తెలంగాణా పెళ్లిళ్ళ స్పెషల్ రెడ్ చికెన్

Curries
5.0 AVERAGE
5 Comments

కొత్త రుచితో తృప్తిగా చికెన్ కర్రీ తినాలనుకుంటున్నారా? అయితే తెలంగాణా పెళ్ళిళ్ళ స్పెషల్ రెడ్ చికెన్ రెసిపీ పర్ఫెక్ట్. సూపర్ సింపుల్ రెడ్ చికెన్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజేస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

చికెన్ కర్రీ అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? అందులోనూ తెలంగాణా పెళ్ళిళ్ళ స్పెషల్ రెడ్ చికెన్ రెసిపీ రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలి అంటారు. మసాలాలు దట్టించి వేసి చేసే చికెన్ కర్రీల కంటే భిన్నంగా చిక్కని గ్రేవీతూ చాలా రుచిగా ఉంటుంది.

పెళ్లి భోజనం అంటేనే స్పెషల్, మరి స్పెషల్ భోజనాల్లో వడ్డించేవి కొత్తగా స్పెషల్గా ఉండాలి కాబట్టి తెలంగాణా కేటరర్స్ సృష్టించిన స్పెషల్ చికెన్ రెసిపీ ఈ రెడ్ చికెన్. స్పెషల్ అనగానే ఎంతో కష్టంగా ఉంటుంది అనుకోకండి, చాలా సులభం. కూర కోసం కావాల్సిన పదార్ధాలన్నీ వేసి కలిపి నిదానంగా ఉడికించడమే!

ఈ రెడ్ కర్రీ వీకెండ్స్లో లేదా గెస్ట్లు వచ్చినప్పుడు చాలా పర్ఫెక్ట్. రెడ్ చికెన్ బాగార రైస్ లేదా రుమాలీ రోటీ తో భలేగా ఉంటుంది.

టిప్స్

  1. చికెన్కి మసాలాలు బాగా పట్టించి కనీసం 2 గంటలు ఫ్రిజ్లో ఉంచితే ఫ్లేవర్స్ మసాలాలూ చికెన్లోపలి దాకా పట్టి రుచిగా ఉంటుంది చికెన్.

  2. ఈ కర్రీ రుచి అంతా చికెన్లో వేసిన పదార్ధాలతో ఉడకడంలోనే ఉంది. ఈ చికెన్ కర్రీ గ్రేవీ కాస్త చిక్కగా ఉంటుంది. మరీ చిక్కగా అనిపిస్తే కాసిని వేడి నీళ్ళు ఏ స్టేజ్లో అయినా కలుపుకోవచ్చు.

  3. రెడ్ చికెన్ అంటే రెడ్ కలర్తో ఆకర్షణీయంగా ఉండాలి కాబట్టి కొద్దిగా రెడ్ కలర్ వేశాను, నచ్చకుంటే వదిలేవచ్చు. కేటరింగ్ స్టైల్ అంటే అజీనమోటో కూడా వేస్తారు, నేను వేయలేదు. నచ్చితే వేసుకోండి

  4. చిరొంజీ పప్పు మాంచి ఫ్లేవర్నిస్తుంది, తప్పక వేయడానికి ప్రయత్నించండి

తెలంగాణా పెళ్లిళ్ళ స్పెషల్ రెడ్ చికెన్ - రెసిపీ వీడియో

Telangana wedding special Red Chicken | How to make Simple Chicken Curry

Curries | nonvegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Resting Time 2 hrs
  • Total Time 2 hrs 30 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 kilo చికెన్
  • ఉప్పు
  • 1.5 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • మసాలా పేస్ట్ కోసం
  • 10 బాదం పప్పు
  • 10 పిస్తా
  • 2 tsp చిరోమ్జీ పప్పు
  • 3 పచ్చిమిర్చి
  • 1/2 ఇంచ్ దాల్చిన చెక్క
  • 2 లవంగాలు
  • 4 యాలకలు
  • 1/2 tsp మిరియాలు
  • నీళ్ళు – మసాలా పేస్ట్ రుబ్బుకోడానికి
  • కూర కోసం
  • 3 tbsp నూనె
  • 2 tsp నెయ్యి
  • 1/3 cup పెరుగు
  • 1/2 cup వేపిన ఉల్లిపాయలు
  • 1/3 cup టొమాటో పేస్ట్
  • 1 tbsp టొమాటో కేట్చాప
  • 2 tbsp రెడ్ చిల్లీ సాస్
  • 1 tbsp గ్రీన్ చిల్లీ సాస్
  • 1 tsp షాహీ జీరా
  • 1 tsp ధనియాల పొడి
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 2 tsp కాశ్మీరీ కారం
  • 1.5 tbsp కారం
  • 1 కొత్తిమీర
  • 1 tbsp వెనిగర్
  • 2 చిటికెళ్లు రెడ్ ఫుడ్ కలర్
  • 2 tbsp ఫ్రెష్ క్రీమ్

విధానం

  1. చికెన్కి ఉప్పు అల్లం వెల్లులి ముద్దతో బాగా మర్ధనా చేసి పక్కనుంచుకోండి
  2. పాన్లో మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద వేపి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  3. అల్లం వెల్లులి ముద్ద కలుపుకున్న చికెన్లో మసాలా పేస్ట్ ఇంకా కూర కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి రుద్దుతూ పట్టించి ఫ్రిజ్లో 2 గంటలు ఉంచాలి
  4. పాన్లో నూనె నెయ్యి వేసి చేసి అందులో 2 గంటలు ఫ్రిజ్లో ఉంచిన చికెన్ వేసి బాగా కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి నూనె పైకి తేలేదాక ఉడికించుకోవాలి
  5. ప్రతీ 5 నిమిషాలకి ఒక సారి చికెన్ని కలుపుకోవాలి లేదంటే అడుగుపడుతుంది. 25 నిమిషాలకి చికెన్ ఉడికి నూనె పైకి తేలుతుంది అప్పుడు క్రీమ్ వేసి కలిపి దింపేసుకోవాలి.
  6. ఈ కర్రీ రోటీ, బాగారా అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • D
    Divya
    Tried most of your recepie’s. Learnt a lot during lockdown, our whole family’s go to YouTube channel for trying out new recepies
  • S
    Srinivas
    Very nice recipe
  • M
    Meghana Reddy
    Recipe Rating:
    Must Try Recipe! Because I have tried doing this!! It turned out so amazing! Not just because of giveaway I'm very shy to comment on anything!! Also thank you for the beautiful recipes.
  • K
    Kishan
    Video ingredients and website ingredients are different.. please check once
  • C
    Chandu
    Recipe Rating:
    I am very bad at cooking but followed directions here and made it for a party. It was rich, creamy and flavorful. I thought maybe less quantity of cashews and almonds would be good especially if you are making more quantity