ఆంధ్రా వెడ్డింగ్స్ స్టైల్ దొండకాయ 65

ఉల్లి వెల్లులి వేయకుండా సెనగపిండిలో ముంచిన దొండకాయ చీలికల్ని ఎర్రగా వేపి ఉప్పు కారం మసాలా పొడి వేసే చేసే స్పెషల్ రెసిపీ దొండకాయ 65. ఇది ఆంధ్రుల పెళ్లిళ్లలో, లేదా మరింకేదైనా ఫంక్షన్స్లో కేటరర్స్ మెనూలో తప్పక ఉండే రెసిపీ.

వేడిగా నెయ్యి వేసిన అన్నంతో లేదా పప్పు అన్నంతో, సాంబార్ అన్నంతో నంజుకుతినడానికి చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ పేరుకి 65 అని ఉంటుంది అంతే కానీ చేసే తీరు ఏది ఒరిజినల్ 65 రెసిపీ తీరులో ఉండదు. నిజానికి దీనికి దొండకాయ పకోడీ అని పేరు పర్ఫెక్ట్ కానీ ఇలా చేసే తీరుని కూడా దొండకాయ 65 అనే అంటారు తెలుగు వారు.

ఇదే దొండకాయ 65ని ఈ మధ్య కొన్ని సాసులు అజినొమొటో వేసి కూడా చేస్తున్నారు, నేను సింపుల్ తీరులో ఉల్లి వెల్లులి లేని దొండకాయ 65 రెసిపీ చేస్తున్నా!

Tindora 65 | Andhra weddings special Dondakaya 65

టిప్స్

దొండకాయ:

దొండకాయలు లేతవి అయితే రుచి చాలా బాగుంటుంది, ఇంకా త్వరగా వేగుతాయ్ ముక్కలు.

దొండకాయని నాలుగు సగాలుగా చీరుకోవాలి

దొండకాయ ముక్కలు నీళ్లలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు రాగాన తీసి జల్లెడలో వేసి వదిలేస్తే నీరు దిగిపోతుంది, త్వరగా ముక్కలు గాలికి ఆరతాయి

65 కరకరలాడుతూ ఉండాలంటే:

దొండకాయ ముక్కల పైన వేసే పిండి తడి పొడిగానే ఉండాలి, గట్టిగా ఉండాలి. నేరుగా బజ్జిల పిండి మాదిరి ఉండకూడదు. పిండిలా జారుగా అయితే దొండకాయ ముక్కలు పిండిని పట్టుకోదు నూనెలో వేయగానే పిండి విడిపోతుంది.

దొండకాయ ముక్కల్లో నీరు దాదాపుగా వేయనవసరం రాకపోవచ్చు. దాదాపుగా దొండకాయల్లో ఉండే నీరే సరిపోతుంది.

దొండకాయ ముక్కలు నూనెలో వేసిన తరువాత ముందు మీడియం ఫ్లేమ్ మీద వేగనిస్తే ముక్క లోపలి దాకా ఉడుకుతుంది, ఆ తరువాత హై ఫ్లేమ్ మీద వేపుకుంటే కరకరలాడుతూ ఉంటుంది 65

ఆంధ్రా వెడ్డింగ్స్ స్టైల్ దొండకాయ 65 - రెసిపీ వీడియో

Tindora 65 | Andhra weddings special Dondakaya 65

Wedding Style recipes | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 30 mins
  • Total Time 40 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Kg లేత దొండకాయలు (4 సగాలుగా చీరుకున్నవి)
  • నూనె - వేపుకోడానికి
  • 1/2 cup సెనగపిండి
  • 2 tbsp బియ్యం పిండి
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 1/4 tsp పసుపు
  • 2 inch అల్లం
  • 1 tsp జీలకర్ర
  • 7 - 8 పచ్చిమిర్చి
  • 1/4 cup వేరు సెనగ గుండ్లు
  • కరివేపాకు
  • 1/2 tsp వేయించిన జీలకర్ర పొడి
  • 3/4 tsp కారం
  • 1/2 tsp గరం మసాలా

విధానం

  1. నాలుగు సగాలుగా చీరుకున్న దొండకాయ ముక్కల్ని నీళ్లలో వేసి కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక పొంగు వచ్చే దాగా ఉడకనివ్వాలి.
  2. ఒక పొంగు రాగానే మగ్గిన దొండకాయ ముక్కలని తీసి జల్లెడలో వేసి గాలికి పూర్తిగా చల్లారనివ్వాలి.
  3. దొండకాయలు చల్లారేలోగా మిక్సీలో 8-10 పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోండి.
  4. చల్లారిన దొండకాయ ముక్కల్లో అల్లం పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, సెనగపిండి, బియ్యం పిండి వేసి ముక్కలని మెదపకుండా నెమ్మదిగా పిండి పట్టించండి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చిలకరించుకోండి (టిప్స్ చూడండి).
  5. మరిగే వేడి నూనెలో సగం దొండకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు మగ్గే దాకా వేపుకోండి అంటే 8-10 నిమిషాలు. (దొండకాయలు వేగడానికి సమయం పడుతుంది).
  6. ముక్కలు మగ్గి రంగు మారుతున్నప్పుడు హై ఫ్లేమ్ మీద కారకరలాడేట్టు వేపుకోండి.
  7. అదే నూనెలో వేరుశెనగ గుండ్లు, కరివేపాకు వేసి వేపి వేపుకున్న దొండకాయ ముక్కల్లో వేసుకోండి.
  8. వేగిన ముక్కల్లో ఉప్పు కారం జీలకర్ర పొడి గరం మసాలా వేసి టాస్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

22 comments

  • T
    Tejaswini
    Recipe Rating:
    I tried it and it was superb
  • S
    Sujitha
    Recipe Rating:
    Yummy
  • S
    Shaik nageena
    Recipe Rating:
    I tried this recipe and it came out well and my children loved this recipe a lot thank you
  • R
    Radhika
    We tried this recipe and it's too good
  • R
    Ramanaidu
    I tried, got the best taste.
  • U
    Usha
    I try this recipe it's very tasty. My family is happy to eat this recipe. I am feeling your youtube channel also. I prepared lots of recipes for watching your videos on YouTube. All recipes are very tasty and perfect 👌. thank you, sir
  • M
    Mourya
    Recipe Rating:
    Love with this recipe..eberytime i only did this with dondakaya annaya
  • P
    Pavani
    I tried this recipe. Taste is awesome. Everyone in my family enjoyed this snack
  • P
    Pavani
    I tried this recipe. Taste is awesome. Everyone in my family enjoyed this snack
  • B
    Bharath Kumar
    Chala bagundhi recipe Chaka baga ayindhi I love vismaifood.com
  • S
    Sravanthi vemula
    Must try
  • L
    Lokeswari
    I tried the recipe, it came out very well. And crunchy
  • S
    Sudharshan reddy
    Excellent Recipe
  • S
    Sravani venkatesh
    Loved it. Chala perfect ga vachindi sir e recipe. Miru chepinatlu ga ne chesanu
  • D
    Deepti Mikkili
    Superb recipe, Teja garu… Miru simple recipes ni kuda chala authentic cheptaru andi
  • R
    revathi
    its too good reciepie
  • A
    Anand
    Receipe try chesaaa.. But.. Fail aindii.. Ekkado endhi mistake aindhi..
  • V
    Vasanthi paruchuri
    Recipe Rating:
    I am trying this receipe sir super taste , good explanation sir
  • A
    Aneel kumar
    Recipe Rating:
    Waiting since so long for this recipe.... ❤❤❤
  • D
    Divya anusha
    Recipe Rating:
    I tried this recipe...it turned out perfect...my family members loved it
  • S
    Saiteja
    Recipe Rating:
    All recipes are amazing....
  • R
    Raja Pillutla
    Recipe Rating:
    Super recipe my favorite one thanks teja garu
Tindora 65 | Andhra weddings special Dondakaya 65