దొండకాయ పచ్చికొబ్బరి కారం
కొంచెం కారంగా నోటికి కమ్మగా ఉండే దొండకాయ పచ్చి కారం గుంటూరు స్పెషల్ రెసిపీ. దీన్నే దొండకాయ పచ్చి కొబ్బరి కారం అని కూడా అంటారు. ఎండు కారం, మాసాలు ఏవి వేయకుండా, ఎక్కువ తాలింపు గింజలు వేసి చేస్తారు.
రోజు చేసుకునే సింపుల్ ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈ సారి గుంటూరు స్పెషల్ దొండకాయ పచ్చి కొబ్బరి ట్రై చేసి చుడండి అందరికి నచ్చేస్తుంది.
ఈ దొండకాయ పచ్చికారం రెసిపీ ఆంధ్ర ప్రదేశ్లోని గుంటూరు ఇంకా ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చేసుకుంటారు.
సాధారణంగా గుంటూరు స్పెషల్ రెసిపీస్ అన్నీ కాస్తా కారంగా ఉంటాయి కానీ ఈ కూర కమ్మగా ఉంటుంది.
పచ్చి కొబ్బరి అల్లం పచ్చి మిర్చి పేస్ట్ వేసే చేసే దొండకాయ వేపుడు ఎప్పుడు చేసినా తృప్తినిచ్చే కూర అవుతుంది. వేడి అన్నం నెయ్యితో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

టిప్స్
దొండకాయ:
దొండకాయ లేతవి అయితే రుచి ఇంకా త్వరగా మగ్గిపోతాయ్. నేను చిన్న ముక్కలుగా కోశాను, మీకు నచ్చితే దొండకాయలని పొడవుగా కూడా కోసుకోవచ్చు.
ఈ కూరలో ఎండు కారం లేదు కేవలం పచ్చి మిర్చి కారమే వాడుకోవాలి.
ఇంకో తీరు:
నేను దొండకాయలని నూనెలో మగ్గించాను. మీకు సమయం లేదంటే దొండకాయ ముక్కలని కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్ళు పోసి ఒక్కే విజిల్ హాయ్ ఫ్లేమ్ మీద రానిచ్చి దింపేసి వేపుకున్న తాలింపులో ముక్కలు వేసి చెమ్మారనిచ్చి కొబ్బరి వేసి కూడా చేసుకోవచ్చు.
ఇంకా ఈ కాయ కూరలతో కూడా చేసుకోవచ్చు:
వంకాయ, గోరుచిక్కుడు,చిక్కుడు, ఫ్రెంచ్ బీన్స్ , కాప్సికం, చిక్కుడు కాయ, బీరకాయ, కేబేజ్, కాలీఫ్లవర్ తో కూడా ఇదే తీరులో చేసుకోవచ్చు.
కాలీఫ్లవర్ కెబాజ్ అయితే ముందు నీళ్లలో ఉడికించి నీటిని పూర్తిగా
ఇంకొన్ని టిప్స్:
ఈ కూర పచ్చికొబ్బరి ఉండటాన వేసవిలో సాయంత్రం దాకా నిల్వ ఉండదు. అందుకే కూర తినగా మిగిలినది ఫ్రిజ్లో పెట్టుకోండి.
దొండకాయ పచ్చికొబ్బరి కారం - రెసిపీ వీడియో
Tindora Raw Coconut Spice | Guntur Dondakaya Pachi kobbari Karam
Prep Time 5 mins
Cook Time 30 mins
Total Time 35 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
-
పచ్చికొబ్బరి కారం
- 1 inch అల్లం
- 6 - 7 పచ్చిమిర్చి
- 1 cup పచ్చి కొబ్బరి - సగం చిప్ప
-
వేపుడు కోసం
- 3 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tbsp మినపప్పు
- 1 tbsp సెనగపప్పు
- 2 ఎండుమిర్చి
- 1 tsp జీలకర్ర
- 2 కరివేపాకు - రెబ్బలు
- 1/2 Kilo దొండకాయ ముక్కలు
- ఉప్పు
- 2 tbsp కొత్తిమీర
విధానం
-
మిక్సీలో కొబ్బరి అల్లం పచ్చిమిర్చి వేసి నీళ్లు వేయకుండా కాస్త బరకగా పేస్ట్ చేసుకోండి
-
నూనె వేడి చేసి అందులో ఆవలు వేసి పొంగనిచ్చి ఆ తరువాత మినపప్పు సెనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి తాలింపు ని కచ్చితంగా మీడియూయం ఫ్లేమ్ మీద ఎర్రగా వేపుకోవాలి
-
ఎర్రగా వేగిన తాలింపులో తరుక్కున్న దొండకాయ ముక్కలు ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద మెత్తబడనివ్వాలి.
-
మధ్యమధ్యన కలుపుతూ ఉంటె సుమారుగా 20 నిమిషాలకి దొండకాయలు వేగి మెత్తబడ్డాయి. అప్పుడు గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పేస్ట్ వేసి కలిపి మూతపెట్టి 2-3 నిమిషాలు మగ్గనిచ్చి కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవాలి.
-
ఈ కూర నెయ్యి వేసిన అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×