కాలీఫ్లవర్ సెనగపప్పు కూర
కాలీఫ్లవర్ సెనగపప్పు ఇంకా కమ్మని కొబ్బరి ఉల్లి టమాటో పేస్ట్లో దగ్గర ఉడికించి చేసే ఈ కాలీఫ్లవర్ కూర రైస్ రోటీలతో ఎంతో రుచిగా ఉంటుంది.
క్యాలిఫ్లవర్ అంటే అందరికీ ఇష్టమే ఉన్నా చాలా మందికి ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే రుచిగా ఉంటుంది లాంటివి తెలియక సింపుల్గా ఫ్రై లేదా టమాటో వేసి వండేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అంత స్పెషల్ రెసిపీ ఏమి కాకపోయినా కొంచెం కొత్తగా చాలా రుచిగా ఉంటుంది.
ఎక్కువెక్కువ కారాలు మాసాలలు నూనెలు లేకుండా నోటికి కమ్మగా పొట్టకి హాయిగా ఉంటుంది. తప్పక అందరికి నచ్చేస్తుంది ఈ సింపుల్ కాలీఫ్లవర్ సెనగపప్పు కూర!!!
మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుకాలీఫ్లవర్ మెంతి కూర

టిప్స్
కాలీఫ్లవర్:
-
కాలీఫ్లవర్ ముక్కలు కట్ చేశాక కాసేపు వేడి నీటిలో ఉంచితే పురుగులేమన్నా ఉంటె వచ్చేస్తాయి.
-
కాలీఫ్లవర్ 2 నిమిషాలు కొద్దిగా నూనెలో వేసి వేపితే పసరు వాసన పోతుంది. అంత ఎక్కువగా వేపనవసరం లేదు
సెనగపప్పు:
- సామ్యమా లేనప్పుడు సెనగపప్పు వేడి నీళ్లలో వేసి వదిలేస్తే త్వరగా నానిపోతాయ్. లేదా కనీసం 2-3 గంటలు నానితే కూరలో త్వరగా మగ్గిపోతాయ్!!!
ఇంకొన్ని తీరుల్లో:
-
నచ్చితే ఉంటె కాలీఫ్లవర్ కి బదులు ఇదే తీరులో బ్రొకోలీతో చేసుకోవచ్చు.
-
సెనగపప్పుకి బదులు నానబెట్టి కుక్కర్లో మెత్తుగా ఉడికించుకున్న ముడి సెనగలు, పెసలు, అలసందలు, ఉలవలు ఇలా మార్చి రోజుకో తీరులో చేసుకోవచ్చు.
కాలీఫ్లవర్ సెనగపప్పు కూర - రెసిపీ వీడియో
Cauliflower Chana Dal Curry| Cauliflower Senagapappu | How to Make Cauliflower Chanadal Curry
Prep Time 1 min
Soaking Time 2 hrs
Cook Time 25 mins
Total Time 2 hrs 26 mins
Serves 6
కావాల్సిన పదార్ధాలు
- 300 gms కాలీఫ్లవర్ ముక్కలు
- 1 tbsp నూనె
- పసుపు (కొద్దిగా)
- 1/4 Cup పచ్చి సెనగపప్పు
-
గ్రీవీ కోసం:
- 2 tbsp నూనె
- 1 tbsp జీలకర్ర
- 2 tbsp ధనియాలు
- 2 పచ్చిమిర్చి
- 1 ఉల్లిపాయ చీలికలు
- 1/4 Cup పచ్చి కొబ్బరి ముక్కలు
- 3 పెద్ద సైజు టమాటో ముక్కలు
- ఉప్పు
- 1 tbsp కారం
- 1/4 tbsp పసుపు
-
కూర కోసం:
- 1/2 tbsp జీలకర్ర
- 3 Sprigs కరివేపాకు
- 1 tbsp నూనె
- 1.5 Cup నీళ్లు
- కొత్తిమీర (కొద్దిగా)
విధానం
-
సెనగపప్పుని వేడి నీళ్లలో వేసి నానబెడితే త్వరగా నానుతాయి.
-
నూనె వేడి చేసి కాలీఫ్లవర్ ముక్కలు పసుపును వేసి 2- 3 నిమిషాలు వేపి తీసుకోండి
-
ఇంకొద్దిగా నూనె వేసి జీలకర్ర ధనియాలు వేపి పచ్చిమిర్చి ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయ మెత్తబడనివ్వాలి.
-
మెత్తబడిన ఉల్లిలో పచ్చికొబ్బరి ముక్కలు వేసి ఒక నిమిషం వేపుకోండి. ఆ తరువాత టమాటో ముక్కలు ఉప్పు కారం పసుపు వేసి టమాటో పైన స్కిన్ సెపెరేట్ అయ్యాయేదాకా మగ్గించి తీసి మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి
-
కొద్దిగా నూనె వేడి చేసి జీలకర్ర కరివేపాకు వేసి వేపి రుబ్బుకున్న ఉల్లి కొబ్బరి పేస్ట్, నానబెట్టిన సెనగపప్పు నీళ్లు పోసి కలిపి సెనగపప్పు మెత్తగా మగ్గేదాకా ఉడికించాలి
-
మెత్తగా ఉడికిన సెనగపప్పులో వేపుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసి కలిపి కాలీఫ్లవర్ మెత్తబడే దాకా వేపి పైన కాస్త తరుగు చల్లి తీసుకోండి

Leave a comment ×
3 comments