శరీరానికి పుష్టినిచ్చే ఆయుర్వేదిక్ రెసిపీ ఈ మినుములు పులగం. మినుములని ఎర్రగా వేపి బియ్యంతో కలిపి మెత్తగా ఉడికించి తాలింపు పెట్టి చేసే ఈ పులగం పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో మేలు చేస్తుంది.

అన్నం వండిన దానికంటే మరో ఐదారు నిమిషాలు సమయం పడుతుందంతే!!! ఈ ఆయుర్వేదికే మినుములు పులగంతో పప్పు, చారు, పచ్చడి, లేదా పలుచని చప్పటి మజ్జిగ వేసి తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

మినుములు పులగం ముఖ్యంగా డయాబెటిక్స్, థైరాయిడ్తో బాధ పడేవారికి ఒక సంజీవని. పిల్లకైతే దండిగా నెయ్యి వేసి పెడితే ఇష్టంగా తింటారు. ఈ మధ్య డయాబెటిక్స్ ఎక్కువడానికి ఎన్నో కారణాల్లో ఒక ప్రధానమైన కారణం మన తినే ఆహారంలో చేదు వగరు లేకపోవడమే! ఇంకో కారణం పీచు పదార్ధాలు ఉండకపోవడం. ఈ రెండు ఈ మినుములు పులగంలో పుష్కలంగా దొరుకుతాయి!!!

మినుములు పులగం లంచ్ బాక్సులకి ఇంకా బ్యాచిలర్స్ కూడా సులభంగా చేసుకునే తీరులో ఉంటుంది.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు రాగి దలియా

టిప్స్

మినుములు:

  1. కచ్చితంగా ఈ పులగానికి పొట్టుతో ఉండే మినుములు ఉండాలి. అప్పుడు పీచు సమృద్ధిగా ఉంటుంది, ఇంకా చాలా రుచిగా మాంచి పరిమళంతో ఉంటుంది.
  2. నేను పొట్టు మినపప్పు బద్దలుగా ఉండేవి వాడాను, మీరు పొట్టుతో ఉండే మినపగుండ్లు కూడా వాడుకోవచ్చు. మినపగుండ్లు వాడితే మరో అరకప్పు నీరు ఎక్కువగా పోసుకోవాలి అని గుర్తుంచుకోండి.

బియ్యం:

  1. బియ్యాన్ని కుక్కర్లో వండేట్లైతే నానబెట్టనవసరంలేదు. మినుములతో కలిపి వండేసుకోవచ్చు.
  2. పొట్టు మినపప్పు ఉంది కదా ఇంక బ్రౌన్ రైస్ అవసరంలేదు. మరీ ఎక్కువగా ప్రోటీన్ అయిపోతుంది. పెద్దవారికి అరుగుదల కష్టం!!!

మెంతులు:

  1. మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ్. పెద్దవారు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్లు కచ్చితంగా మెంతులు వాడడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు మెంతుల చేదు తినలేరు, కాబట్టి మెంతులు వేయకండి పిల్లల కోసమైతే

తాలింపు:

  1. ఆరోగ్యం కోసం అయితే కచ్చితంగా కోల్డ్ ప్రెస్ (గానుగ) నువ్వుల నూనె వాడుకోండి, ఏంతో శ్రేష్టం!!! నువ్వుల నూనెకి శరీరంలోని హార్మోన్స్ని సమతుల్యంగా ఉండేలా చేసే గుణం ఉంది.
  2. నేను పచ్చిమిర్చి వాడాను, అన్నింటితో నంజుకు తినేలా ఉండడానికి. మీరు కావాలంటే మిరియాలు కూడా వాడుకోవచ్చు. మిరియాలు పప్పుతో మజ్జిగతో నంజుడుకీ పర్లేదు కానీ పచ్చిడితో అంత రుచిగా అనిపించకపోవచ్చు.

వెల్లులి:

  1. రోజూ తగు మోతాదులో వెల్లులి తీసుకోవడం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. వెల్లులి ఇష్టపడని వారు వదిలేయండి.

పచ్చి కొబ్బరి:

  1. పచ్చి కొబ్బరి పూర్తిగా ఆప్షనల్!!! వేస్తే కమ్మగా ఉంటుంది. లేనట్లయితే వదిలేయండి.

మినుములు పులగం - రెసిపీ వీడియో

Black Gram Khichdi | Khichdi | How to make Black Gram Khichidi with Tips

Healthy Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Cook Time 20 mins
  • Total Time 21 mins
  • Serves 4

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 Cup పొట్టు మినుములు
  • 1 Cup బియ్యం
  • ఉప్పు (సరిపడా)
  • 5-6 వెల్లులి
  • 1 tbsp మెంతులు
  • 3 Cups నీళ్లు
  • 1/2 Cup పచ్చికొబ్బరి తురుము
  • For the Seasoning:
  • 1 tbsp నువ్వుల నూనె
  • 2 పచ్చిమిర్చి చీలికలు
  • 1 tbsp జీలకర్ర
  • కరివేపాకు (కొద్దిగా)

విధానం

  1. పొట్టు మినపప్పుని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోవాలి, అప్పుడే మాంచి సువాసనా రుచి పులగంకి
  2. కుక్కర్లో కడిగిన బియ్యం వేపిన మినపప్పు మిగిలిన సామాగ్రీ అంతా వేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆపేసుకోండి. మినపగుండ్లు వాడితే మరో విజిల్ ఎక్కువగా రానివ్వాలి.
  3. తాలింపు కోసం నూనె వేడి చేసి తాలింపు సామాగ్రీ వేసి ఎర్రగా వేపి పులగంలో కలిపేయండి, ఆఖరుగా కొబ్బరి తురుము వేసి కలుపుకోండి.
  4. ఈ పులగం వేడిగా చల్లగా ఎలా తిన్నా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.