కెరట్ పల్లీల ఫ్రై | కేరట్ ఫ్రై ఇవి వేసి చేస్తే గొప్ప రుచి ఆరోగ్యం
ఎప్పుడు చేసినా అందరూ ఇష్టంగా తినే సింపుల్ రెసిపీ కోసం చూస్తున్నారా? అయితే కేరట్ పల్లీల వేపుడు చేసి చూడండి ఎంత ఇష్టంగా తింటారో. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో ఉంది చూడండి.
క్యారెట్ కూర అనగానే చాల మంది ఇష్టపడరు. కానీ ఈ పొడి వేసి చూడండి కూర రుచినే మార్చేసింది. బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు.

టిప్స్
-
పప్పులనన్నింటిని ఒక్కొటిగా సన్నని సెగ మీద వేపుకుని పొడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది పొడి
-
పొడి ముందుగానే చేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ కూర చేసుకోవచ్చు, కానీ అప్పటికప్పుడు చేసిన పొడి రుచి చాలా బాగుంటుంది.
-
నేను తీసుకున్న క్యారెట్ ముక్కలకి నేను పోసిన నీళ్ళు సరిపోతాయ్, ఒకవేళ నీళ్ళు ఎక్కువైతే కేరట్ ఉడికాక నీళ్ళు ఒంపి ముక్కలు చల్లారాక వేసుకోండి

కెరట్ పల్లీల ఫ్రై | కేరట్ ఫ్రై ఇవి వేసి చేస్తే గొప్ప రుచి ఆరోగ్యం - రెసిపీ వీడియో
CARROT PEANUT FRY | Carrot Veppudu | Carrot Poriyal | Carrot Recipes | Easy Lunch Recipes | How to make Carrot Fry
Curries
|
vegetarian
కావాల్సిన పదార్ధాలు
- 1/2 kilo క్యారెట్ ముక్కలు
- 250 ml నీళ్ళు
-
పొడి కోసం
- 1/4 cup వేరు సెనగపప్పు
- 1/4 cup నువ్వులు
- 1/4 cup ఎండుకొబ్బరి పొడి
- 1 tbsp ధనియాలు
- 1 tbsp సెనగపప్పు
- 1 tsp జీలకర్ర
- ఉప్పు
- 7 - 8 వెల్లూలి
- 1 tbsp కారం
-
వేపుడు కోసం
- 3 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 రెబ్బ కరివేపాకు
- 1/2 tsp పసుపు
- 2 tsps కొత్తిమీర
విధానం
-
నీళ్ళలో క్యారెట్ ముక్కలు వేసి మూతపెట్టి క్యారెట్ ముక్కలని పూర్తిగా ఉడికించుకోండి.
-
పాన్లో వేరుసెనగపప్పు, సెనగపప్పు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు ఒక్కొటిగా వేపుకోండి, ఆఖరున ఎండు కొబ్బరి పొడి వేసి ఎర్రగా అయ్యేదాకా ఓ నిమిషం వేపుకుని దిమ్పెసుకుని చల్లార్చుకోండి.
-
చల్లారిన వాటిని పొడిగా చేసుకుని తరువాత అందులో వెల్లూలి, కారం, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి వేపుకుని కాస్త పసుపు కూడా వేసి వేపుకుని ఉడికిన్చుకున్న క్యారెట్ ముక్కలు వేసుకోండి.
-
క్యారెట్ ముక్కలు వేసి 7-8 నిమిషాల పాటు మీడియం ఫ్లేం మీద వేపుకోండి.
-
ఆ తరువాత ½ కప్ పొడి వేసి బాగా కలుపుకుని దింపే ముందు కొత్తిమీర తరుగు వేసి దిమ్పెసుకోండి.
-
ఇది వేడి వేడి అన్నం లోకి చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
1 comments