వైట్ సాగు | వైట్ కుర్మా

కొన్ని దుంప కూరలు, బటాణీ, బీన్స్ ఉడికించి అతి తక్కువ మసాలాలతో తయారయ్యే కమ్మని గ్రేవీలో వేసి ఉడికించి చేసే ఉడుపి స్పెషల్ రెసిపీ వైట్ సాగు లేదా వైట్ కుర్మా పూరీ చపాతీలతో కప్పులు కప్పులు తినాలనిపించేలా ఉంటుంది. తిన్నాక పొట్టకి హాయిగా అనిపిస్తుంది.

ఉడుపి స్పెషల్ వైట్ సాగు కర్ణాటకలో ఏ హోటల్లో అయినా కారం కుర్మాతో పాటుగా పూరి, చపాతీతో ఇదీ తప్పక ఇస్తారు.

సాగు అంటే కూర కన్నడలో. ఈ సాగు తెల్లగా ఉంటుంది కాబట్టి ఇది వైట్ సాగు అయ్యింది. వైట్ సాగు కమ్మగా ఉంటుంది. ఎండు కారం, పసుపు, అల్లం వెల్లులి పేస్ట్, టొమాటోలు ఏవీ వేయరు. వేసే ఆ కొద్దీ మసాలాలు కూడా మితంగా పరిమళం కోసం వేయడమే!!! ఇది మసాలా కూర కాదు.

వైట్ సాగు కర్ణాటకతో పాటు తమిళనాడులో కూడా భవన్స్ పేరుతో నడిపే ప్రతీ హోటల్స్ వారు సాయంత్రం చపాతీతో పాటు ఇస్తారు.

వైట్ సాగు చాలా సింపుల్!!! కూరకాయలని ఉడికించి మసాలా పేస్ట్లో వేసి దగ్గరగా ఉడికించి దింపేసుకోవడమే! నూనెలు మసాలా దినుసులు చాలా తక్కువ. అందుకే నేను దీన్నీ హ్యాపీ టమ్మీ రెసిపీ అంటాను.

సింపుల్ వైట్ సాగు కొన్ని చిట్టి చిట్కాలు!!!

White saagu | White Kurma

టిప్స్

క్నోల్ ఖోల్ :

వైట్ సాగులో ఇది కచ్చితంగా ఉండాలి, వేస్తారు కూడా. ఇది కాశ్మీరీ వంటకాలలో ప్రేత్యేకంగా కనిపిస్తుంది. ఇంకా కన్నడిగులు కూడా వాడతారు. ఇది కేబేజి కుటుంబానికి చెందినది.

క్నోల్ ఖోల్ దొరికితే వేయండి, దొరకనట్లైతే ఆలూనే ఇంకో అర కప్పు పెంచుకోండి. కానీ వైట్ సాగు అంటే క్నోల్ ఖోల్ ఉండాలని గుర్తుంచుకోండి

కాయకూరలని ఉడికించే తీరు:

ఈ వైట్ సాగులో వేసే కాయ కూరలన్నీ ఒకే కొలత. మరిగే నీళ్లలో కాయకూరలు వేసి 70% ఉడికిస్తే చాలు. మరీ మెత్తగా ఉడికిస్తే సాగులో గుజ్జుగా అయిపోతాయ్.

మసాలా దినుసులు:

మసాలా దినుసులు చాలా మితంగా వాడాలి. వేసే ఆ మసాలా దినుసులు కేవలం పరిమళం కోసమే అని అర్ధం చేసుకోండి. ఈ సాగు ఘాటుగా ఉండదు.

పుదీనా:

సాగులో ఆఖరున వేసే పుదీనా కేవలం 6-7 ఆకులు మాత్రమే వేసుకోవాలి, ఎక్కువగా వేస్తే సాగులో పుదీనా ఫ్లేవర్ వచ్చేస్తుంది.

గసగసాలు:

గసగసాలు కచ్చితంగా ఉంటేనే కమ్మదనం. గసాలు కొన్ని దేశాల్లో నిషిద్ధం కాబట్టి గసాలకి బదులు జీడిపప్పు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి.

ఉల్లిపాయ:

ఉల్లిపాయ తినని వారు లేదా పండుగలకు ఉపవాసాలకి చేసుకోదలచిన వారు హ్యాపీగా ఉల్లిపాయని వేయకుండా చేసుకోండి.

వైట్ సాగు | వైట్ కుర్మా - రెసిపీ వీడియో

White saagu | White Kurma | How to make White Kurma with tips

Breakfast Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • మసాలా పేస్ట్ కోసం
  • 1/2 బిర్యానీ ఆకు
  • 4 లవంగాలు
  • 3 యాలకలు
  • 1 inch దాల్చిన చెక్క
  • 1 tbsp నానబెట్టుకున్న గసగసాలు
  • 15 నానానబెట్టుకున్న జీడిపప్పు
  • 2 tbsp పుట్నాల పప్పు
  • 1 tsp అల్లం
  • 1/4 cup పచ్చికొబ్బరి ముక్కలు
  • 4 - 5 పచ్చిమిర్చి
  • కాయకూరలు ఉడికించాడానికి:
  • 1/2 cup క్నోల్ ఖోల్ ముక్కలు
  • 1/2 cup చెక్కు తీసుకున్న ఆలూ ముక్కలు
  • 1/2 cup బీన్స్ ముక్కలు
  • 1/2 cup కేరట్ ముక్కలు
  • 1 liter నీళ్లు
  • సాగు కోసం
  • 3 tbsp నూనె
  • 1/2 బిర్యానీ ఆకు
  • 1 tsp సోంపు
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1/4 cup ఫ్రోజెన్ బటాణీ
  • ఉప్పు
  • 1/2 liter కూరగాయల్ని ఉడికించున్న నీళ్లు
  • మసాలా పేస్ట్
  • 6 - 7 పుదీనా ఆకులు
  • 1/2 tsp పంచదార

విధానం

  1. మసాలా పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  2. నీళ్లలో కాయకూర ముక్కలన్నీ వేసి 70% ఉడికించి తీసుకోండి. ఉడికించిన నీరు పక్కనుంచుకొండి. మీరు తాజా బటాణీ వాడితే ఈ కాయకూరలతో పాటే ఉడికించుకోండి. నేను ఫ్రోజెన్ బటాణీ వాడాను.
  3. నూనె వేడి చేసి అందులో సగం బిర్యానీ ఆకు, సోంపు వేసి చిట్లనివ్వాలి.
  4. తరువాత ఉల్లిపాయ తరుగు ఉప్పు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి.
  5. వేగిన ఉల్లిలో సగం పైన ఉడికించుకున్న కాయకూర ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేపుకోవాలి.
  6. తరువాత మసాలా పేస్ట్ వేసి 2 నిమిషాలు వేపి కూరగాయలు ఉడికించున్న నీరు, పంచదార వేసి కలిపి మూత పెట్టి మధ్యమధ్యన కలుపుతూ 15 నిమిషాలు ఉడికించుకోండి.
  7. ఆఖరున దింపే ముందు పుదీనా ఆకులు చల్లి దింపేసుకోండి.
  8. కూర చిక్కగా అనిపిస్తే కొద్దిగా వేడి నీరు పోసి పలుచన చేసుకోండి. ఈ వైట్ సాగు పూరి చపాతీతో చాలా రుచిగా ఉంటుంది, అన్నంతో కంటే!!!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

White saagu | White Kurma