బెండకాయ టమాటో ముక్కల్లో వేపిన సెనగగుళ్ళు నువ్వులు చింతపండు పులుసు పోసి చేసే హైదరాబాదీ స్పెషల్ బెండకాయ టమాటో సలాన్ రెసిపీ పెళ్ళిళ్ళకి లేదా స్పెషల్ అకేషన్కి ముందుంటుంది హైదరాబాద్లో.

సాలన్లు హైదరాబాద్ నిజాముల వంటకాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అందరికీ బాగా తెల్సిన రెసిపీ బాగారా బైంగన్. ఇది హైదరాబాద్ స్పెషల్ రెసిపీ. హైద్రాబాద్లో ఏ రెస్టారెంట్కి వెళ్లినా తెలంగాణా ఏ పెళ్ళికి వెళ్లిన మీకు తప్పక కనిపించే రెసిపీ బాగారా బైంగన్. ఈ చిక్కని బెండకాయ టమాటో సాలన్ కూడా బాగారా బైంగన్ మాదిరే. వేసే కూరగాయలు మార్పుతోనే సాలన్ రుచి మారుతుంది.

ఈ పుల్లని చిక్కని ఘాటైన సాలాన్ అన్నం రుమాలీ రోటీలతో చాలా రుచిగా ఉంటుంది. ఈ సాలన్లు ఎక్కువగా హైదరాబద్ ముస్లిమ్స్ చేస్తారు. ఈ టేస్టీ రెసిపీకి కొన్ని చిట్టి చిట్కాలు!!!

Tomato Bhindi Salan | Hyderabad Special Bendakaya Tomato Salan

టిప్స్

బెండకాయ:

లేతవి కనీసం 2 అంగుళాల పొడవు ఉండాలి బెండకాయ ముక్కలు. బెండకాయ ముక్కలు నూనెలో ఎర్రగా వేగితే జిగురు తగ్గుతుంది

మసాలా పేస్ట్ కోసం:

  1. మసాలా పేస్ట్ కోసం వేపే పదార్ధాలన్నీ సన్నని సెగ మీద వేపితే పప్పు లోపలిదాకా వేగుతుంది అప్పుడు రుచిగా ఉంటుంది పేస్ట్

  2. మసాలా పేస్ట్ సన్నని రవ్వ మాదిరి నీళ్లతో గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తని పేస్ట్ చేయకండి

కలోంజీ:

సంప్రదాయ హైదరాబాదీ సాలన్లో 2 చిటికెళ్ల కలోంజీ వేస్తారు. కలోంజీ ప్రేత్యేకమైన పరిమళం ఇస్తుంది సాలన్కి . కలోంజీ ఉంటె వేసుకోండి లేదంటే వదిలేయండి.

గసగసాలు:

కొన్ని ప్రాంతాల్లో గసగసాలు వాడకం నిషేధం. కాబట్టి గసాలు లేని వారు వదిలేయండి.

నూనె:

సాలన్లకి నూనె పైకి తేలాలి అంటారు నిజానికి. నెను ఒక మోస్తరుగా నూనె వాడాను. మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు.

బెల్లం:

వేసే ఆ కొద్దీ బెల్లం సాలన్లోని ఫ్లేవర్స్ని బ్యూటిఫుల్గా బాలన్స్ చేస్తుంది.

బెండకాయ టమాటో సాలన్ - రెసిపీ వీడియో

Tomato Bhindi Salan | Hyderabad Special Bendakaya Tomato Salan | Okra Tomato Curry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 40 mins
  • Total Time 45 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • సాలన్ పేస్ట్ కోసం
  • 1/4 cup వేరు సెనగగుళ్ళు
  • 1/4 cup ఎండు కొబ్బరి
  • 7 - 8 ఎండు మిర్చి
  • 1 tbsp ధనియాలు
  • 1/4 tsp నువ్వులు
  • 1 tsp జీలకర్ర
  • 1/2 tsp గసగసాలు
  • సాలన్ కోసం
  • 1/4 cup నూనె
  • 1/2 tsp ఆవాలు
  • 3 ఎండు మిర్చి
  • 1/4 tsp మెంతులు
  • 2 చిటికెళ్ళు కలోంజీ
  • 1/2 tsp జీలకర్ర
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 150 gms బెండకాయ ముక్కలు 2 ఇంచులు
  • 3 టమాటో ముక్కలు
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 cup చింతపండు పులుసు (75 gm చింతపండు నుండి తీసినది)
  • 800 - 1000 ml నీళ్లు
  • 1 tsp బెల్లం

విధానం

  1. మూకుడులో సాలన్ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి.
  2. వేపుకున్న పదార్ధాలన్నీ నీళ్లతో సన్నని రవ్వలా పేస్ట్ చేసుకోవాలి.
  3. అదే మూకుడులో నూనె వేడి చేసి అందులో బెండకాయ ముక్కలు వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి.
  4. తరువాత టమాటో ముక్కలు వేసి టొమాటోలు పైన తోలు తీసుకోవాలి. మరీ మెత్తగా పేస్ట్ అయ్యేదాకా వేపకూడదు.
  5. మిగిలిన నూనె లో ఆవాలు మెంతులు కలోంజీ జీలకర్ర కరివేపాకు ఎండు మిర్చి వేసి వేపుకోవాలి.
  6. వేగిన తాలింపులో ఉల్లిపాయ సన్నని తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడి దాకా వేపుకోవాలి.
  7. ఉల్లిపాయ మెత్తబడ్డాక ఉప్పు పసుపు అల్లం వెల్లులి ముద్ద వేసి ఉల్లిపాయ ఎర్రబడే దాకా వేపాలి.
  8. వేగిన ఉల్లిలో సాలన్ పేస్ట్, చింతపండు పులుసు పోసి 3-4 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
  9. మరుగుతున్న పులుసులో నీళ్లు పోసి 20 నిమిషాలు వదిలేయాలి. 20 నిమిషాల తరువాత వేపిన బెండకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి 10 నిమిషాలు లేదా నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి.
  10. దింపే ముందు బెల్లం వేసి కలిపి దింపేసుకోవాలి. ఈ భిండీ టమాటో సాలన్ వేడిగా అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Tomato Bhindi Salan | Hyderabad Special Bendakaya Tomato Salan