వెడ్డింగ్ స్టైల్ కొబ్బరన్నం
కమ్మగా అక్కడక్కడా తియ్యగా ఎంత తిన్నా ఇంకా తినాలనిపించే సులభమైన రెసిపీ తమిళనాడు పెళ్లిళ్ల కొబ్బరన్నం. ఒక్క సారి తింటే ఆ రుచి మర్చిపోవడానికి చాలా రోజులు పడుతుంది, అంత గొప్ప రెసిపీ తమిళనాడు స్పెషల్ కొబ్బరన్నం.
ఏంటి కొబ్బరన్నం గురించి ఇంతలా చెప్తున్నాడు అని మీరనుకోవచ్చు, కానీ ఇది నిజంగా నిజం!!! ఒక్క సారి ఈ తీరు కొబ్బరన్నం తిన్నాక మీరు నా మాట నిజమని ఒప్పుకుంటారు.
ఇంకో విషయం ఈ కొబ్బరన్నం సాధారణంగా అందరికీ తెలిసిన రెసిపీ కాదు, చాలా సాధారణంగా అందరూ చేసుకునే రెసిపీ అసలే కాదు. ఈ కొబ్బరన్నం నేను తమిళనాడులో ఫ్రెండ్ పెళ్ళిలో రుచి చూశాను, తెగ నచ్చేసింది. వెంటనే ఫ్రెండ్ సహాయంతో కేటరర్ని అడిగితే రెసిపీ వివరంగా చెప్పాడు. అప్పటి నుండి మా ఇంట్లో అందరీ ఫెవరెట్ ఈ కొబ్బరన్నం.
ఆ రోజు పెళ్ళిలో వాళ్ళు ఈ కొబ్బరన్నంతో జీడిపప్పు పనీర్ కుర్మా ఇచ్చారు సైడ్ డిష్గా, నిజానికి ఈ తీరు కొబ్బరన్నంకి ఏ సైడ్ డిష్ అవసరం లేదు అనిపిస్తుంది. సైడ్ డిష్తో అసలైన కమ్మనికొబ్బరి ఫ్లేవర్స్ డామినేట్ అయిపోతాయి.
ఆఖరుగా ఆ కేటరర్ చెప్పిన ఒక్క మాట “దయచేసి అసలైన పెళ్లిళ్ల స్టైల్ కొబ్బరన్నం కమ్మదనం కావాలంటే పదార్ధాలు మార్చకండి”.

టిప్స్
అన్నం:
అన్నం వండుకునేప్పుడే కొద్దిగా ఉప్పు వేసి వండుకుంటే అన్నానికి ఉప్పు పట్టుకుంటుంది. అన్నం ఉడికాక వేసే ఉప్పు అన్నం పీల్చడానికి సమయం పడుతుంది.
కొబ్బరి అన్నానికి మామూలు బియ్యం వాడుకోండి. సాధారణంగా కొబ్బరి అన్నంకి బాస్మతీ లాంటి పరిమళం ఉండే బియ్యం వాడరు, కొబ్బరి కమ్మదనాన్ని బాస్మతి డామినేట్ చేస్తుంది.
కొబ్బరి నూనె:
నిజమైన కొబ్బరన్నం ఫ్లేవర్ కావాలంటే కచ్చితంగా కొబ్బరి నూనె వాడుకోవాలి. నిజమే తెలుగు వారు, ఇతర రాష్ట్రాల వారు కొబ్బరి నూనె వంటల్లో వాడుకోడానికి అంతగా ఇష్టపడరు. కానీ కొబ్బరన్నంలో చాలా బాగుంటుంది కొబ్బరి నూనె. నచ్చని వారు మరింకేదైనా నూనె వాడుకోండి.
తాలింపు వేపే తీరు :
తాలింపు ఓపికతో కారకరలాడేట్టు వేపుకోవాలి. అప్పుడే కొబ్బరన్నంలో తాలింపు కరకరలాడుతూ ఘుమఘుమలతో ఉంటుంది. ఇంకా పచ్చికొబ్బరి ఎర్రగా వేగాలి అప్పుడే తింటున్నప్పుడు చాలా రుచిగా ఉంటుంది.
ఉల్లిపాయ/ఎండు ద్రాక్ష:
దక్షిణ భారతదేశం వారు కొబ్బరి అన్నం ఒక ప్రసాదంగా చేస్తుంటారు కాబట్టి ఉల్లిపాయ వేయరు. ఇది పెళ్లిళ్ల స్పెషల్ కదా అందుకే ప్రేత్యేకత కోసం ఉల్లిపాయల్ని ఎర్రగా వేపి అన్నంలో కలుపుతారు. ఇలా ఎర్రగా వేగిన ఉల్లి ఎంతో రుచిగా ఉంటుంది అన్నంలో.
ఎండిన ద్రాక్ష కూడా స్పెషల్ టచ్ కోసం అంతే!!! అక్కడక్కడ తియ్యగా తగులుతూ భలేగా ఉంటుంది. నచ్చకుంటే స్కిప్ చేసుకోవచ్చు.

వెడ్డింగ్ స్టైల్ కొబ్బరన్నం - రెసిపీ వీడియో
Wedding Style Coconut Rice | Coconut Rice | How to make Coconut Rice
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup Rice
- 3 tbsp Coconut Oil
- 15 - 20
- 1 tsp Mustard Seeds
- 1 tbsp Bengal Gram
- 1 tbsp Black Gram
- 3 Dry Chillies
- 1 tsp Cumin
- 2 Pinches Asafoetida
- 15 Raisins
- Salt – To Taste
- 1 cup Fresh Coconut (Grated)
- 2 Green Chilli (Slit lengthwise)
- 1 inch Ginger (finely chopped)
- Coriander Leaves (Kothmir) – A little
- 1 Onion (Finely chopped)
విధానం
-
కప్పు బియ్యాన్ని ఉప్పేసి ఒకటికి రెండు నీళ్లు పోసి పొడి పొడిగా వండుకుని పక్కనుంచుకొండి
-
కొబ్బరి నూనె వేడి చేసి బాగా పొగలు రానివ్వాలి. పొగలొస్తున్నా నూనెలో ఆవాలు, సెనగపప్పు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి
-
పప్పులు వేగుతున్నప్పుడే జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కిస్మిస్ పొంగనివ్వాలి
- వేగుతున్న తాలింపులో ఎండు మిర్చి ఇంగువ జీలకర్ర కరివేపాకు వేసి వేపుకొండి.
-
వేగిన తాలింపులో ఉల్లిపాయ సన్నని తరుగు రుచికి సరిపడా పచ్చిమరీచి చీలికలు ఉప్పు వేసి ఉల్లిపాయని ఎర్రగా వేపుకోవాలి
-
ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తరువాత పచ్చికొబ్బరి తురుము వేసి కచ్చితంగా బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. కొబ్బరి రంగు మారగానే పొడి పొడిగా వండుకున్న అన్నం వేసి హై ఫ్లేమ్ మీద మెతుకు వేడెక్కేదాకా టాస్ చేయండి.
-
దింపే ముందు కొత్తిమీర తరుగు, అల్లం తరుగు వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
54 comments