నెయ్యిలో మసాలా దినుసులతో తాలింపు పెట్టి బాస్మతి బియ్యం వేసి చేసే తెలంగాణా తీరు బగారన్నం అందులోకి నంజుడుగా తెలుగు వారు తీరులో ఘాటైన చికెన్ కర్రీ కాంబినేషన్కి తిరుగులేదు. ఇంటికి బంధువులొచ్చినా ఏదైనా స్పెషల్ రోజుల్లో ఎంతో సులభంగా చేసుకోగలిగిన కాంబో!!!

తెలంగాణా స్పెషల్ బాగారన్నం చాలా సింపుల్ కానీ ఎంతో రుచిగా ఉంటుంది. తెలంగాణాలో పెళ్లిళ్లకి లేదా దావత్ పార్టీలకి ఎక్కువగా బాగారన్నం కోడి కూర చేయాల్సిందే!!!

కానీ నేను ఈ స్పైసీ చికెన్ కర్రీ తెలంగాణ తీరులో చేయడంలేదు!!! ఇది ఆంధ్రుల తీరు. ఒక్క టొమాటో వేయకపోతే చికెన్ కర్రీలో తెలంగాణ తీరు అవుతుంది. నేను చిక్కని గ్రేవీ కోసం అని టొమాటోలు వేశాను.

ఈ రెసిపీ కొలతలు మీరు అర్ధం చేసుకుంటే ఎన్ని కేజీలైనా సులభంగా చేసేసుకోవచ్చు, కాబట్టి ఒక్కస ఆరి కింద టిప్స్ చుడండి కొలతలు ఇంకా చేసే విధానం మీద మరింత స్పష్టత వస్తుంది, అప్పుడు ధైర్యంగా మరింత రుచిగా చేయగలుగుతారు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుతెలంగాణా పెళ్లిళ్ళ స్పెషల్ రెడ్ చికెన్

టిప్స్

చికెన్:

  1. నేను ఒక కేజీ చికెన్కి మసాలాలు పట్టించి కనీసం గంట సేపైనా నానబెట్టుకోవాలి. అలా నానితే చికెన్ ముక్క మృదువై మసాలాలు ఇంకుతాయ్ ముక్కలోకి.

  2. చికెన్ నూనెలో వేశాక ముందు హై ఫ్లేమ్ మీద వేపుకుంటే ముక్క మృదువుతుంది, సన్నని సెగ మీద వేపితే గట్టిగా రబ్బరులా అవుతుంది.

ఇదే తెలుగు వారి అసలైన మసాలా పొడి:

  1. మసాలా దినుసులు నేను సరిగ్గా కేజీ కూరకి సరిపోయేలా తీసుకున్నాను. మీరు ఈ కొలతలని బట్టి పెంచుకోండి.

  2. అసలు తెలుగువారి మసాలా దినుసులంటే కేవలం ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, గసగసాలు, ఎండు కొబ్బరి వేస్తే ఎప్పుడైనా మిరియాలు అంతే!!! ప్రస్తుతానికి గరం మసాలా పేరుతో వేస్తున్న జాజికాయ, జాపత్రి, అనాసపువ్వు ఇంకేవేవో వెనుకటికి తెలుగు వారు వేసేవారు కాదు. ఉత్త్రాది రుచులు పరిచయం కారణంతో తెలుగు వారి గరం మసాలా తీరు మారింది.

  3. గరం మసాలా సన్నని సెగ మీద వేపుకోవాలి. మాంచి సువాసన వస్తున్నప్పుడు కొబ్బరి పొడి గసాలు వేసి గసాలు చిట్లేదాకా వేపి చల్లారాక మెత్తని పొడి లేదా నీళ్లతో మెత్తని పొడి చేసుకోండి.

  4. నేను ఎండు కొబ్బరి పొడి వాడాను కాబట్టి ఆఖరున మసాలాలు అన్నీ వేగిన తరువాత వేశాను, మీరు ఎండు కొబ్బరి ముక్కలు వాడుతున్నట్లైతే మసాలా దినుసులతోనే వేసి వేపుకోవాలి.

ఎప్పుడు చేసినా బెస్ట్ చికెన్ కర్రీ కోసం:

  1. కేజీ చికెన్కి 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 3 టొమాటోలు సరిగ్గా సరిపోతాయి. కూర చిక్కదనం గసగసాలు, ఎండు కొబ్బరి, ధనియాల నుండి వచ్చేస్తుంది.

  2. ఉల్లిపాయ ఎక్కువగా వేస్తే కూర తీపిస్తుంది.

  3. మాంచి క్వాలిటీ కారం అయితే tbsp సరిపోతుంది, మిగిలినది గరం మసాలా ఘాటుతో పచ్చిమిర్చితో సరిపోతుంది. అయినా ఆఖరుగా ఒక్కసారి కూర రుచి చుడండి, తగ్గితే కారం వేసి అడ్జస్ట్ చేసుకోండి.

బగారన్నం:

  1. బాగారన్నం నేను కుక్కర్ వాడిచేస్తున్నాను. కాబట్టి గంట సేపు నానబెట్టిన బాస్మతి బియ్యం కప్పు అయితే కప్పు ఇంకో పావు కప్పు నీరు అవసరం అవుతుంది. అదే విడిగా వండుకుంటున్నట్లైతే కప్పు బాస్మతి బియ్యానికి కప్పు ముప్పావు నీరు అవసరం అవుతుంది.

  2. బాగారన్నం కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది.

  3. ఇదే బాగారాన్నం మామూలు బియ్యంతో చేసుకుంటే కప్పు బియ్యానికి కప్పు ముప్పావు నీరు సరిపోతుంది.

  4. సాధారణంగా బాగారన్నంలో మిరియాలు వేయరు. మా ఇంట్లో కొన్ని వేస్తాము అందుకే కొన్ని మిరియాలు వేశాను, నచ్చకుంటే మిరియాలు వేయకపోయినా పర్లేదు.

బాగారన్నం చికెన్ కర్రీ - రెసిపీ వీడియో

Bagara Rice with Chicken Curry | Spicy Chicken Curry with Bagara Rice | How to Make Bagara Rice with Chicken Curry

Bachelors Recipes | nonvegetarian
  • Prep Time 3 mins
  • Soaking Time 1 hr
  • Cook Time 1 hr
  • Total Time 2 hrs 3 mins
  • Serves 6

కావాల్సిన పదార్ధాలు

  • బాగారన్నం కోసం:
  • 2(185) Cups(gms) బాస్మతి బియ్యం
  • 4 tbsp నెయ్యి
  • 1 1/2 inch దాల్చిన చెక్క
  • 6-7 లవంగాలు
  • 1 tbsp షాహీ జీరా
  • 2 అనాసపువ్వు
  • 2 బిర్యానీ ఆకు
  • 1 Cup ఉల్లిపాయ చీలికలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 small bundle పుదీనా
  • 1 small bundle కొత్తిమీర
  • ఉప్పు
  • 2 1/2 Cup నీరు
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • చికెన్ నానబెట్టడానికి:
  • 1 kg చికెన్
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 1/2 tbsp పసుపు
  • చికెన్ మసాలా పొడి కోసం:
  • 2 tbsp ధనియాలు
  • 1 tbsp జీలకర్ర
  • 4-5 యాలకలు
  • 6-7 లవంగాలు
  • 1/2 tbsp మిరియాలు
  • 1.5 inch దాల్చిన చెక్క
  • 1/2 Cup కొబ్బరి పొడి (కొబ్బరి ముక్కలైతే ¼ కప్పు)
  • 1 tbsp గసగసాలు
  • చికెన్ కర్రీ కోసం:
  • 1/4 Cup నూనె
  • 2 Sprigs కరివేపాకు
  • 2 ఉల్లిపాయ తరుగు
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1/2 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • 3 పండిన టమాటో ముక్కలు
  • ఉప్పు
  • 1 tbsp కారం
  • 2 Cups వేడి నీరు
  • కొత్తిమీర తరుగు (కొద్దిగా)

విధానం

  1. బాగారన్నం కోసం రెండు కప్పులు బాస్మతి బియ్యం కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.
  2. కుక్కర్లో నెయ్యి కరిగించి మసాలాలు అన్ని వేసి వేపుకోండి.
  3. వేగిన మసాలాల్లో ఉల్లిపాయ తరుగు బిర్యానీ ఆకు వేసి ఎర్రగా వేపుకోవాలి.
  4. వేగిన ఉల్లిలో కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు పుదీనా కొత్తిమీర అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోవాలి
  5. తరువాత బియ్యం ఉప్పు వేసి రెండు నిమిషాలు వేపి వేడి నీరు పోసుకోండి, తరువాత కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ మీద రెండే విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసి ఆవిరి పోయేదాక వదిలేయండి. తరువాత సర్వ్ చేసుకోండి.
  6. చికెన్కి ఉప్పు పసుపు అల్లం వెల్లులి పేస్ట్ నిమ్మరసం వేసి బాగా పట్టించి కనీసం గంట సేపు ఊరనివ్వండి
  7. మసాలా దినుసుల కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నాని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. మసాలా దినుసులు మాంచి సువాసన వస్తున్నప్పుడు ఎండు కొబ్బరి పొడి గసగసాలు వేసి చిట్లనిచ్చి దింపెయండి. చల్లారాక మెత్తని పొడి లేదా పేస్ట్ చేసుకోండి
  8. నూనె వేడి చేసి కరివేపాకు ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి.
  9. ఉల్లిపాయ మెత్తబడిన తరువాత కొద్దిగా అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి. తరువాత ఊరబెట్టిన చికెన్ వేసి హై ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేదాక వేపుకోవాలి
  10. నూనె పైకి తేలిన తరువాత టమాటో ముక్కలు వేసి మెత్తగా మగ్గిపోయే దాకా మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి మగ్గనివ్వాలి.
  11. టొమాటోలు పూర్తిగా మగ్గిపోయిన తరువాత గరం మసాలా పొడి వేసి ముందు నీరు వేయకుండా 3-4 నిమిషాలు వేపుకోండి.
  12. 3-4 నిమిషాలు మసాలాలో చికెన్ వేగితే నూనె పైకి తేలుతుంది అప్పుడు వేడి నీరు పోసి కలిపి మూత ఆపెట్టి 17 నిమిషాలు వదిలేస్తే చికెన్ పూర్తిగా ఉడికిపోయి నూనె పైకి తేలుతుంది
  13. నూనె పైకి తేలిన తరువాత కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోవడమే!!!
  14. చికెన్ కర్రీతో బాగారన్నం ఒక అద్భుతమైన కాంబినేషన్ తప్పాక అందరికి నచ్చుతుంది. ట్రై చేయండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

  • R
    Rahul Uppusetti
    Recipe Rating:
    Today I tried this recipe it's awesome 😋😋😋
  • S
    Sharanya
    Recipe Rating:
    I've followed the recipe as it is.. It turned out to be amazing Thankyouu
  • S
    Sowjanya
    Recipe Rating:
    I tried the same chicken recipe with grated coconut turned out amazing …. loved it
  • P
    Potheesh vignesh
    Recipe Rating:
    easy to understand thank u