తెలంగాణా రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై

వేడి అన్నం, చపాతీ, పూరీ లేదా స్టార్టర్గా ఘాటైన ఘుమఘుమలాడే చికెన్ ఫ్రై తెలంగాణా రేస్టారంట్ స్టైల్ చికెన్ ఫ్రై.

చికెన్ ఫ్రై అంటే చికెన్కి మసాలాలు పట్టించి నూనెలో వేపి తీస్తారు. కానీ తెలంగాణా స్టైల్ కాస్త భిన్నం, ఒక రకంగా ఇది చికెన్ రోస్ట్ అనాలి. కానీ ఈ చికెన్నె చికెన్ ఫ్రై అంటారు.

తెలంగాణ స్టైల్ చికెన్ ఫ్రై అంటే కొద్దిగా నూనె వేసి నెమ్మదిగా అడుగుపడుతున్న మసాలాలని గీరి చికెన్ని ఫ్రై చేస్తారు. చికెన్ ఫ్రై అంటే పూర్తిగా పొడిపొడిగా ఉండదు. ఇది కాస్త గుజ్జుగా సెమీ డ్రై గా ఉంటుంది.

సంప్రదాయ పద్ధతి లేదా తెలంగాణా ఇళ్ళలో చేసే కాస్త భిన్నంగా ఉంటుంది. సాధారణంగా చికెన్లో చింతపండు వేయరు. కానీ రుచి పెంచడానికి ఒక్క చెంచా చినపండు పులుసు వేసి చికెన్ వేపుతారు తెలంగాణా రెస్టారెంట్స్లో ఇది చాలా ప్రేత్యేకమైన రుచినిస్తుంది.

ఈ చికెన్ ఫ్రై రెసిపీ చాలా సింపుల్ కానీ కొన్ని టిప్స్తో చేస్తేనే అసలైన తెలంగాణాలో రేస్తారంట్స్లో దొరికే చికెన్ ఫ్రైని ఎంజాయ్ చేస్తారు.

Telangana Restaurant Style Chicken Fry | Chicken Roast

టిప్స్

  1. చికెన్ ముక్కలు మీడియం సైజ్ కట్ ఉండాలి. లేదంటే ముక్క వేగి మరీ చిన్నదిగా అయిపోతుంది.

  2. మసాలాలలో వేగుతున్న చికెన్ అడుగుపడుతుంది దాన్ని నెమ్మదిగా గరిటతో గీరాలి మళ్ళీ కలపాలి. ఇలా అడుగుటపడుతున్న ప్రతీ సారి గీరి చికెన్ని ఫ్రై చేస్తే చికెన్కి బాగా ఫ్లేవర్స్ పట్టి ఎంతో రుచిగా తయారవుతుంది చికెన్ ఫ్రై.

  3. ఈ రెసిపీలో ఉల్లిపాయ చీలికలు కాస్త మందంగా ఉండాలి. అవి ఎర్రగా వేగి ఉప్పు మస్యలలతో కలిసి ఎంతో రుచిగా ఉంటుంది. సన్నని చీలికలు ఎక్కువగా వేగి వేపుడులో కలిసిపోతాయ్

  4. సాధారణంగా చికెన్ ఫ్రైలో చింతపండు పులుసు వేయరు. రుచి పెంచడానికి కొద్దిగా చినటపందు పులుసు వేస్తే చాలా రుచిగా ఉంటుంది. నచ్చని వారు వదిలేయవచ్చు.

  5. ఈ ఫ్రై కి నాన్ స్టిక్ పాన్లు పనికి రావు ఎందుకంటే ఈ ఫ్రై రుచి అంతా చికెన్ అడుగుపట్టడంలో ఉంది. అది నానాస్తిక్లో సాధ్యం కాదు. అందుకే అడుగు మందంగా ఉండే ఇనుము లేదా కాస్ట్ ఐరన్ పాత్రలు వాడుకోవాలి.

తెలంగాణా రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రై - రెసిపీ వీడియో

Telangana Restaurant Style Chicken Fry | Chicken Roast

Starters | nonvegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 40 mins
  • Total Time 42 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kg చికెన్ (మీడియం సైజ్ కట్)
  • ఉప్పు
  • 1.5 tsp కారం
  • 1 tsp జీలకర్ర పొడి
  • 1 tsp ధనియాల పొడి
  • 1/2 tsp పసుపు
  • 1/2 tsp గరం మసాలా
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1.25 tbsp తాజా అల్లం వెల్లులి పేస్ట్
  • 1/4 cup నూనె
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 tbsp చింతపండు పులుసు
  • 1/2 tsp మిరియాల పొడి
  • 2 tbsp కొత్తిమీర తరుగు

విధానం

  1. అడుగు మందంగా ఉండే గిన్నెలో నూనెవేడి చేసి అందులో ఉల్లిపాయ చీలికలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  2. రెండు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లులి ముద్ద వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  3. వేగిన అల్లం వెల్లులి ముద్దలో చికెన్ ముక్కలు వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి.
  4. రెండు నిమిషాల తరువాత ఉప్పు కారం ధనియాల పొడి, జీలకర్ర పొడి,పసుపు గరం మసాలా వేసి బాగా పట్టించాలి చికెన్కి.
  5. మసాలాలు చికెన్కి బాగా పట్టి, చికెన్లోని నీరు ఆవిరి అయ్యాక 2 tbsp నీళ్ళు పోసి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు వేపుకోవాలి.
  6. 4-5 నిమిషాలకి మసాలాలు వేగి అడుగుపడుతుంది అప్పుడు మసాలాలని గీరి బాగా కలిపి మూత పెట్టి వేపుకోవాలి. ఇలాగే ప్రతీ 5 నిమిషాలకి ఒక సారి కలుపుతూ 15 నిమిషాలు వేపుకుని చింతపండు పులుసు పోసి మరో 10 నిమిషాలు వేపుకోవాలి.
  7. 10 నిమిషాల తరువాత మిరియాల పొడి కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

9 comments

  • S
    Sashi
    Recipe Rating:
    Awesome
  • L
    limon
    Recipe Rating:
    Chicken fry is an irresistible classic that never fails to delight the taste buds! Whether it's seasoned with aromatic spices, coated in a crispy batter, or marinated to perfection, there's something undeniably comforting about sinking your teeth into a juicy piece of fried chicken. Chicken fry is a culinary delight that never disappoints,
  • N
    Navya
    Amazing recipe… my husband loved it too yummy
  • S
    Sri Ramulu
    Recipe Rating:
    i like it
  • N
    Navya pala
    Recipe Rating:
    Mesmerizing recipe with perfect taste💓 simply loved it!
  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Amazing taste. I really love it. My daughter and son-in-law also voted it
  • P
    Prakyath arcot
    Recipe Rating:
    Wah! Jabardast recipe.😋
  • P
    Prakyath arcot
    Recipe Rating:
    Way! Jabardast recipe
  • S
    Sudhakar Reddy
    Recipe Rating:
    Super
Telangana Restaurant Style Chicken Fry | Chicken Roast