పెళ్ళిళ్ళ టొమాటో పప్పు

అన్నం రోటీ చపాతీలోకి కారంగా పుల్లగా ఉండే తెలుగు వారి స్పెషల్ టొమాటో పప్పుకి సారి మరో రెసిపీ ఉండదు. రోజూ ప్రతీ తెలుగు వారింట్లో చేసే టొమాటో పప్పు మరింత రుచిగా చేయాలంటే కింద స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది ఫాలో అవ్వండి.

దేశంలో ఇతర ప్రదేశాలలో చేసే తీరులో చేసేదే అయినా తెలుగు వారు చేసే టొమాటో పప్పు రుచి ఎంతో ప్రేత్యేకం. చాలా సింపుల్ రెసిపీ ఆమ్లెట్ లేదా బంగాళా దుంప, అరటికాయ వేపుడు బెస్ట్ కాంబినేషన్స్ టొమాటో పప్పుతో.

టొమాటో పప్పు రోజు ప్రతీ తెలుగిళ్ళలో చేసేదే అయినా కొన్ని చిట్టి మార్పులు చేర్పులు కూర్పులు పప్పుని ప్రేత్యేకంగా చేస్తాయ్. ఒక్క సారి టిప్స్ చూసి స్టెప్ ఫాలో అవ్వండి.

టిప్స్

  1. పప్పుని బాగా కడిగి గంట సేపు నానబెడితేనే పప్పు మెత్తగా ఉడుకుతుంది.

  2. పప్పులో వేసే టొమాటో ముక్కలు కాస్త పెద్దగా ఉండాలి. ఇంకా పూర్తిగా గుజ్జుగా అయ్యేదాక ఉడికించకూడదు. టొమాటో ఉడికి కంటికి పంటికి ఆనాలి అప్పుడు రుచి.

  3. పెళ్ళిళ్ళలో చేసే టొమాటో పప్పుకి అంత రుచి రావడానికి పప్పులో సాంబార్ పొడి ఇంకా ఆఖరున డాల్డాతో తాలింపు పెట్టడమే! నేను నెయ్యి నూనె కలిపి తాలింపు వేశాను.

  4. తాలింపు ఎర్రగా కరకరలాడేట్టు వేగితే పప్పు రుచి చాలా బాగుంటుంది

  5. నేను వెల్లులి వేయలేదు నచ్చితే వెల్లులి చిదిమి వేసుకోవచ్చు. పప్పు దింపే ముందు ఉప్పు సరి చూసి దింపుకోండి

పెళ్ళిళ్ళ టొమాటో పప్పు - రెసిపీ వీడియో

Tomato Dal | Tomato Pappu | Wedding Style Tomato Pappu | Andhra Tomato Dal

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • పప్పు ఉడికించుకోడానికి
  • 3/4 cup కందిపప్పు
  • 1/4 cup పచ్చి శెనగపప్పు
  • 1/4 tsp పసుపు
  • 1 tsp నూనె
  • 3 1/4 cup నీళ్ళు
  • టొమాటో ఉడికించుకోడానికి
  • 2 tsp నూనె
  • 1 ఉల్లిపాయ తరుగు
  • 3 కారంగల పచ్చిమిర్చి
  • ఉప్పు
  • 1.5 tbsp కారం
  • 200 gms టొమాటో ముక్కలు
  • 1.5 tbsp సాంబార్ పొడి
  • 3 tbsp చింతపండు పులుసు (ఉసిరికాయ అంత చింతపండు నుండి తీసినది)
  • 1/4 cup నీళ్ళు
  • తాలయింపు కోసం
  • 1 tbsp నూనె
  • 1 tsp నెయ్యి
  • 1 tsp ఆవాలు
  • 1.5 tbsp పచ్చి శెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 3 ఎండుమిర్చి
  • 1 tsp జీలకర్ర
  • 2 కరివేపాకు రెబ్బలు
  • 2 చిటికెళ్లు ఇంగువ

విధానం

  1. కుక్కర్లో నానిన కందిపప్పు, శెనగపప్పు నూనె పసుపు నీళ్ళు పోసి మూతపెట్టి 2 విసిల్స్ హై ఫ్లేమ్ మీద మూడు విసిల్స్ లో ఫ్లేమ్ మీద రానిచ్చి స్టీమ్ పోయేదాక వదిలేయాలి
  2. ఉడికిన పప్పుని మెత్తగా ఎనుపుకోవాలి
  3. నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడేదాక వేపుకోవాలి. సగం పైన వేగిన తరువాత పచ్చిమిర్చి, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి
  4. వేగిన ఉల్లిపాయాలో టొమాటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 3 నిమిషాలు ఉడకనివ్వాలి
  5. 3 నిమిషాల తరువాత సాంబార్ పొడి చింతపండు పులుసు పోసి బాగా కలిపి మూత పెట్టి టొమాటో పైన తోలు ఊడేదాకా ఉడికిస్తే చాలు
  6. ఎనుపుకున్న పప్పుని ఉడికిన టొమాటోలో పోసి అవసరమైతే కాసిని నీళ్ళు చేర్చి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు ఉడుకుపట్టనివ్వాలి. ఉడికిన పప్పుని దింపేసుకోవాలి
  7. తామలిపు కోసం నూనె నెయ్యి వేడి చేసి ఆవాలు వేసి చిటచిటలాడించి శెనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేగనిచ్చి తరువాత మిగిలిన సామగ్రీ అంత ఒక్కోటిగా వేసి ఎర్ర వేపుకోవాలి. తరువాత పప్పులో కలిపేసుకోవాలి
  8. ఆఖరుగా ఉప్పు సరిచూసి వేసుకోండి. ఈ టొమాటో పప్పు అన్నం చపాతీలలోకి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

18 comments