తిరువదిరాయ్ కలి

కందిపప్పు పెసరపప్పుని వేపి బియ్యంతో కలిపి రవ్వగా చేసి బెల్లం పాకంలో దగ్గరగా ఉడికించే దాన్ని కలి అంటారు తమిళులు. ఈ కలి ప్రసాదం తమిళనాడు చిదంబర ఆలయంలో నటరాజ స్వామికి కామ సుందరి అమ్మకి ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం నాడు ఇంకా పూర్ణిమకి ప్రేత్యేకంగా నివేదన చేస్తారు.

తిరువాదిరై అంటే తమిళంలో ఆరుద్రా నక్షత్రం. ఈ నక్షత్రం మహా శివుని నక్షత్రం. ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం నాడు పార్వతిదేవి కఠోర తపస్సు చేత పరమశివుడిని భర్తగా పొంగలిగింది. అందుకే ధనుర్మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రం రోజున చిదంరంలోని నటరాజుకి కామసుందరికి వివాహం చేసి ఈ కలి ప్రసాదాన్ని నివేదిస్తారు. అందుకే ఈ ప్రసాదం తిరువాదిరై కలి అయ్యింది.

కమ్మని నెయ్య బెల్లం పాకంలో వండిన పప్పు అన్నం చాలా సులభంగా అయిపోయే కమ్మని ప్రసాదం. ఈ ప్రసాదం మీరు ఏ పండుగకైనా చేసుకోగలిగేలా ఉంటుంది. కలి ప్రసాదం తమిళనాడులో దాదాపుగా అందరికీ తెలుసు ఎంతో ఇష్టంగా పండుగలకు చేసుకుంటుంటారు.

కలి ప్రసాదం చేయడానికి కొన్ని కచ్చితమైన కొలతలు ఉన్నాయ్ అవన్నీ వివరంగా కింద టిప్స్లో ఉన్నాయ్ చుడండి.

టిప్స్

కందిపప్పు & పెసరపప్పు :

పప్పు సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి అప్పుడే మంచి సువాసన.

పప్పులు రెండూ కలిపి తీసుకున్న బియ్యంలో సగం ఉండాలి.

పాకం:

బెల్లం పాకం లేత జిగురు పాకం ఉండాలి అప్పుడే ఉడికిన అన్నం పాకం పీల్చుకుంటుంది, లేదా గట్టిగా అయిపోతుంది.

ప్రసాదం రుచిగా రావాలంటే:

ప్రసాదం చూడ్డానికి అన్నం ఉడికంచి పాకంలో కలిపేయడం లాగానే ఉంటుంది. కానీ ప్రసాదం నెమ్మదిగా కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ దగ్గరగా నిదానంగా అడుగుపెట్టకుండా కలుపుతుంటేనే మాంచి ఎర్రటి రంగులోకి వస్తుంది. చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉంటుంది.

సరైన కొలతలు:

ఈ కలి ప్రసాదానికి బియ్యం, పచ్చికొబ్బరి తురుము, నెయ్యి సమానం ఉండాలి. బెల్లం బియ్యం పప్పుకి కలిపిన దానికి రెండింతలు ఉండాలి.

తిరువదిరాయ్ కలి - రెసిపీ వీడియో

Tiruvadirai kali | Chidambaram Temple Special Prasadam

Prasadam | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 30 mins
  • Total Time 35 mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup బియ్యం
  • 1/4 cup పెసరపప్పు
  • 1/4 cup కందిపప్పు
  • 1 cup పచ్చికొబ్బరి తురుము
  • 3 cups బెల్లం
  • 1 cup నెయ్యి
  • 1/2 tsp యాలకలు పొడి
  • 2 pinches జాజికాయ పొడి
  • 15 జీడిపప్పు
  • 15 కిస్మిస్
  • 5 cups నీళ్లు

విధానం

  1. కందిపప్పు పెసరపప్పు వేసి మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
  2. వేపుకున్న పప్పు బియ్యం కలిపి మిక్సీలో వేసి గోధుమ రవ్వ అంత సన్నని రవ్వగా గ్రైండ్ చేసుకోండి.
  3. కుక్కర్లో 2 tbsp నెయ్యి కరిగించి అందులో రవ్వ వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి.
  4. రవ్వ రంగు మారాక పావు కప్పు పచ్చికొబ్బరి తురుము వేసి ఒక నిమిషం వేపి మూడు కప్పుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్ మీద మెత్తగా ఉడికించుకోండి.
  5. బెల్లంలో మిగిలిన రెండు కప్పుల నీళ్లు పోసి లేత జిగురు పాకం వచ్చేదాకా మరిగించాలి.
  6. మరుగుతున్న లేత పాకంలో మెత్తగా వండుకున్న పప్పు అన్నం వేసి గడ్డలు లేకుండా మెదుపుకోవాలి.
  7. పాకంలో అన్నం కలిసి పోయిన తరువాత మరో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి జాజికాయ పొడి యాలకుల పొడి వేసి మరో 3-4 నిమిషాలు అడుగుపెట్టకుండా మధ్య మధ్యన కలుపుతూ ఉడికించండి.
  8. కలిలోంచి నెయ్యి పైకి తేలుతున్నప్పుడు మిగిలిన కొబ్బరి తురుము అంతా వేసి మరో 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.
  9. మిగిలిన నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేసి పొంగనిచ్చి కలిలో కలిపేసుకోవడమే. ఈ ప్రసాదం వేడిగా చల్లగా ఎలా తీసుకున్నా చాలా రుచిగా ఉంటుంది. కానీ నెయ్యి తగ్గితే జిగురుగా ఉంటుంది చేతులకి అంటుకుని.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

13 comments

  • A
    Akash Verma
    Recipe Rating:
    Very sweetest and tastiest dish I have ever tried
  • R
    Radhika
    Recipe Rating:
    Tried this recipe it's amazing as always but we also have a similar dish among patnaik community called Jonthini we specifically make it for poleram amavasya or Mahalaya amavasya the only difference is we don't add dals
  • D
    Durga reddy
    Thank you
  • S
    Shravya
    Meeru ilanti recipes kanukoni pedtuntaru. This makes you unique.
  • G
    Gade Babu
    Recipe Rating:
    Wow
  • A
    Ahmed Alisha
    Recipe Rating:
    Excellent
  • K
    Konijeti kavya sri
    Favoo🤩
  • B
    Bhagyasri
    Hi teja garu me recipes nenu Chala try chesanu . Dassara ki e kali prasadam chesanu Chala bhagundhi thankq so much
  • V
    Vainu
    This is my recent favourite recipe in recent times I loved the taste and good option for prasadams 💯🙏
  • S
    Sunny
    Edhi naku baga nachindhi fantastic ga undhi i triad this itam 🥳i like it
  • D
    Dhanush
    This very fantastic food i like it
  • M
    Malliswari Koppisetti
    Hello foodies, prasadham chala bagundhi
  • N
    Naga Ganesh Kadajarapu
    Recipe Rating:
    so delicious, I tried this item