వాంగీ బాత్ మసాలా

Curries
4.3 AVERAGE
6 Comments

వాంగీ అంటే వంకాయ అని అర్ధం, బాత్ అంటే కలగలపు. కర్ణాటక ఫేమస్ వాంగీ బాత్ రైస్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఘుమఘుమలాడిపోతూ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్ కూడా. వాంగీ బాత్ కూర కోసం చేసే పొడి వారం రోజులో ఫ్రెష్ గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వంకాయలు వేపండి ఈ పొడి చల్లుకోండి కూర తయార్!!

ఈ కూర నేను ఏదో ప్రేత్యేకమైన కూర అని చెప్పను. సహజంగా వాంగీ బాత్ కోసం చేసిన మసాలా అన్నం కి పట్టిస్తారు, నేను వంకాయకి పట్టించాను అంతే. అసలే తెలుగు వాడిని ఇంకా చెప్పాలా వంకాయ గోంగూర అంటే ప్రాణం. అందుకే ఎప్పుడు ఏ కొత్త ఫ్లేవర్ దొరికినా వంకాయతో అయితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది. అలా వాంగీ బాత్ చేయగా మిగిలిన పొడినే వాడి కూర చేశా అందుకే వాంగీ బాత్ కర్రీ అయ్యింది.

Vangi Bath Curry | Vaangi Baath Fry | Brinjal Fry Recipe

టిప్స్

వంకాయ:

ఈ కూరకి నీలం రంగు పొడవు లేదా తెల్లవి పొడుగుగా ఉండే లేత వంకాయలు చాలా రుచిగా ఉంటాయ్.

నెయ్యి:

కావాలంటే నూనె కూడా వాడుకోవచ్చు. నెయ్యి వేస్తే పొడి రుచి చాలా బాగుంటుంది

పొడి:

మసాలా పొడి నిదానంగా సన్నని మంట మీద వేపితే మసలాలు లోపలి దాకా వేగి మాంచి సువాసనతో ఉంటుంది పొడి. గాలి పోనీ డబ్బాలో ఉంచితే కనీసం వారం రోజులు తాజాగా ఉంటుంది. ఆ తరువాత కూడా వాడుకోవచ్చు కానీ, తాజాదనం తగ్గుతుంది.

Vangi Bath Curry | Vaangi Baath Fry | Brinjal Fry Recipe

వాంగీ బాత్ మసాలా - రెసిపీ వీడియో

Vangi Bath Curry | Vaangi Baath Fry | Brinjal Fry Recipe

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms పొడవు వంకాయలు
  • 3 tbsps నూనె
  • 1 spring కరివేపాకు
  • 1/2 spoon పసుపు
  • 2 tsps నెయ్యి
  • 50 ml చింతపండు పులుసు
  • ఉప్పు
  • For Vaangi Bath Masala
  • 1 tsp నెయ్యి
  • 1 tbsp పచ్చి సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp ధనియాలు
  • 2 tsps ఎండు కొబ్బరి
  • 1 tbsp గసగసాలు
  • 1/2 ఇంచ్ దాల్చిన చెక్క
  • 4 లవంగాలు
  • 6 ఎండు మిర్చి
  • 1 కరివేపాకు రెబ్బ
  • 1 tsp బెల్లం

విధానం

  1. మసాలా కోసం ముందుగా నెయ్యి కరిగించి అందులో మినపప్పు సెనగపప్పు వేసి బాగా ఎర్రగా కలుపుతూ వేపుకోవాలి.
  2. కాస్త రంగు మారుతుండగా మిగిలిన సామానంతా వేసి లో-ఫ్లేం మీద మాత్రమే కలుపుతూ ఎర్రగా మాంచి రంగు సువాసన వచ్చేదాకా వేపుకుని దింపి చలార్చుకుని బెల్లం కూడా వేసి మిక్సీ లో వేసి మెత్తని పొడి చేసుకోండి.
  3. నూనె వేడి చేసి అందులో కరివేపాకు వేసి వేపుకుని, వంకాయ ముక్కలు, పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి ముక్కలని బాగా మగ్గనివ్వండి మీడియం ఫ్లేం మీద.
  4. ముక్కలు మగ్గాక చింతపండు పులుసు, ఉప్పు వేసి ముక్కలు పులుసు పీల్చుకునే దాక మూత పెట్టి మగ్గించుకోండి.
  5. ముక్కులు పులుసు పీల్చుకున్నాక అప్పుడు పొడి వేసి బాగా పట్టించి మరో 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి.
  6. దింపే ముందు 2 tsps నెయ్యి వేసి కలుపుకుని దిమ్పెసుకోండి.
  7. ఇది వేడి వేడి నెయ్యన్నం తో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

6 comments

  • S
    Swetha Talluri
    Very tasty. Thank you
  • R
    Rajarao Vadrevu
    Recipe Rating:
    Thanks for the recipe..
  • P
    Prasuna Uppalapati
    Hello sir, Namaste andi Bellam,I mean sweet istam lekha pothe avoid cheyocha , bagane untunda.please cheppandi.koncham karamga spicy ga kawalante kura .
  • H
    Harshini Dasari
    your recipes are very nice. don't the dish smell of iron...if you use tamarind juice in that utensil ( cast iron)? i face this problem.
  • K
    Kanamaralapudi Kalyani
    Recipe Rating:
    Very nice
  • L
    Latha
    Recipe Rating:
    Hi I am Latha from Bangalore. Your recipes r too good. Vangibath is not a curry it is to be mixed with rice and had like lemon rice, pulivogare etc
Vangi Bath Curry | Vaangi Baath Fry | Brinjal Fry Recipe