రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అని చెప్పే రెసిపీస్ కొన్నే ఉన్న్తాయ్ అందులో ఒకటి ఈ ఉసిరికాయ అన్నం. దీన్నే తెలుగు వారు ఉసిరికాయ పులిహోరా అని కూడా అంటారు. పేరు ఎలా ఉన్నా రుచి చాలా గొప్పగా ఉంటుంది. లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్ ఎందుకంటె ఐదు పది నిమిషాల్లో తయారైపోతుంది కాబట్టి.

ఈ రెసిపీని నేను హ్యాపీ టమ్మీ రెసిపీ అంటాను. ఈ ఉసిరికాయ అన్నం తిందాం వాళ్ళ ఉసిరిలో ఉండే పోషకాలు పూర్తిగా అందుతాయి. సాధారణంగా ఉసిరికాయలో ఎన్ని పోషకాలున్నాయి అని తెలిసినా తినడానికి పిల్లలు పెద్దగా ఇష్టత చూపించారు. ఇలా అన్నంగా చేసి ఇచ్చేస్తే చాలా ఇష్టంగా తింటారు.

నిజానికి ఈ ఉసిరికాయ అన్నం తినడం ఇంకా తయారీ రెండూ తెలుగు వారిళ్ళలో తక్కువే !!! తమిళులు ఇంకా కన్నడిగులు ఎక్కువగా చేసుకుంటారు. నేను రుచితో పాటు ఈ అన్నానికి పరిమళాన్ని జోడించాను.

ఈ ఉసిరికాయ అన్నం శీతాకాలం అంతా ఇంకా ఉసిరికాయలు దొరికినంత కాలం తరచూ తినడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు చక్కగా అందుతాయి.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు క్రిస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్

టిప్స్

ఉసిరికాయ:

  1. నేను చిన్న నిమ్మకాయంత సైజు ఉసిరికాయలు 5 వాడాను. మీరు తినగలిగే పిలుపుని బట్టి తరువాత కూడా ఉసిరి తురుము కలుపుకోవచ్చు. అన్నం:

  2. నేను అన్నంలోనే ఉప్పు పసుపు వేసి పొడి పొడిగా వండాను. అన్నంలోనే ఉప్పు వేసి వండితే అన్నానికి చక్కగా పడుతుంది, విడిగా తరువాత ఉప్పు కలిపిన దానికంటే. విడిగా తాలింపు వేసిన తరువాత కలిపితే ఉప్పు కరిగి అన్నానికి పట్టడానికి సమయం పడుతుంది.

  3. బియ్యం ఎప్పుడూ నానబెట్టకుండా ఒకటికి రెండు నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వాలి. అప్పుడే అన్నం పొడిపొడిగా ఉంటుంది. మామలు అన్నం వండినట్లు వండితే అన్నం మెత్తగా అయిపోతుంది. ఇంకా కుక్కర్ స్టీమ్ పోయిన వెంటనే అన్నాన్ని నూనె రాసిన పళ్లెంలోకి తీసుకుంటే చల్లారి పొడి పొడిగా అవుతుంది.

తాలింపు:

  1. ఈ అన్నానికి తాలింపు ఎంతో ముఖ్యం, అప్పుడే అన్నం ఎంతో రుచిగా ఉంటుంది. కాబట్టి తాలింపుని నిదానంగా ఎర్రగా వేపుకోవాలి.

నువ్వులు మిరియాలు:

  1. నేను సింపుల్గా ఉసిరికాయ తురుము తాలింపు పెట్టి చేసే అన్నాన్ని పౌష్టికంగా ఉండాలని నువ్వు మిరియాలు దంచి వేశాను. నువ్వులు మిరియాలు శీతాకాలంలో వచ్చే వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

సాంబార్ పొడి:

  1. ఆఖరున దింపే ముందు వేసిన సాంబార్ పొడి పరిమళం ఉసిరికాయ అన్నం రుచిని అమాంతం పెంచేస్తుంది. కానీ సాంబార్ పొడి వేసి కలిపి వెన్తనె స్టవ్ ఆపేయాలి లేదంటే సాంబార్ పొడి మాడిపోతుంది.

  2. నచ్చితే మీరు రసం పొడి కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది.

ఆఖరుగా:

  1. ఎప్పుడు కూడా స్టవ్ ఆపేసి ఉసిరికాయ తురుము తాలింపులో వేసి కలుపుకోవాలి. లేదంటే ఉసిరికాయలో ఉండే పోషకాలు వేడికి నశించిపోతాయి.

  2. ఉసిరికాయ తాలింపు అన్నంలో కలిపాక 30 నిమిషాలు అయినా ఆగాలి అప్పుడే పులుపు అన్నానికి పడుతుంది. లేదంటే అన్నం చప్పగా అనిపిస్తుంది.

ఉసిరికాయ అన్నం - రెసిపీ వీడియో

Amla Rice | Happy Tummy Amla Rice | Usirikaya Annam | How to Make Amla Rice

Bachelors Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Total Time 21 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • 1(185) cup(gms) బియ్యం
  • 2 cups నీళ్లు
  • 1/2 tbsp పసుపు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 2 tbsp నువ్వులు
  • 1/2 tbsp మిరియాలు
  • 2.5 tbsp నూనె
  • 1 tbsp ఆవాలు
  • 1 tbsp సెనగపప్పు
  • 1 tbsp మినపప్పు
  • 3 tbsp వేరుశెనగ గుండ్లు
  • 1 tbsp జీలకర్ర
  • 2 Pinches ఇంగువ
  • 2 Sprigs కరివేపాకు
  • 1/2 tbsp అల్లం తురుము
  • 2 ఎండు మిర్చీ
  • 2 పచ్చిమిర్చి
  • 1 tbsp సాంబార్ పొడి
  • 5 ఉసిరికాయలు

విధానం

  1. బియ్యంలో నీళ్లు పోసి ఉప్పు పసుపు వేసి కుక్కర్ మూతపెట్టి హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానిచ్చి స్టీమ్ పోయాక వెంటనే అన్నం మూత తీసి చల్లార్చాలి
  2. మూకుడులో నువ్వులు మిరియాలు వేసి నువ్వులు చిట్లేదాకా వేపి కాస్త బరకగా పొడి చేసుకోండి
  3. ఉసిరికాయలని తురిమి పక్కనుంచుకొండి
  4. నూనె వేడి చేసి అందులో ఆవాలు మినపప్పు సెనగపప్పు పల్లీలు వేసి పల్లెలు చిట్లేదాకా మీడియం ఫ్లేమ్ మీదే వేపుకోవాలి అప్పుడే తాలింపుకి రుచి
  5. వేగిన తాలింపులో మిగిలిన సామాగ్రీ అంతా ఒక్కోటిగా వేసి ఎర్రగా మాంచి సువాసనొచ్చేదాకా వేపుకోవాలి
  6. ఆఖరున సాంబార్ పొడి వేసి 30 సెకన్లు వేపి స్టవ్ ఆపేసి ఉసిరికాయ తురుము వేసి కలుపుకోవాలి. అప్పుడు ఉసిరికాయలోని పసరు వాసన పోతుంది
  7. ఆ తరువాత తాలింపుని చల్లారిన అన్నంలో వేసి నెమ్మదిగా పట్టించి 30 నిమిషాలు వదిలేస్తే అన్నానికి పులుపు పడుతుంది.
  8. ఈ హెల్తీ ఉసిరికాయ అన్నం లంచ్ బాక్సులకి, ప్రసాదంగా పర్ఫెక్ట్.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • S
    Sushil Kumar Rachuri
    Recipe Rating:
    Taste is good. I achieved it by following step by step. Thanks