ఉల్లి బోండా | టీ షాప్ స్టైల్ ఉల్లి బోండా | ఆనియన్ బోండా
ఉల్లి బోండా తీ తాగుతూ కరకరలాడే ఉల్లి బోండా కొరుక్కుతినడం మరిచిపోలేని ఒక గొప్ప అనుభూతి. తమిళనాడులో దాదాపుగా ప్రతీ టీ అంగడిలో దొరికే ఈ ఉల్లిబోండా చేసినంత సేపు పట్టదు ఖాలీ చేయడం. అంత గొప్ప రుచిగా ఉంటాయి మరి.
ఈ సింపుల్ ఉల్లి బోండా చేయడానికి అవసరమయ్యే పదార్ధాలు చాలా మితంగా ఉంటాయి కానీ టీ షాప్లో అమ్మే రుచి రావాలంటే మాత్రం కచ్చితంగా టిప్స్ ని అర్ధం చేసుకోవాల్సిందే, అప్పుడే మీకు కరకరలాడే ఉల్లి బొండాలు వస్తాయ్!!! వస్తాయ్!!!

టిప్స్
ఉల్లిపాయ తరుగు:
- ఉల్లి బోండాలకు ఉల్లిపాయని కాస్త మందంగా చేరుకోవాలి, అప్పుడే ఉల్లి పై భాగం వేగి లోపలి భాగం మగ్గి రుచిగా ఉంటుంది. మరీ సన్నంగా చీరుకుంటే ఉల్లి ఎక్కువగా వేగి సన్నని దారాల్లా అయిపోయి తింటుంటే రుచిగా అనిపించవు బొండాలు.
బోండా పిండి కలిపే తీరు:
-
సాధారణంగా ఈ బోండాకి నీరు వాడుకోవలసిన అవసరం లేదు ఉల్లిలోంచి వచ్చే నీరు సరిపోతుంది.
-
ఇంకా ఉల్లిని మరీ ఎక్కువగా పిండినా పిండి జారుగా అయిపోయి బొండాలు కరకరలాడుతూ రావు అందుకే పిండి తడిపొడిగా ఉంటె చాల బాగా వస్తాయ్ బోండాలు.
వేపే తీరు:
-
బొండాలు మరిగే వేడి నూనెలో వేశాక 2-3 నిమిషాలు వదిలేయండి, ఆ తరువాత నెమ్మదిగా తిరగేసుకుంటే బోండా చిదిరిపోకుండా ఎర్రగా వేగుతుంది. బోండా వేసిన వెంటనే గరిట పెడితే బోండా చిదిరిపోతుంది.
-
ఈ ఉల్లి బోండా వేగడానికి కచ్చితంగా సమయం పడుతుంది, అంత నిదానంగా వేగితేనే బోండా కరకరలాడుతూ రుచిగా ఉంటుంది.
ఉల్లి బోండా | టీ షాప్ స్టైల్ ఉల్లి బోండా | ఆనియన్ బోండా - రెసిపీ వీడియో
Tea Shop Style Onion Bonda | Onion Bonda Recipe
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- ½ kg ఉల్లిపాయ చీలికలు
- 2 tbsp పచ్చిమిర్చి ముక్కలు
- ½ tsp జీలకర్ర
- 1 tbsp అల్లం వెల్లులి ముద్ద
- 1. 1/2 tsp కారం
- ఉప్పు - రుచికి సరిపడా
- 2 tbsp కరివేపాకు తరుగు
- ¼ cup కొత్తిమీర తరుగు
- ¼ cup పుదీనా తరుగు
- 3 tbsp బియ్యం పిండి
- 2 tbsp మైదా పిండి
- ¾ cup సెనగపిండి
- నూనె - బొండాలు వేపుకోడానికి
విధానం
-
కాస్త మందంగా చీరుకున్న ఉల్లిపాయల్లో పిండ్లు తప్ప మిగిలిన పదార్ధలన్నీ వేసి గట్టిగా పిండుకోండి.
-
పిండుకున్న ఉల్లిలో మైదా బియ్యం పిండి సెనగపిండి వేసి తడిపొడిగా కలుపుకోండి.
-
చేతులు తడి చేసుకుని చిన్న ఉండలుగా మరిగే వేడి నూనెలో బొండాలు వేసి మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు వేగనివ్వండి.
-
3 నిమిషాలు వేగిన తరువాత బోండాలని నెమ్మదిగా తిరగేస్తూ బొండాల చుట్టూ బుడగలు తగ్గేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకుని తీసుకోండి.
-
బొండాలు వేడి మీద కాస్త మెత్తగా అనిపిస్తాయి కాబట్టి 5 నిమిషాలు జల్లెడలో వేసి వదిలేస్తే కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉండే ఉల్లి బోండా తయారైపోతుంది.

Leave a comment ×