ఎర్రగా పుల్లగా కారంగా తెలిసి తెలియని తీపితో ఉండే ఈ అల్లం పచ్చడి ఆంధ్రా హోటళ్ల స్పెషల్ రెసిపీ. ఒక సారి చేసుంచుకుంటే కనీయం 2 నెలల పైన నిలవుంటుంది.

ఎండుమిర్చి అల్లం బెల్లం కొన్ని పప్పులు వేపి చింతపండు గుజ్జుతో మెత్తగా గ్రైండ్ చేస్తారు ఈ పచ్చడి. ఈ ఎర్రటి అల్లం పచ్చడి అన్నంతో కంటే ఇడ్లీ అట్టు గారెలతో చాలా యమా రుచిగా ఉంటుంది.

ఆంధ్రా హోటల్స్ లేదా వీధి బండ్ల మీద అమ్మే టిఫిన్స్ దగ్గర ఎక్కడ చూసినా పల్లీ కొబ్బరి పచ్చడి, ఈ ఎర్రటి అల్లం పచ్చడి ఉంటుంది. కాకపోతే ఈ అల్లం పచ్చడిని నీటితో పలుచని చేసి ఇస్తారు. నేను ఇది వరకు టిఫిన్స్లోకి ఇచ్చే మరో రకం అల్లం పచ్చడి కూడా చేసాను చుడండి ఈ అల్లం పచ్చడి పచ్చిమిర్చి వేసి చేస్తారు, ఇంకా కాస్త తియ్యగా ఉంటుంది.

ఈ అల్లం పచ్చడి కొలతలు చాలా సులభం. ఈ ఒక్క రెసిపీని కొలతలని టిప్స్ సరిగా అర్ధం చేసుకుంటే ఎన్ని కిలోల పచ్చడైనా పర్ఫెక్టుగా చేసుకోవచ్చు.

టిప్స్

అల్లం:

  1. కొంచెం పాతడి పీచున్న అల్లం అయితే అల్లం ఘాటు తెలుస్తుంది, కొత్త అల్లం కంటే.

బెల్లం:

  1. సాధారణంగా ఈ పచ్చడిలో బెల్లం వేస్తారు, కావాలంటే పంచదార కూడా అదే కొలతకి వేసుకోవచ్చు

ఎండుమిర్చి|కారం:

  1. నేను ఎర్రటి రంగు కారంగా ఉండే గుంటూరు మిర్చీ వాడాను, మీరు మీరు వాడే మిర్చీని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి.

  2. పచ్చడి చేసినప్పుడు కాస్త కారంగానే అనిపిస్తుంది. ఫ్రిజ్లో పెట్టాక కారం తగ్గిపోతుంది అని గమనించండి. మీరు పచ్చడి అప్పటికప్పుడు చేసుకుని తినాలనుకుంటే కావాల్సినంత పక్కకు తీసి దానిలో ఇంకాస్త బెల్లం ఉప్పు పులుపు కలుపుకుని కారాన్ని తగ్గించుకోవచ్చు. పచ్చడి అంతటిని కారం తగ్గిస్తే రోజులు గడుస్తున్నా కొద్దీ ఇంకా చప్పగా అయిపోతుంది పచ్చడి.

ఇలా చేస్తే పచ్చడి నెల రోజుల పైన నిల్వ ఉంటుంది:

  1. పచ్చడిని వేడి నీళ్లతో గ్రైండ్ చేస్తేనే నిల్వ ఉంటుంది. ఇంకా తడి తగలకుండా సీసాలోకి తీసి ఫ్రిజ్లో పెట్టుకోవాలి.

  2. సాధారణంగా ఈ పచ్చడి నాలా చిక్కగా చేసి ఉంచుకుంటారు. తరువాత కావలసినంత తీసి నీళ్లతో పలుచన చేసుకుంటారు. కొందరు ఆవాలు కరివేపాకు జీలకర్ర వేసి తాలింపు పెట్టుకుంటారు. నచ్చితే మీరు తాలింపు పెట్టుకోవచ్చు.

చింతపండు:

  1. చింతపండు గింజలు నార తీసేసి వేడి నీళ్లలో నానబెట్టుకుంటే మెత్తగా గ్రైండ్ అవుతుంది

ముఖ్యమైన కొలతలు:

  1. ఈ రెసిపీ ఏ కొలతల్లో చేసినా అల్లం చింతపండు ఎండుమిర్చి అన్నీ సమానం. బెల్లం అల్లానికి రెండింతలు. ఇది తెలుగువారి కొలత. ఇంత కారం తినలేని వారు బెల్లం చింతపండు పాళ్ళు పెంచుకోవాలి, దానికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి.

ఆంధ్రా అల్లం పచ్చడి - రెసిపీ వీడియో

Andhra Allam Pachadi | Ginger Chutney | How to Make Ginger Chutney with tips

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 12 mins
  • Total Time 17 mins
  • Serves 20

కావాల్సిన పదార్ధాలు

  • 3-4 tbsp నూనె
  • 2 tbsp ధనియాలు
  • 1 tbsp మినపప్పు
  • 1 tbsp పచ్చిశెనగపప్పు
  • 50 gms తొడిమలు తీసేనిన ఎండుమిరపకాయాలు
  • 1/3 Cup అల్లం తరుగు
  • 1/4 Cup బెల్లం
  • 2-2.5 tbsp ఉప్పు
  • 50 gms Tamarind (Soaked)
  • 50-70 ml వేడి నీళ్లు
  • 1 tbsp జీలకర్ర
  • 10-12 వెల్లులి

విధానం

  1. నూనె వేడి చేసి అందులో ధనియాలు, మినపప్పు సెనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద రంగు మారేదాకా వేపుకోవాలి
  2. వేగిన పప్పులలో ఎండుమిర్చి అల్లం ముక్కలు వేసి ఎండుమిర్చిని ఎర్రగా వేపుకోవాలి.
  3. వేపుకున్న పప్పుల్ని ఎండుమిర్చిని మిక్సీలోకి తీసుకోండి. ఇంకా ఇందులో మిగిలిన సామాగ్రీ అంతా వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి. లేదా కాస్త బరకగా అయినా గ్రైండ్ చేసుకోండి.
  4. పచ్చడిని ఒక్కసారి రుచి చూసి అవసరాన్ని బట్టి ఉప్పు బెల్లం చింతపండు వేసుకోండి. (ఒక్క సారి టిప్స్ చుడండి కారం గురుంచి మరింతగా తెలుస్తుంది)

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments