Curries
5.0 AVERAGE
2 Comments

ఉల్లి వెల్లులి లేని ఆంధ్రుల సంప్రదాయ వంటకం కందా బచ్చలి కూర. ఏదో నాలుగు ముద్దలు తిని లేద్దాం అనుకున్న వారితో కూడా తెలుగు వారి కందా బచ్చలి కూర కడుపు నింపేస్తుంది.

ఉల్లి వెల్లులి వాడకపోవడం వల్ల ఇప్పటికీ కొన్ని సంప్రదాయ పెళ్ళిళ్ళలో శుభకార్యాలలో కందా బచ్చలి ఉండాలండి అని పట్టు మరీ భోజనాల్లో వడ్డిస్తారంటే అర్ధం చేసుకోవచ్చు కందా బచ్చలి కూర అంటే ఆంధ్రులకి ఎంత ఇష్టమో!!! కందా బచ్చలి కూరతో ఘాటైన ఆవా తాలింపు పెట్టి చేసే ఈ ముద్ద కూర వేడి నెయ్యి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. ఆంధ్రులు కందా బచ్చలి కూర దాదాపుగా ఒకేలా చేసినా చేతికి ఇంటికి ప్రాంతానికి చిన్న మార్పులే తప్ప పెద్ద మార్పులేమీ ఉండవు.

తెలుగు వారి కందా బచ్చలి సంప్రదాయ రుచి రావాలంటే చేసే ముందు ఒక్క సారి టిప్స్ చూడండి.

Yam with Spinach | Kanda Bachli | Simple Spinach Yam Curry Recipe

టిప్స్

కందా:

1.కంద చాలా రకాలు ఉన్నాయి. ఏ రకం కందగడ్డ అయినా పర్లేదు. కానీ ఉడికించెప్పుడు కంద ముక్కలు కాస్త పెద్దగా ఉంచుకోవాలి లేదంటే మరీ మెత్తగా ఉడికిపోతాయ్.

2.కందని పూర్తిగా అంటే మరీ మెత్తగా గుజ్జుగా ఉడికించుకోకూడదు. ముక్క కాస్త నోటికి తెగిలేలా ఉండాలి. అంటే ఆలూ గడ్డ ముక్కలు మాదిరి ఉడికితే చాలు.

3.ఉడికిన కందని కచ్చాపచ్చాగా ఎనుపుకోవాలి.

బచ్చలి ఆకు:

1.బచ్చలి ఆకు కాడలు లేతగా ఉంటే రెండూ వాడుకోవచ్చు. బచ్చలి ఆకు కాడలు ముదిరితే వాడకపోవడమే మేలు.

ఇంకొన్ని విషయాలు:

తాలింపు:

2.కందా బచ్చలికి తాలింపు ఎంతో ముఖ్యం. తాలింపు కాస్త ఎక్కువగా ఉండాలి, ఇంకా తాలింపు కరకరలాడుతూ ఉండాలి. అందుకే తాలింపు సామనంతా దగ్గర ఉంచుకుని ఒక్కోటిగా వేసుకుంటూ వేపుకుంటే పర్ఫెక్ట్ తాలింపు తయారు.

ఆవాలు:

3.కందా బచ్చలికి ఆవాల పేస్ట్ ఉంటేనే రుచి. నచ్చకుంటే వదిలేవచ్చు. ఆవాల పేస్ట్ వేపనక్కర్లేదు. ఆఖరున కూరలో కలిపితేనే ఆ ఘాటు కూరకి పట్టి రుచిగా ఉంటుంది

పచ్చిమిర్చి:

4.పచ్చిమిర్చి నూనెలో వేపి వేసేకంటే సన్నని తరుగు పచ్చిగా వేస్తేనే రుచిగా ఉంటుంది.

కూర:

  1. ఎప్పుడైనా కందా బచ్చలి కూర తయారయ్యాక కనీసం ఒక గంట అయినా రెస్ట్ ఇవ్వాలి అప్పుడు కూరకి ఆవాల ఘాటు పట్టి ఎంతో రుచిగా ఉంటుంది.

కందా బచ్చలి - రెసిపీ వీడియో

Yam with Malabar Spinach | Kanda Bachali | Andhra Traditional Malabar Spinach Yam Curry Recipe

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Servings 4

కావాల్సిన పదార్ధాలు

  • 250 gms కందా (చెక్కు తీసిన 2 ఇంచుల లావు ముక్కలు)
  • 4 - 5 మీడియం సైజు బచ్చలి ఆకు ఇంకా కడాల తరుగు
  • ఉప్పు
  • 3 పచ్చిమిర్చి (సన్నని చీలికలు)
  • 1.5 tbsp చింతపండు రసం
  • 1/8 tsp పసుపు
  • 1/2 liter నీళ్ళు
  • 1 tsp వేయించిన జీలకర్ర పొడి
  • ఆవాల పేస్ట్
  • 1.5 tsp ఆవాలు
  • 1 ఇంచ్ అల్లం ముక్క
  • 2 ఎండు మిర్చి
  • ఉప్పు
  • 1/4 tsp పసుపు
  • 1 tsp నూనె
  • తాలింపు కోసం
  • 2 tbsp నూనె
  • 2 tbsp వేరు శెనగపప్పు
  • 1/2 tsp ఆవాలు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp పచ్చి శెనగపప్పు
  • 2 ఎండు మిర్చి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 2 చిటికెళ్లు ఇంగువ

విధానం

  1. గిన్నెలో నీళ్ళు పోసి అందులో కండ ముక్కలు బచ్చలి ఆకు పసుపు వేసి కంద 90% ఉడికించుకోవాలి. దింపడానికి ముందు ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి.
  2. ఆవాల పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసి నూనె వేసి కలిపి పక్కనుంచుకోండి.
  3. ఉడికిన కందా బచ్చలిని వడకట్టి కచ్చపచ్చగా ఏనుపుకోవాలి. అవసరమనిపిస్తే కందని ఉడికించిన నీరు కొద్దిగా పోసి పలుచన చేసుకోండి.
  4. ఏనుపుకున్నాక పచ్చిమిర్చి చీలికలు, చింతపండు గుజ్జు, ఆవాల పేస్ట్ వేసి బాగా కలిపి ఉంచండి.
  5. తాలింపు కోసం నూనె వేడి చేసి ముందుగా వేరుశెనగప్పుని వేపి మిగిలినవి ఒక్కోటిగా వేసుకుంటూ ఎర్రగా కరకరలాడేట్టు వేపి కూర కలిపి కనీసం గంట సేపు వదిలేస్తే తాలింపు పరిమళం ఆవాల ఘాటు పులుపు కూరకి పట్టి ఎంతో రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • R
    Rajini
    Recipe Rating:
    Thanks for the recipe. Curry turnedout to be yummy and flavorful. Can we add red chili powder to make it a bit hot.
    • P
      Padma Krishna
      No need to add red chilli powder. We have already added 2 red chillies while grinding the ava paste.
Yam with Spinach | Kanda Bachli | Simple Spinach Yam Curry Recipe