వంకాయ మునక్కాడ పులుసు | వంకాయ మునక్కాడ కర్రీ రెసిపీ

వంకాయ మునక్కాడ పులుసు చిక్కని కమ్మని పులుసు ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. వంకాయతో ఎప్పుడు చేసే వేపుడు కూర కాకుండా ఇలా పులుసు చేసి చుడండి సూపర్ హిట్ అంతే చేసిన ప్రతీ సారి.

ఈ వంకాయ మునక్కాడ పులుసు వేడి నెయ్యి అన్నంతో మరింత రుచిగా అనిపిస్తుంది.

చింతపండు లేదా పుల్లని పదార్ధాలు వాడి పలుచగా జారుగా చేసే దాన్ని పులుసు అంటారు. అలాంటి పులుసులు దక్షిణాది వారికి లెక్క లేనన్ని. అందుకే దాదాపుగా ప్రతీ కాయ కూరల తో పులుసులు తింటుంటారు.

ఈ వంకాయ మునక్కాడ పులుసు కూడా దాదాపుగా అన్ని పులుసులు మాదిరే కానీ కొంచెం భిన్నంగా ఉంటుంది, ఆ భిన్నత్వం ఇంకా వంకాయ మునక్కాయ కలియక సరికొత్త రుచినిస్తుంది. మరిన్ని వివరాల కోసం కింద టిప్స్ చుడండి.

టిప్స్

వంకాయ:

• సాధారణంగా పులుసులకి ముళ్ల వంకాయలు అంటే నీలం తెలుపు కలగలుపుగా ఉండే లేత గుత్తి వంకాయలు మరింత రుచిగా ఉంటాయి. తెల్ల లేదా ముదురు నీలం రంగు వంకాయలు కాస్త వగరుగా ఉంటాయి. ముళ్ళ వంకాయలు దొరకనప్పుడు తెలుపో నలుపో ఏదో ఒక వంకాయ వాడుకోండి. లేదా నీలం రంగు పొడవు వంకాయలు వాడుకోండి.

• నేను నీలం తెలుపు కలగలుపుగా ఉండే ముళ్ల వంకాయలని వాడుతున్నాను. వంకాయలని 4 భాగాలుగా చీరి ఉప్పు నీటిలో వేసి ఉంచితే రంగు మారవు.

మునక్కాయ:

నార తీసిన ముక్కాయ ముక్కలు కూడా కడిగి నీళ్లలో వేసి ఉంచుకోండి

పులుసు:

పులుసు నిదానంగా మరగాలి అప్పుడు పులుసులో సారమంతా ముక్కలల్కి పట్టి రుచిగా ఉంటుంది.

కొబ్బరి:

నేను కొంచెం పచ్చి కొబ్బరి వేశాను దీని వలన పులుసుకి కమ్మదనం వస్తుంది

బెల్లం:

పులుసులో ఆఖరున వేసే బెల్లం పులుసులో ఉప్పు పులుపు కారాన్ని చక్కగా బేలన్స్ చేస్తుంది.

వంకాయ మునక్కాడ పులుసు | వంకాయ మునక్కాడ కర్రీ రెసిపీ - రెసిపీ వీడియో

Vankaya Munakkaya Pulusu | Brinjal Drumstick Curry Recipe | Vismai Food

Curries | vegetarian
  • Prep Time 4 mins
  • Cook Time 30 mins
  • Total Time 34 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 6 - 7 వంకాయలు
  • 12 - 15 మునక్కాయ ముక్కలు
  • 6 tbsp నూనె
  • 1 tbsp ధనియాలు
  • 1/2 tsp మిరియాలు
  • 1 tsp జీలకర్ర
  • 8 - 10 ఎండుమిర్చి
  • 1/4 Cup పచ్చికొబ్బరి
  • 1 tbsp వేపిన సెనగపప్పు (పుట్నాల పప్పు )
  • 3 టమాటోలు
  • పులుసు కోసం
  • 2 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1/8 tsp మెంతులు
  • 1/2 tsp జీలకర్ర
  • 1/8 tsp ఇంగువ
  • కరివేపాకు - 3 రెబ్బలు
  • 10 - 12 Cloves వెల్లులి
  • 2 ఎండుమిర్చి ముక్కలు
  • 1 tsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1 cup ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1 tsp కారం
  • 1/2 tsp పసుపు
  • 3/4 cup చింతపండు పులుసు (( 35 గ్రాముల నుండి తీసినది))
  • 1/2 Litre నీరు
  • కొత్తిమీర తరుగు - చిన్న కట్ట
  • 1 tbsp నెయ్యి

విధానం

  1. నూనె వేడి చేసి నీటిని పిండిన మునక్కాయ ముక్కలు, గాట్లు పెట్టుకున్న వంకాయలు కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి 8-10 నిమిషాలు మగ్గించుకోండి.
  2. మగ్గిన వంకాయలని, మునక్కాయలని తీసి పక్కనుంచుకొండి.
  3. మిగిలిన నూనెలో, ధనియాలు మిరియాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి వేపుకోండి. తరువాత పచ్చికొబ్బరి, పుట్నాల పప్పు వేసి వేపుకోండి.
  4. కొబ్బరి వేగిన తరువాత టమాటో ముక్కలు వేసి మెత్తబడనిచ్చి తీసి మిక్సీ జార్లో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  5. రెండు tbsp నూనె వేడి చేసి అందులో ఆవాలు, మెంతులు వేసి వేపుకోండి. తరువాత ఇంగువ, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి ముక్కలు వేసి వేపుకోండి.
  6. వేగిన తాలింపులో, ఉల్లిపాయ తరుగు, రెండు చీరిన పచ్చిమిర్చి, ఉప్పు వేసి, ఉల్లిపాయ మెత్తబడేదాకా మూతపెట్టి మగ్గించుకోండి.
  7. ఉల్లిపాయ రంగు మారిన తరువాత, అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి. ఆ ఆతరువాత కారం పసుపు కొద్దిగా నీరు వేసి వేపుకోండి.
  8. కారాలు వేగిన తరువాత, గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్, కొద్దిగా నీరు వేసి కలుపుకోండి. ఆ తరువాత వేపుకున్న వంకాయ మునక్కాయ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి 17-20 నిమిషాలు ఉడికించుకోవాలి.
  9. వంకాయ మెత్తబడిన తరువాత చింతపండు పులుసు, బెల్లం కొత్తిమీర వేసి కలిపి 2-3 పొంగులు రానివ్వాలి.
  10. ఆఖరుగా నెయ్యి, ఇంకొంచెం కొత్తిమీర వేసి కలిపి దింపేసి వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.