బ్యాచిలర్స్ టమాటో ఎగ్ డ్రాప్ కర్రీ | ఎగ్ టమాటో పులుసు

పలుచని టమాటో ఉల్లిపాయ పులుసులో కోడిగుడ్డు పోగలగొట్టి వేసే సింపుల్ కర్రీ అన్నం ఉడికేలోపు తయారైపోతుంది, ఎప్పుడు చేసినా సూపర్ హిట్ అయిపోతుంది.

ఇంట్లో కోడిగుడ్డు ఉంటె చాలు ఏ కాయకూరలు ఉన్నా లేకున్నా తృప్తిగా భోజనం చేసేయొచ్చు. కోడిగుడ్డు కూరలు ఎన్నో ఉన్నాయ్, సమపాళ్లలో వెయ్యాల్సినవి వేసి చేస్తే మరింకే కూర అవసరం లేదు తృప్తిగా భోజనం చేయడానికి.

ఈ సింపుల్ టమాటో కోడి గుడ్డు కర్రీ బ్యాచిలర్స్కి, ఉద్యోగస్థులకి బాగా ఉపయోగపడుతుంది, ఎందుకంటె ఈ కూర తయారవ్వడానికి పట్టేది కేవలం 15 నిమిషాలే కాబట్టి.

ఎప్పుడు చేసినా గొప్ప రుచిగల టమాటో గుడ్డు పులుసు కోసం కింద ఉన్న టిప్స్ ఎంతో ఉపయోగపడతాయి!

Tomato Egg Drop Curry | Easy Tomato Egg Pulusu

టిప్స్

గుడ్డు:

  1. ఈ కర్రీలో గుడ్డు మరిగే పులుసులో పగలకొట్టి వేసి వదిలేయాలి, 10 నిమిషాల లోపు గుడ్డు చక్కగా ఉడికిపోతుంది, గుడ్డుకీ ఉప్పు కారం మసాలా బాగా పట్టి ఎంతో రుచిగా ఉంటుంది.

  2. గుడ్డు ఆలా మరిగే గ్రేవీలో వేస్తే ఎలాంటి వాసనా రాదు, గుడ్డు లోపలి దాకా ఉడికి ఇంకా రుచిగా ఉంటుంది, కూడా.

  3. గుడ్డు పులుసు బాగా కుతకుత ఉడుకుతున్నప్పుడు మూకుడు అన్ని వైపులా వేసుకోవాలి. బాగా ఉడుకుతున్నపుడు వేస్తేనే గుడ్డు వేసిన చోటే ఉంటుంది.

టమాటో:

ఈ కూరకి టమాటో బాగా పండినవి పుల్లనివి అయితే చాలా రుచి. టమాటోలు అస్సలు పుల్లగా లేవంటే 2 రెబ్బల చింతపండు వేసుకోవచ్చు.

ఇంకొన్ని టిప్స్:

ఈ ఎగ్ కర్రీకి ఒక ఉల్లిపాయకి 4 టమాటోలు 4 గుడ్లు ఉండాలి. ఏ కొలతకి చేసినా ఇదే తీరులో పెంచుకోవడమే!

బ్యాచిలర్స్ టమాటో ఎగ్ డ్రాప్ కర్రీ | ఎగ్ టమాటో పులుసు - రెసిపీ వీడియో

Tomato Egg Drop Curry | Easy Tomato Egg Pulusu

Bachelors Recipes | nonvegetarian|eggetarian
  • Prep Time 2 mins
  • Cook Time 15 mins
  • Total Time 17 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 3 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 ఉల్లిపాయ తరుగు
  • 4 టమాటోలు
  • 1/4 tsp పసుపు
  • ఉప్పు
  • 3 పచ్చిమిర్చి - చీరినవి
  • 1 tsp అల్లం వెల్లులి ముద్ద
  • 1 రెబ్బ కరివేపాకు
  • 1 tbsp ధనియాల పొడి
  • 1.5 tsp కారం
  • 4 గుడ్లు
  • 1/2 liter నీరు
  • 1/2 tsp మిరియాల పొడి
  • 2 tbsp కొత్తిమీర తరుగు

విధానం

  1. నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. చిట్లిన ఆవాల్లో ఉల్లిపాయ సన్నని తరుగు ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయని మెత్తబడనివ్వాలి.
  2. ఉల్లిపాయ మెత్తబడి పింక్ రంగులోకి మారిన తరువాత టమాటో ముక్కలు పచ్చిమిర్చి చీలికలు, ఉప్పు, టమాటో మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా మగ్గనివ్వాలి.
  3. మెత్తగా మగ్గిపోయిన టమాటో గుజ్జులో ధనియాల పొడి కారం వేసి మరో నిమిషం వేగనివ్వాలి.
  4. వేగిన టమాటో గుజ్జులో అర లీటర్ నీళ్లు పోసి హైఫ్లేమ్ మీద బాగా మరగనివ్వాలి.
  5. తెర్లుతున్న గ్రేవీలో 4 గుడ్లు పగలకొట్టి మూకుడు అంతా వేసుకోండి. గరిట పెట్టి కదపకుండా వదిలేయండి.
  6. గుడ్డు వేసిన తరువాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి 10 నిమిషాలు వదిలేస్తే గుడ్డు పర్ఫెక్టుగా ఉడికిపోతుంది.
  7. దింపే ముందు మిరియాల పొడి కొత్తిమీర తరుగు వేసి గుడ్డు చిదరకుండా నెమ్మదిగా కలిపి దింపేసుకోండి. ఈ కర్రీ వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

  • R
    Raja
    Recipe Rating:
    Super taste vachindhi bro, thank you so much
  • L
    Lulu
    Recipe Rating:
    I think you should put some chopped coriander also because it's give some more taste but be honest I try this recipe it so much good 10/10 I love it ..u should also try guys
  • S
    Sai
    It's superb I have tried TQ bross
  • S
    Srikanth
    Good recipe Brother what about Ginger garlic paste not mentioned in method
  • J
    Jahnavi Naidu
    Recipe Rating:
    Tq vismai food 🍅 Egg is my most favorite curry I just loved it thanks a ton
Tomato Egg Drop Curry | Easy Tomato Egg Pulusu