలో వెయ్యగానే పొంగుతాయ్, ఇంకా వేపితే పొంగినవి చిట్లతాయ్, అందాక వేపుకోవాలి.
-
నూనె బాగా వేడిగా ఉంటే సగ్గుబియ్యం ఎర్రగా వేగుతాయ్.
పంచదార:
ఈ సగ్గుబియ్యం చివడాలో నేను పంచదార చేశాను. కావాలంటే పంచదార స్కిప్ చేసుకోవచ్చు
పచ్చిమిర్చి:
ఈ సగ్గుబియ్యం చివడాలో ఎర్రగా వేగిన పచ్చిమిర్చి రుచి బాగుంటుంది. ఎక్కువ రోజులు నిలవుండాలంటే మాత్రం కారం వేసుకోండి.
సగ్గుబియ్యం చివడా | తిన్నకొద్దీ తినాలనిపించే సగ్గుబియ్యం మిక్చర్ - రెసిపీ వీడియో
Tasty Sabudana Chivda | Sago Spicy Mixture | Nylon Sabudana Chivda Homemade | Quick & Simple Recipe
Prep Time 2 mins
Cook Time 20 mins
Total Time 22 mins
Servings 10
కావాల్సిన పదార్ధాలు
- 300 gm నైలాన్ సగ్గుబియ్యం
- 1/2 cup ఎండుకొబ్బరి చీలికలు
- 2 రెబ్బలు కరివేపాకు
- 1/4 cup జీడిపప్పు
- 1/4 cup ఎండు ద్రాక్ష
- 1/2 cup వేరుశెనగపప్పు
- 1 tsp ఉప్పు
- 1.5 tbsp పంచదార
- 3 చీలికలు పచ్చిమిర్చి
- నూనె వేపుకోడానికి
విధానం
-
వేడెక్కిన నూనెలో సగ్గుబియ్యం పిడికెడు వేసి బాగా పొంగి చిట్లేదాకా వేపుకుని తీసుకోండి. ఇలాగే మిగిలిన సగ్గుబియ్యం అంతా వేపుకోండి.
-
అదే నూనెలో పల్లీలు, జీడిపప్పు, ఎండు ద్రాక్షా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి వేసి ఎర్రగా వేపి వేపుకున్న సగ్గుబియ్యంలో వేసుకోండి. సగ్గుబియ్యాన్ని పూర్తిగా చల్లరనివ్వండి.
-
ఉప్పు, పంచదార వేసి కలిపి వేపుకున్న సగ్గుబియ్యంలో చల్లి కలుపుకోవాలి.
-
ఇవి గాలి చోరాణి డబ్బాలో ఉంచితే కనీసం 3 రోజులు తాజాగా ఉంటాయ్. పచ్చిమిర్చికి బదులు కారం వేసుకుంటే చాలా ఇంకా ఎక్కువ రోజులు నిలవుంటాయ్.

Leave a comment ×
438 comments