నేతిలో ఎర్రగా వేపిన సేమియా రవ్వలో కొన్ని కాయకూర ముక్కలు మటన్ మసాలా లేదా గరం మసాలా వేసి ఉడికించే సేమియా ఉప్మానే తమిళనాడులో సేమియా కిచడి లేదా సేమియా కిచిడి అని అంటారు.

అందరికి తెలిసిన సేమియా ఉప్మా మాదిరే ఈ సేమియా కిచిడీ కూడా. కానీ రుచి సువాసన భిన్నంగా ఉంటుంది. పొద్దున్నే టిఫిన్కి లేదా సాయంత్రాలు స్నాక్గా, లేదా త్వరగా అయిపోయే లంచ్ బాక్సుల రెసిపీ కావాలనునప్పుడు పర్ఫెక్ట్.

తమిళనాడు సింపుల్ సేమియా కిచడిలో ఆఖరున వేసే మతం మసాలా పొడి, పుదీనా తరుగు రెసిపీకి సరికొత్తగా రుచిని సువాసనని ఇస్తుంది. సేమియా కిచడి మీకు మద్రాస్లో ఏ టిఫిన్ సెంటర్కి వెళ్లినా దొరుకుతుంది. ఈ మధ్య మధ్యాన్నం వెరైటీ రైస్తో పాటు సేమియా కిచడి కూడా సర్వ్ చేస్తున్నారు.

వేడిగా సేమియా కిచడి పైన కాసింత నిమ్మరసం పిండుకుని కారం పొడి లేదా ఏదైనా ఊరగాయ నిమ్మకాయ పచ్చడితో చాలా రుచిగా ఉంటుంది.

Vermicelli upma | Semiya Rava Kichidi | Semiya Upma

టిప్స్

సేమియా:

సేమియాని నేతిలో నెమ్మదిగా విరగకుండా లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. మరీ ఎక్కువగా కలిపిస్తే కిచిడి తయారయ్యే పాటికి పేస్ట్లా అయిపోతుంది.

ఇంకొన్ని టిప్స్:

  1. కలర్ కావాలనుకుంటే పసుపు వేసుకోవచ్చు. నేను వేయలేదు.

  2. ఇక్కడ సేమియాకి బదులు కేవలం రవ్వని వేపి ఇదే తీరులో కప్పుకి మూడు కప్పులు నీళ్లు పోసి కూడా చేసుకోవచ్చు.

  3. నేను ఫ్రోజెన్ బటాణీ వాడాను, మీరు తాజా బటాణీ వాడుకోదలిస్తే ఉల్లిపాయ వేగేప్పుడే వేసి వేపుకోవాలి.

  4. ఫ్లేవర్ కోసం ఆఖరున నేను రెడీమేడ్గా దొరికే మటన్ మసాలా వేసాను. అందుబాటులో లేని వారు గరం మసాలా వేసుకోండి.

సేమియా కిచిడి - రెసిపీ వీడియో

Vermicelli upma | Semiya Rava Kichidi | Semiya Upma

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 1 1/4 cup సేమియా
  • 1/4 cup బొంబాయ్ రవ్వ
  • 2 tbsp నూనె
  • 2 tbsp నెయ్యి
  • 1 cup ఉల్లిపాయ చీలికలు
  • 2 tbsp పచ్చిమిర్చి ముక్కలు
  • 1/4 cup కేరట్ ముక్కలు
  • 3 ఫ్రెంచ్ బీన్స్ ముక్కలు
  • 2 tbsp బటాణీ
  • 3 tbsp టమాటో ముక్కలు
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 1 tsp మినపప్పు
  • 1 tbsp పచ్చిశెనగ పప్పు
  • 10 జీడిపప్పు
  • ఉప్పు
  • 1 tsp అల్లం తరుగు
  • పుదీనా తరుగు - కొద్దిగా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • 3 cup నీళ్లు
  • 1 tsp నిమ్మరసం

విధానం

  1. టబ్స్ప్ నెయ్యి కరిగించి అందులో సేమియా వేసి కాస్త తెల్లగా అయ్యేదాకా లో-ఫ్లేమ్ మీద వేపుకోవాలి. సేమియా తెల్లబడ్డాక రవ్వ వేసి సేమియా విరగకుండా సేమియా లేత బంగారు రంగు వచ్చేదాకా వేపి దింపి పూర్తిగా చల్లార్చుకోవాలి.
  2. నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేపుకోవాలి, జీడీపప్పు రంగు మారుతుండగా ఆవాలు మినపప్పు సెనగపప్పు వేసి తాలింపు మాంచి రంగులోకి వేపుకోవాలి.
  3. తరువాత జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసి తాలింపు వేపుకోవాలి. ఆ తరువాత ఉల్లిపాయ తరుగు వేసి మెత్తబడనివ్వాలి.
  4. మెత్తబడిన ఉల్లిపాయ ముక్కల్లో అల్లం తరుగు, కేరట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసి 3-4 నిమిషాలు వేపుకోవాలి.
  5. వేగిన కేరట్ ముక్కల్లో నీళ్లు పోసి హై - ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. మరుగుతున్న ఎసరులో వేపిన సేమియా వేసి నెమ్మదిగా కలిపి మూతపెట్టి 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
  6. 8 నిమిషాల తరువాత మూత తీసి నెమ్మదిగా కలిపి ఆఖరుగా కొత్తిమీర, పుదీనా మటన్ మసాలా నెయ్యి వేసి కలిపి మరో 3 నిమిషాలు ఉడికించి దింపి మూత పెట్టి 2 నిమిషాలు వదిలేస్తే పర్ఫెక్టుగా సెట్ అవుతుంది.
  7. సర్వ్ చేసే ముందు నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Vermicelli upma | Semiya Rava Kichidi | Semiya Upma